స్మార్ట్ సిటీస్ 2023 సదస్సు ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ (ఐఎస్ఏసి) 2022 విజేతలను సన్మానించనున్న రాష్ట్రపతి
స్మార్ట్ సిటీస్ 2023 సదస్సు
ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ (ఐఎస్ఏసి) 2022 విజేతలను సన్మానించనున్న రాష్ట్రపతి
Posted Date:- Sep 24, 2023, samadarshini.
మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో 2023 సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఇండియా స్మార్ట్ సిటీస్ 2023 సదస్సును కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇండోర్‌లోని బ్రిలియంట్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు జరుగుతుంది. సదస్సులో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 100 స్మార్ట్ సిటీలు పాల్గొంటాయి. వినూత్న ఆవిష్కరణల ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న 100 స్మార్ట్ సిటీలు పట్టణ ప్రాంత అభివృద్ధిలో వస్తున్న మార్పులకు మార్గదర్శకత్వం వహిస్తున్నాయి. దేశంలో భవిష్యత్తు నగరాల అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా 100 స్మార్ట్ సిటీలు మిషన్ కింద కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. తమ నగరాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను సదస్సులో 100 స్మార్ట్ సిటీలు వివరిస్తాయి.
4వ ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ (ఐఎస్ఏసి) 2022 విజేతలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2023 సెప్టెంబర్ 27న సత్కరిస్తారు. ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీలను 2018 నుంచి కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని స్మార్ట్ సిటీస్ మిషన్ నిర్వహిస్తోంది. మిషన్ అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటిగా ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ అమలు జరుగుతోంది.
కార్యక్రమాలు, పథకాలు అమలు చేయడానికి వినూత్న విధానాలు, వ్యూహాలు అమలు చేస్తూ ఉత్తమ విధానాలకు రూపకల్పన చేసిన నగరాలను గుర్తించడం ప్రధాన లక్ష్యంగా పోటీ జరుగుతుంది.
సదస్సులో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ సి. పటేల్, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,కమ్యూనికేషన్లు , రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్, మధ్యప్రదేశ్ పట్టణాభివృద్ధి మంత్రి శ్రీ భూపేంద్ర సింగ్ పాల్గొంటారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ అధికారులు, మొత్తం 100 స్మార్ట్ సిటీల మేయర్లు, కమిషనర్లు, పరిశ్రమ భాగస్వాములు, విద్యావేత్తలు, స్మార్ట్ సిటీస్ మిషన్‌తో అనుబంధించబడిన ప్రజా సంఘాల ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు.
రెండు రోజుల పాటు 2023 సెప్టెంబర్ 26, 27 తేదీల్లో సదస్సు జరుగుతుంది. సదస్సు మొదటి రోజున ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీలో గెలుపొందిన ప్రాజెక్ట్‌లను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జరుగుతుంది.ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఇండోర్ , ఉజ్జయినిలో అమలు జరిగిన ఐకానిక్ ప్రాజెక్ట్‌లను ప్రతినిధులు సందర్శించి ప్రాజెక్టుల సీఈఓ లతో చరిచాలు జరుపుతారు.
2వ రోజున ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ 2022 అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.కార్యక్రమంలో 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 31 ప్రత్యేక నగరాలు, 7 భాగస్వామ్య సంస్థలకు బహుమతులు అందించి సత్కరిస్తారు. ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డులను 66 మంది గెలుచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ సిటీస్ మిషన్ నాలుగు నివేదికలను విడుదల చేస్తుంది. ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ 2022 సంక్షిప్త నివేదిక, స్మార్ట్ సిటీస్ మిషన్ – స్థానికంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన అనే అంశంపై యూఎన్ హాబిటాట్ రూపొందించిన నివేదిక,ఎస్ ఈ ఎం వార్తాలేఖల సంగ్రహం, ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ 2023 అవార్డు కరపత్రం విడుదల చేస్తారు. అవార్డుల పంపిణీ ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత అవార్డు గెలుచుకున్న స్మార్ట్ సిటీల సీఈఓ లు వారి అనుభవాలు,విధానాలు వివరిస్తారు.
స్మార్ట్ సిటీస్ మిషన్ సంక్షిప్త వివరణ:
2015 జూన్ 25వ తేదీన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభమయ్యింది. ముఖ్యమైన మౌలిక సౌకర్యాలు కల్పించడం, పట్టణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, స్థిరమైన పర్యావరణం, మంచి జీవన ప్రమాణాలను అందించడం లక్ష్యంగా మిషన్ అమలు జరుగుతోంది.
దేశంలో పట్టణాభివృద్ధి సాధనలో ఒక నమూనా మార్పు తీసుకురావడానికి ఉద్దేశించిన ఒక పరివర్తన మిషన్. ప్రాజెక్టు కింద 1.1 లక్షల కోట్లకు పైగా విలువ చేసే 6,000 కి పైగా ప్రాజెక్టులు అమలు జరిగాయి. మిగిలిన ప్రాజెక్టులు 30 జూన్ 2024 నాటికి పూర్తవుతాయి.
