ప్రసాద్ గారి పాట 2

ఇంతేనా ఇంతేనా ప్రేమించే ప్రేమేనా

*పాట:-*

*పల్లవి:*

ఇంతేనా ఇంతేనా ప్రేమించే ప్రేమేనా
వింతైన వింతైన అమ్మాయి మనసైనా(2)
ఎంతైనా ఎంతైనా ప్రేముకుడిని నేనైనా
అవసరాలే తీరాక వదిలివెళ్ళే నీవే మనిషైనా…!(2)

*చరణం:1*

పరవళ్ళే తొక్కేటి నది నేనైనా
ఒడ్డున చేరి నిన్ను తాకి దాహం తీర్చి అలుసైనుగా
ఎగిసిపడే అలల సంద్రం నేనైనా
నీ పాదాలే తాకిన కారణాన చులకనేగా…!!(2)

*చరణం:2*

నడిపించా నడిపించే దారి నే నీ గమ్య గమనమై
అడుగులే పడక నేనున్నా ఇపుడే గతుకుల దారిలోనే(2)
చీకటి బ్రతుకు నీ క్షణమున నే చేరా వైలుగై
అతుకుల గాయమైన హృదయమున నీవే చేరువవునా…!(2)

*చరణం:3*

సరిగమలై సాగేటి సంగీతం నేనైనా
సందర్భంగా చేసి విడిచావు వాయిద్యాలుగా
పుస్తకాలై ఉండేటి గ్రంథాలయమై నేనైనా
చదివి తెలుసుకుని మసులుకునే విసిరావుగా
ఇప్పటి ఎప్పటికైనా నీ నేనే నేనై లేని తోడగునా
ఎల్లప్పుడూ నా విషయ వివరాల చప్పుడు నీడై నీవేనుగా…!!(2)

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-
Lyrics / Lyricist ✍️
– Dr. Dhavala V.S.S.S.R.Prasad
Suresh(Rjy)
Mob:9492754546

Get real time updates directly on you device, subscribe now.