ఆల్ఫోర్స్ లో ఘనంగా వసంత పంచమీ

భైంసా లో పూజా కార్యక్రమం

నేడు ఘనంగా సరస్వతీ పూజా కార్యక్రమాన్నీ ఆల్ఫోర్స్ ఉన్నత పాఠశాల భైంసా పట్టణంలో నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్షరాభ్యాసాలు చేయించారు. ఈ వేడుక కనుల పండుగను తలపించింది. ప్రధానోపాధ్యాయురాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు జ్ఞానాన్ని పొందాలంటే చదువులతల్లి అనుగ్రహం అవసరం అంతే కాకుండా భక్తి శ్రద్ధలు అలవర్చుకోవాలి అని హితబోధ చేశారు. మంచి బుద్దిని, చదువులో సిద్ధిని విద్యార్థులకు ప్రసాదించుమని జ్ఞాన సరస్వతిని “వ్యాస నివాసర వాసి ప్రసన్న వదన మయూరాక్షి స్వరశ సద్భుద్ది ప్రసాదిని సుస్వాగతంబు నీకు హృదయ క్షేత్రి సరస్వతీ” అని ప్రార్ధన చేశారు. గొప్పగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.