నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథ రచనకు ఆహ్వానం

తెలంగాణ సారస్వత పరిషత్తు

నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపమునకు రచనల ఆహ్వానం

సమదర్శిని వెబ్ న్యూస్ / నిర్మల్ అర్బన్ : తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా సమగ్ర సర్వస్వానికి వివిధ అంశాలపై రచనలు ఆహ్వా నిస్తున్నట్లు నిర్మల్ జిల్లా కన్వీనర్ తుమ్మల దేవరావ్, కో కన్వీనర్లు డాక్టర్ దామెర రాములు, డాక్టర్ చక్రధారి, నెరేళ్ల హన్మంతులు తెలిపారు. చరిత్ర, సంస్కృతి, కళలు, భౌగోళిక పరిస్థితులపై రచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలి పారు. తెలంగాణ సాహిత్య పరిషత్తు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బృహత్ కార్యంలో ఆసక్తి గల రచయితలు కన్వీనర్ తుమ్మల దేవరావ్ ను సంప్రదించాలి. ఖానాపూర్ ప్రాంతం వారు అమరవేని వెంకట రమ ణను, భైంసా ప్రాంతం వారు జాదవ్ పుండలిక్ రావును సంప్రదించాలి. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8985742274, 9849247244 సకాలంలో ముందుకు వచ్చిన రచయితలకు రాయవలసిన అంశం తెలుపబడుతుందని తెలిపారు. వ్యాసాల ముద్రణ తుది నిర్ణయాలు పరిషత్తు నిర్వహిస్తుంది

Date: 09/01/2023, Edition: Nirmal Main, Page: 1 Source : https://samadarshini.com/

Get real time updates directly on you device, subscribe now.