*జ్ఞాపకాల పుస్తకం జీవితమంటే*
ఇది నాది అది నాది అంటాడు నరుడు
నీదంటూ ఉందంటే అది వల్లకాడు
నీ ధనము రాదు బలగము రాదు
పగిలేటి కుండతో నీ రుణము తీరు.
అన్నదమ్మలు రారు ఆడబిడ్డలు కారు
ఆస్తులు నీవి కావు అయినవాళ్లుండరు
ప్రేమతో నువు చూసే నీవాల్లెవరు రారు
ఆరడుగుల భూమే నీకున్న సౌధము.
నీ వాల్లెందరున్న కాష్ఠం వరకే
కన్నీళ్లు కార్చేది శవము కాల్చేటి వరకే
నీకెంత పేరున్న నీతోటి రాదు
నీ చివరి చిరునామా బొందలగడ్డే!
ఆఖరకు మిగిలేది నువు చేసే మంచే
జ్ఞాపకాల పుస్తకం జీవితమంటే
ఉన్నన్ని రోజులు న్యాయంగా బ్రతుకు
నాది నీదనకుండ ధర్మంగా బ్రతుకు.
హామీ: ఇది నా స్వంతం.ఎలాంటి అనువాదం గానీ, అనుకరణ గానీ లేదు. ఎక్కడ ప్రచురణ కాలేదు.
బొల్లం బాలకృష్ణ
కరీంనగర్
సెల్:9989735216