సహాయం చేయండి

ఎముక మజ్జ మార్చాలి

అందరికీ నమస్కారం,

పి.ఆర్. సి.ఏ (పూర్ రెడ్ సెల్ అప్లేసియా)అనే వ్యాధితో పోరాడుతున్నాడు. మా బాబుకు ఎర్ర రక్త కణాలు తయారు కావు. మా బాబుకు మిగిలిన ఏకైక ఆశ ఎముక మజ్జ (bone marrow transplantation)మార్పిడి.

నా పేరు పి. చిరంజీవి రావు. మా బాబు పేరు రియాన్ జస్వంత్ ఇప్పుడు వయస్సు 4 సంవత్సరాల 8 నెలలు. మా బాబుకు పుర్ రెడ్ సెల్ అప్లేసియా(PRCA) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది చాలా అరుదైన వ్యాధి. ఇప్పటి వరకు చాలా మందులు వాడాము. కాని అవి ఏవి పని చేయలేదు. చాలా ఖర్చుపెట్టాము. అది నయంకాలేదు. చివరకు ఎముక మజ్జ మార్పిడి(Bone Marrow transplantation) చెయ్యాలి అంటున్నారు. 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని సి.ఎమ్. సి. వెల్లూరు(తమిళనాడు) లో చెప్పారు. నెలకు ఒకసారి రమ్మంటున్నారు. వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ బ్లడ్ టెస్ట్ లు అన్ని చేస్తున్నారు. చాలా ఖర్చు అయ్యింది ఇప్పటివరకు‌. బాబుకు నా బోన్ మోరో 70% సెట్ అయ్యింది. జనవరి 5 కి రమ్మన్నారు. నా బోన్ మోరోతో ఆపరేషన్ చేస్తామని చెప్పారు. మా బాబు 6వ నెలలో ఉండగా ఈ వ్యాధిని హైదరాబాదులో లిటిల్ స్టార్ హాస్పటల్ లో హిమటాలజిస్టు దండపూడి రమణగారు బోన్ మోరో టెస్ట్ చేసి తెలిపారు. అప్పటి నుంచి వైద్యం జరుగుతునే ఉంది. ఇప్పటి వరకు 31 సార్లు బ్లడ్‌ ఎక్కించారు. ఇలా ఎక్కిస్తే కొన్ని సంవత్సరాలు మాత్రమే బాగుంటాడు. తర్వాత చెప్పలేము అంటున్నారు. ఎముక మజ్జ మార్పిడి చేస్తే అది సెట్ అయితే లైఫ్ ఇచ్చినవాళ్ళమవుతామని డాక్టర్లు చెప్పారు. ఇప్పటి వరకు నా కష్టార్జితంతో రక్తమార్పిడి చేసి బ్రతికించుకుంటు వస్తున్నాను. ఇలా ఎంతకాలం అంటే జవాబు లేదు. కాని ఇది మంచిది కాదు బోన్ మోరో ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు. మాకు 25 లక్షల పెట్టుకునే ఆర్థిక స్థోమత లేదు. ఇప్పటివరకు మెడిసిన్ ద్వార నయమవుతుందని ఆశతో ఎదురు చూశాము. బోన్ మోరో ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. ఇంత డబ్బు పెట్టుకునే ఆర్థిక స్థోమత లేదు. దయచేసి ఆర్థిక సహాయం కోసం మీ ముందుకు వచ్చాను. ఇలా అడగడం చాలా చాలా బాధగా ఉంది. బిడ్డను బ్రతికించుకోవాలనే తపనతో ఇలా చేస్తున్నాను. Please help me and save my child🙏🙏🙏🙏😭😭😭😭

Get real time updates directly on you device, subscribe now.