నమ్మకానికి మరో రూపమే మానవుడు

శివుని మాట

నమ్మకానికి మరో రూపమే మానవుడు

దేవతలు ఎప్పుడు ఒకే మాటపై నిలబడుతారు. అలాగే మనుషులు కూడా ఖచ్చితంగా ఇచ్చిన మాటమీద నిలబడాలని ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాసరే మాట తప్పకూడదని అంటారు. అందుకు ఒక ఉదాహరణ ను చూద్దాం.
ఒక రాజు ఒక రోజు కదిలి వెళ్ళి శంకరుని  దర్శనం చేసుకొని ధ్యానంలో కూర్చుంటాడు. అప్పుడు శివుడు వచ్చి నాకు ఒక మాటివ్వు అంటాడు. దేవుడే వచ్చి ఆడిగాడని ఉబ్బితబ్బిబ్బి పోయి రాజు. అయ్యా నీ ఇష్టం అని అంటాడు. వెంటనే శివుడు “నీవు ఈ గుడికి వచ్చిన భక్తులకు నా వారం నాడు భోజనాలు చేయించు పుణ్యం వస్తది చేయిస్తావు కదా” అని అన్నాడు శివుడు. రాజు దేవుడే కదా నా మేలుకోరి చెపుతున్నాడని భావించి సరే అన్నాడు. సరే కాదు మాటివ్వు అన్నాడు. మాటిస్తున్నాను అని రాజు అనగానే ఎదురుగా ఎవరు కనబడలేదు. అయినా దేవుడు చెప్పాడని ప్రతి సోమవారం రోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు. పొలంలో పంటలు పండి రాబడి రావడంతో దానితో భోజనాలు పెట్టించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. కదిలికి వచ్చిన వారందరికీ కడుపునిండా అన్నం పెట్టిస్తున్నాడు. అనుకోకుండా ఒక సోమవారం ఎంత ప్రయత్నించినా చిల్లిగవ్వ కూడా దొరకలేదు ఆరోజు రాజు దేవునికి ఇచ్చిన మాట పోతుందని భయపడుతూ ధ్యానం చేస్తాడు. శివయ్య వచ్చి ఈ పరిస్థితులలో ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. రాజు అన్నా మాట తప్పాలని లేదు అన్నాడు. నీవు ఇంకాస్త ప్రయత్నం చేయుమని చెప్పి వెళ్లిపోయాడు. కొంత సమయం తరువాత చాలామంది వచ్చి భోజనాల కోసం వేచిచూస్తున్నారు. ఒక ముసలావిడ వచ్చి ఇగో బియ్యం తీసుకో మాటిస్తే సరిపోదు. మాటమీద నిలబడాలి ఎం మనిషివి నీవు  అని చివాట్లు పెట్టి వెళ్ళిపోతుంది. రాజు బాధపడ్డాడు మౌనం గా తన పనిని చేసుకోసాగాడు. కొన్ని సంవత్సరాలు హాయిగా లోటు లేకుండా గడిచిపోయింది.  ప్లవ నామ సంవత్సరం రానే వచ్చింది. ఉగాది ఉగాదిలా లేదు అంతా కఠినమైన కరువు వచ్చేసింది. పంటలు లేవు , పశువులకు తిండిలేదు. అడవి ఆకులన్నీ రాల్చుకుంది. పచ్చగడ్డి కనుచూపు మెరలో కనిపిస్తలేదు. ప్రజలందరికీ తినడానికి తిండి లేదు. రాజు గుండె ఝల్లుమంది నిస్సహాయస్థితి శివుని మాట మీరవల్సిన పరిస్థితులు వస్తాయేమో నని రాజు భాదపడ్డాడు. దిక్కుతోచని స్థితిలో ధ్యానం చేస్తుంటే శంకరుడు వచ్చి ఈ వారం భోజనాలు లేవు. ఎం చేస్తున్నావు నీవు అసలు.  ఈ నెలలో అన్నా భోజనాలు పెట్టించు. మనుషులంతా ఇంతేనా మాట కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళను చూసాను. కానీ నీ లాంటి వాన్ని ఇప్పుడే చూస్తున్నా ?. బుద్ది గడ్డితిందా ? మాట ఇచ్చే ముందు నాతోని కాదని అంటే సరిపోయేది. భోజనాలు శివరాత్రి వరకైనా పెట్టించు. లేదనుకో శాపం పాపం తగిలి ఇంతకింత అనుభవిస్తావు అని కోపంగా శివుడు వెళ్ళిపోయాడు. రెండు పక్షాల సమయం ఉంది. రాజు ఇంటిని వదిలి భిక్షాటన చేయుటకు బయలుదేరాడు. ఊరూరు తిరిగి అడుక్కుంటే ఐదు కిలోల బియ్యం జమ అయ్యాయి. ఏమి చేయాలో తెలియని పరిస్థితి రాజుది ప్రయత్నం చేస్తూనే వున్నాడు అయినా ఫలితం శూన్యం. రాజు వెంటే వుండే శివునికి జరిగేదంతా తెలియదా? తెలుసు కానీ ఏమీ చేయడానికి వీలు లేని విధంగా జీవితంలో మార్పులు సంభవించాయి. శివుడు ప్రత్యక్షమై నా నమ్మకానికి మరో రూపమే మనిషి నా నమ్మకాన్ని వమ్ము చేయకు అని సెలవిచ్చాడు. అందుకే నమ్మకం అనేది నిరంతరం మారుతూవుంటుంది.
పాలలో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లు  పరిస్థితులల్లో నమ్మకం దాక్కొని వుండి ఎన్నో మహా అద్భుతాలను వ్యక్త పరుస్తుంది. కాకపోతే కాస్తంత ఓపిక, మనోధైర్యంతో ఉంటే కాలమే సమాధానం అందిస్తుంది.

రచన
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
9849808757

Get real time updates directly on you device, subscribe now.