ప్రసాద్ గారి పాట 1

కంటున్నా కంటున్నా కలలే కంటున్నా

🌿🌼☘️🌸🍀🌷🍃🌾🍂🌻

*పాట:-*

*పల్లవి:*

కంటున్నా కంటున్నా కలలే కంటున్నా
చూస్తున్నా ప్రియా కనుపాప మాటున(2)
నీ రూపు ఊహించి గీసానే చిత్రమే మనసు లోతున
మన పరిచయ పదముల కలయికనే లిఖించా మస్తిష్కం పంచన…!(2)

*చరణం:1*

నా నడకనే వెతుకుతున్నా నీ అడుగుల వరసన
నాతోనే నేనే యుద్ధం చేస్తున్నా
పొగ మంచులో మబ్బుల చినుకుల చాటున ఉంటున్నా
నిత్యం నాతో నేనే చస్తున్నా
నా వలపు కావ్యానికి నీ ప్రతిస్పందనకై తనువు ఆలాపన…!!(1)

*చరణం:2*

నీ పిలుపులే వింటున్నా పక్షుల స్వరమునా
నా మనోభావ మధురానుభూతే కలిగించే కడలి తరంగాలునై
నీ పంచ ప్రాణాలే తోడుండే నా పంచ భూతాల్లోనే
కష్ట సుఖాల్లో నీకై నేనై తోడుంటా
జీవిత జీవన విధానమై నివేదనులునై…!!(1)

నా నడకనే… తనువు ఆలాపన…!!(1)

నీ పిలుపులే… నివేదనులునై…!!(1)

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-
Lyrics / Lyricist ✍️
– Dr. Dhavala V.S.S.S.R.Prasad
Suresh(Rjy)
Mob:9492754546

🍁🌼🍂🌻🍂🌺🎋🌹🌾💐

Get real time updates directly on you device, subscribe now.