సాంకేతికత- పోలబోయిన అర్చన
సాంకేతికత మనిషి జీవితాన్ని మెరుగుపరిచేదా!!
జీవితాన్ని మరుగున పరిచేదా!!
నమ్మకాలను రుజువు చేసేదా!!
అమ్మకాలను సజావు చేసేదా!!
జీవిత కాలాన్ని పెంచేదా!!
జీవితాన్ని తుంచేదా!!
ఏ దూరనైనా చూపేదా!!
నీ దరినే ఉన్న మరిపించేదా!!
సాంకేతికత నీ చేతిలోని బానిసా!!
నీ మతిలోని ఓ నిషా!!
శ్రమను క్షణికం చేసేదా!!
శ్రామికున్ని క్షీణింప చేసేదా!!
ఆకలిని తీర్చేదా!!
ఆకలిని పెంచేదా!!
దిగుమతిని పెంచేదా!!
మందమతిని కల్పించేదా!!
వాయు వాహన ప్రయాణమా!!
వాతావరణ నిర్యాణమా!!
సర్వరోగ నిరోధకమా!!
సర్వరోగ కారకమా!!
సాంకేతికత నీ స్మృతిని అందించేదా!!
విస్మృతిని అందించేదా!!
పురోగతిని ఆకాశాన్న నిలిపేదా!!
అధోగతిని స్మశానంగా కల్పించేదా!!
నిర్మల లవణ జలమా!!
నిర్జీవ ద్రావణ ఫలమా!!
సులభ సుదూర
ప్రయాణమా !!
స్వలాభ దుర్ధిర ప్రళయమా!!
నీ కథను ప్రదర్శించేదా!!
తాకతను ప్రదర్శించేదా!!
పోలబోయిన అర్చన
MA. B.ED
గ్రామం.తిమ్మంపేట,
మండలం .దుగ్గొండి,
వరంగల్ రూరల్.