ఉమ్మడి జిల్లాలో గెస్ట్ ప్యాకల్టీ

Ant

అనంతపురం సమదర్శిని న్యూస్ : ఉమ్మడి జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల బోధనకు గెస్ట్‌ ఫ్యాకల్టీలను నియమించనున్నారు. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ విభాగం జిల్లా కో–ఆర్డినేటర్‌ ఎ.మురళీకృష్ణ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

మలుగూరు పాఠశాలలో టీజీటీ ఫిజిక్స్‌, హిందూపురం బాలికల పాఠశాలలో టీజీటీ గణితం, పీజీటీ ఫిజిక్స్‌, రొళ్ల పాఠశాలలో టీజీటీ ఫిజిక్స్‌, పీజీటీ ఫిజిక్స్‌ టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆయా స్కూళ్లలోకానీ, జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయంలో గాని దరఖాస్తులు అందజేయవచ్చు. బీఈడీలో సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వారు అర్హులు. బాలికల కళాశాలలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. టెట్‌ అర్హతతో పాటు ఇంగ్లీష్‌ మీడియం బోధనలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

Get real time updates directly on you device, subscribe now.