మిషన్ లో భాగంగా 100 స్మార్ట్ సిటీలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC).లు పనిచేస్తున్నాయి. పట్టణ నిర్వహణ కోసం సాంకేతికతను ఉపయోగించి నగర కార్యకలాపాలను అమలు చేయడంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కీలకంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నేరాల పర్యవేక్షణ, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడం, , రవాణా నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా, విపత్తు నిర్వహణ మొదలైన విభిన్న రంగాల్లో పట్టణ సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి.
రవాణా, ఇంధనం,, నీరు, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, స్మార్ట్ గవర్నెన్స్ మొదలైన వాటికి సంబంధించిన విభిన్న రంగాలలో 100 స్మార్ట్ సిటీలు ప్రాజెక్టులను చేపట్టాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 24,265 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన 1,192 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. 16,905 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మరో 494 ప్రాజెక్టులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇంధన రంగంలో 573 ప్రాజెక్టులు పూర్తయ్యాయి, 94 ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయి. . నీటి సరఫరా, పారిశుధ్యం, పరిశుభ్రత రంగాల్లో 34,751 కోట్ల రూపాయల విలువ చేసే 1,162 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 18,716 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మరో 333 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 100 స్మార్ట్ సిటీలు ఇప్పటికే 6,403 కోట్ల రూపాయల ఖర్చుతో 100 స్మార్ట్ పట్టణాలు 1,063 బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేశాయి. 5,470 కోట్ల విలువైన మరో 260 ప్రాజెక్ట్‌లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 8,228 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన 180 ) ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. మరో 27 ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. మార్కెట్ అభివృద్ధి, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ వంటి ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించి 652 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 267 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాల రంగంలో (ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం మొదలైనవి), 679 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 153 కొనసాగుతున్నాయి.
ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ
గతంలో 2018, 2019 2020లో మూడు సార్లు ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీలు జరిగాయి. 100 స్మార్ట్ సిటీలలో స్థిరమైన అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లు , వినూత్న ఆలోచనలను ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ ద్వారా గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తున్నారు. జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి, సమానమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన నగరాలను ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ గుర్తిస్తుంది. 4వ ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ ఏప్రిల్ 2022లో సూరత్‌లో జరిగిన ‘స్మార్ట్ సిటీస్-స్మార్ట్ అర్బనైజేషన్’ కార్యక్రమంలో ప్రారంభమయ్యింది. రెండు దశల్లో ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ నిర్వహించారు. మొదటి దశలో ‘క్వాలిఫైయింగ్ స్టేజ్’ లో నగరం పనితీరు పరిశీలనకు తీసుకుంటారు. తర్వాత నిర్వహించే ‘ప్రతిపాదన దశ’ ఈ క్రింది విధంగా ఆరు అవార్డు కేటగిరీల కోసం స్మార్ట్ సిటీలు తమ నామినేషన్‌లను సమర్పించవలసి ఉంటుంది:
ప్రాజెక్టు అవార్డులు: 10 విభిన్న అంశాలు
వినూత్న అవార్డులు: 2 విభిన్న అంశాలు
సిటీ అవార్డులు: 2 తరగతులు : జాతీయ, జోన్,
రాష్ట్ర, కేంద్రపాలిత స్థాయి అవార్డు.
భాగస్వాముల అవార్డులు, 3 విభిన్న అంశాలు
ఇండియా స్మార్ట్ సిటీస్ 2022 కోసం అర్హత పొందిన 80 స్మార్ట్ సిటీల నుంచి మొత్తం 845 నామినేషన్లు అందాయి. ఈ ఎంట్రీల పరిశీలన 5 దశల్లో జరిగింది. . మొదటి దశలో 845 ప్రతిపాదనల ముందస్తు పరిశీలన చేపట్టారు. 50% (423 ప్రతిపాదనలు) తదుపరి దశకు అర్హత సాధించాయి. రెండవ దశలో ప్రతి అవార్డు కేటగిరీకి మొదటి 12 ప్రతిపాదనలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) జ్యూరీ గుర్తించింది. మూడవ దశలో ప్రతి ప్రతిపాదన ప్రతిపాదకుడు సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్‌కు ప్రదర్శనను అందించారు. వీటి నుంచి మొదటి 6 ప్రతిపాదనల ఎంపిక జరిగింది. చివరిగా 4వ దశలో మొదటి 6 స్థానాల్లో నిలిచిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్లు, నిపుణులతో కూడిన జ్యూరీ పరిశీలించింది. స్మార్ట్ సిటీస్ మిషన్ వున్నత స్థాయి సంఘం ప్రతి అవార్డు కేటగిరీకి టాప్ 3 ప్రతిపాదనలు గుర్తించింది. ఐదు అవార్డుల కేటగిరీల కింద అందిన మొత్తం 845 దరఖాస్తుల నుంచి 66 తుది విజేతలు ఎంపిక అయ్యారు. ప్రాజెక్ట్ తరగతిలో 35 అవార్డులు, ఇన్నోవేషన్ తరగతిలో ఆరు అవార్డులు, జాతీయ/ జోన్ సిటీ తరగతిలో 13 అవార్డులు, రాష్ట్ర /కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో 5 అవార్డుల
భాగస్వామ్య తరగతిలో 7 అవార్డులు ప్రధానం చేస్తారు.