సాంఘిక సంక్షేమ గురుకులంలో ప్రవేశాలు

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆదిలాబాద్ రీజియన్, మంచిర్యాల

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*తెలంగాణ ప్రభుత్వం*

రీజినల్ కోఆర్డినేటర్ కార్యాలయము, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మంచిర్యాల
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
*తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల (CBSE – BOYS), రుక్మాపూర్, కరీంనగర్ జిల్లాలో 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (MPC) కోర్సులో ప్రవేశ ప్రకటన – 2022-23 విద్యా సంవత్సరం*

TSWREI Society రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ జిల్లా, రుక్మాపూర్ లో నిర్వహిస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల (TSWR SAINIK SCHOOL, CBSE-BOYS) లో మిలటరీ కోచింగ్ తో కూడిన ఆరవ తరగతిలో మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (MPC) కోర్సులో ప్రవేశాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల (బాలురు) నుండి ఆన్లైన్ దరఖాస్తులు 2022-23 విద్యాసంవత్సరం కొరకు కోరబడుతున్నాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆదిలాబాద్ రీజియన్ – రీజినల్ కోఆర్డినేటర్.. *శ్రీమతి కొప్పుల స్వరూపారాణి గారు* ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు *www.tswreis.ac.in* ద్వారా ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 21-03-2022. పై సొసైటీ వెబ్సైట్ నుండి హాల్ టిక్కెట్లను తేది: 23-03-2022 నుండి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష తేది: 27-03-2022 నాడు నిర్వహింపబడును. ఇతర వివరాల కొరకు సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 180042545878ని సంప్రదించవచ్చు.

Sd/- రీజినల్ కోఆర్డినేటర్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆదిలాబాద్ రీజియన్, మంచిర్యాల
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Get real time updates directly on you device, subscribe now.