సమాజ నిర్మాణంలో భూమిక

ప్రతాపగిరి శ్రీనివాస్ హనుమకొండ

*సమాజ సమగ్ర నిర్మాణంలో ప్రముఖ భూమిక పోషిస్తున్న కుల సంఘాలు*

భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రాన్ని సమపాళ్ళలో పాటిస్తూ… ఆయా కులాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు సమాజంలో విస్తరించి, క్రమశిక్షణ మంచి నడత,నడవడిక వివేకం,వివేచన, మానసిక వికాస, మానవ సంబంధాల పటిష్ఠ నిర్మాణానికి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆదరించాలి,…. అందరికీ సముచిత స్థానం కల్పించాలి,… కులాలు వేరైనా మనమంతా ఒక్కటే మానవులంతా ఒక్కటే అనే నినాదాన్ని అమలు పరుస్తూనే… అనగారిన కులాల, వెనుకబడిన కులాల అభివృద్ధికి, మేధావి వర్గం, సంఘ సేవకులు ,ప్రభుత్వాలు చేదోడు వాదోడుగా ఉంటూ ,…ఎప్పటికప్పుడు ఆర్థిక,హార్దిక సహాయ – సహకారాలు అందిస్తూ , అన్ని కులాల సమగ్రాభివృద్ధికి, అందరి హక్కు లు సమాన రూపంలో సాధించడానికి , తద్వారా సమాజంలో పేద,బీదా, బిక్కు అనేటువంటి అసమానతలను రూపుమాపడానికి దారులు పడుతున్నాయి.
పెళ్లిళ్లు, పూజలు,వ్రతాలు మరియు దైవ కార్యాల్లో ఆయా కుల సంప్రదాయాల ప్రకారం ఆచరించే సాంప్రదాయాలు, ఆచారాలే క్రమశిక్షణ కలిగిన సంపూర్ణ మానవ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతున్నాయి.
ఆయా కులాలు సమాజంలో వారి ఉనికి, వృత్తుల మనుగడ మరియు వారి యొక్క హక్కులను సాధించుకోవడం కోసం ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపే టప్పుడు, వారి డిమాండ్ ను నెరవేర్చుకునేందుకు ఐక్యతగా నిలిచేందుకు ఆయా కుల సంఘ సభ్యులు, నేతలు చేసేటటువంటి ఐకమత్య పోరాటాలే ఐక్యత,నాయకత్వ పటిమను సమాజం లోపల నిర్మించడానికి దోహదం చేస్తున్నాయి. అందరము ఐక్యంగా ఉందాం… హక్కులను సాధించుకుందాం సమాజ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం అనే భావనలు సమాజ మనుగడకు సమగ్ర బాటలు వేస్తున్నాయి.
సమావేశాలు, వేడుకలు, శుభ కార్యాలు, పెళ్లిళ్లు జరుపుకోవడానికి, మానసికోల్లాసం కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆయా కుల సంఘాల యొక్క సభ్యుల, నాయకుల భాగస్వామ్యంతో విరాళాల సేకరణలతో నిర్మించుకుంటున్న భవనాలు సమాజములో సేవా సహకార భావనలకు పునాదులు వేస్తున్నాయి.
వివిధ సందర్భాల్లో ఆయా కులాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన టువంటి విద్యార్థులను, ఉద్యోగస్తులను, అభినందించి నప్పుడు ప్రతి మనిషి సమాజం లో ముందుకు నడవడానికి ప్రేరణ ఇచ్చే విధంగా చిన్నా..చితకా బహుమానాల తో అభినందనలు తెలిపే కార్యక్రమాలు,… ప్రతిభకు పట్టం కట్టడానికి అడుగులు వేస్తున్నాయి.
అత్యంత పేదరికంలో కొట్టు మిట్టాడుతున్న విద్యార్థులకు , బీద వారికి పెళ్లి లో మరియు ఇతర అతర కార్యక్రమాలలో ఇతోధిక ఆర్ధిక సహకారాలు అందించి, ఆదుకుంటున్న అటువంటి కుల సంఘాల సభ్యుల, నాయకుల కార్యక్రమాలు సమాజం లోపల దానగుణం వెల్లివిరిసేలా ప్రతిబింబిస్తున్నాయి.
సమాజంలో క్రమశిక్షణ, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ,నాయకత్వ లక్షణాల పెంపుదల, ప్రతిభకు పట్టం కట్టే కార్యక్రమాలు, సామాజిక అసమానతల రూపుమాపుటకు, సేవాగుణం,దానగుణం పెంపొందించడానికి కుల సంఘాల సభ్యుల, నాయకుల భూమిక మరింత మెరుగులు దిద్దుకుంటూ నిరంతరం కొనసాగాలని ఆశిద్దాం…

-👏——-* ప్రతాపగిరి శ్రీనివాస్ హనుమకొండ*
7993103924

Get real time updates directly on you device, subscribe now.