సీఎం కు చెప్పిన శ్రీహరి రావు

అతిథి అధ్యాపకుల గురించి

అతిథి అధ్యాపకులు కుచాడి శ్రీహరి రావు ను కలిసి తమ వ్యథలను చెప్పుకున్నారు. వారు సీఎం కు విషయాన్ని చేరవేశారు. వివరాల్లోకి వెళ్తే

అతిథులు గా గత ప్రభుత్వం మా సేవలను గుర్తించకుండా మా జీవితాలతో ఆడుకుంది.

మేము రాష్ట్ర వ్యాప్తంగా
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్లో
మహాత్మ జ్యోతిబా పూలే సొసైటీ ల్లో
సోసియల్ వెల్పేర్ ల్లో
మైనార్టీ వెల్పేర్ ల్లో మొదలైన వాటిల్లో వెట్టి చాకిరి చేయించు కొని వదిలేస్తుంది. రినివల్ అయితే కొంత మా బతుకులు బాగు పడుతాయి.

కనీసం మాకు యూజీసి ప్రకారం జీతం ఇవ్వకుండా కేవలం పిరియడ్ కు లెక్కకట్టి ఒక దానికి 390 చెల్లించిన మాకు న్యాయం జరుగలేదు. ఒక పిరియడ్ కు 1500 చెల్లించాలని యూజీసి చెప్పినప్పటికి తెలంగాణ గత ప్రభుత్వం పట్టించు కోలేదు. సెలవుల్లో జీతం రాదు. ఆల్మానిక్ లేకపోయినా జీతం కట్టియ్యరు. కూలీ పనులకు వెళ్లిన వారికైనా కూలీ పడుతది కాని మా బతుకు అంతకన్నా హీనంగా వున్నాయి .

సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశించిన పట్టించు కోలేదు టీఆరెస్ పార్టీ ప్రభుత్వం. రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పని చేసిన కనీసం నెలకు ఇంతా జీతం అనేది లేదు. సంవత్సరము జీతం రాదు. 6 నెలలు జీతం 12 నెలలు పని, మా పిల్లల చదువులు, మా పొట్ట, బట్టల కోసం అడుక్కోవడం తప్ప మేం మిగులు బాటు చేసుకునే అవకాశం లేదు.

అతిథి అధ్యాపకుల జేఏసీ చొరువతో కాంగ్రెస్ మేనిపెస్టో లో మా అంశాన్ని చేర్పించడం జరిగింది. శ్రీహరి రావు గారు ఇచ్చిన లేఖ ద్వారా మేనిపెస్టో లో అతిథి అధ్యాపాకుల అంశం ప్రాధాన్యత పొందింది. ఎన్నో సమస్యలు ఎదురుకొంటున్నాం. మా బాధలు తీర్చండి అని శ్రీహరి రావును అతిథి అధ్యాపకులు వేడుకున్నారు. వెంటనే సీఎం తో శ్రీహరి గారు మాట్లాడుతాను అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వల్ల 10 సంవత్సరాల వయస్సు పెరిగి పోయి. ఉద్యోగాల కిచ్చే అర్హత వయస్సు ను కోల్పోయాం. తెలంగాణ కోసం పోరాడి మేము సాధించుకున్నది ఏమి లేదు మా బతుకులు కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోనైనా బాగు పడతాయనే నమ్మకం తో మీ ముందుకు వచ్చామని అతిథి అధ్యాపకులు శ్రీహరిరావు తో అన్నారు

ఈ కార్యక్రమం లో

1. డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ ( జేఏసీ గెస్టు ప్యాకల్టీ స్టేట్ ప్రసిడెంట్ ఇన్ తెలంగాణ )

2. త్రిపాఠి వెంకట్ రెడ్డి (తిరుపతి రెడ్డి )(జేఏసీ గెస్టు ప్యాకల్టీ జోనల్ ప్రసిడెంట్ )

3. సంగెం జోహార్
4. సాయన్న
5. కాశీనాథ్
4) భీమ్ రావు
5) శ్రీనివాస్
6) సతీష్
7) నివర్తి
8) అడెల్లు
9) ఆనంద్ కిషోర్
10) నాగరాజు
11) రాజేష్
12) అరుణ్ కుమార్
13) మహేష్
14) శ్రీనివాస్
15) నర్సయ్య
16) విట్టల్ వర్మ
17) ప్రశాంత్ రెడ్డి
18) శ్రీధర్
19) హరీష్
20) సంతోష్
21) బాబు
22) సత్తయ్య
23. లావణ్య
24. శ్రీమ
తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.