శుభకృతాగమనము

డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

శుభకృతాగమనము
@@@@@@@@@

ఆ.వె. 1
విక్రమార్కశకము పేరెన్నికను గన్న
శాలివాహనాది కల్కి శకము
తిథుల కాలమాన తేదీలు మొదలయ్యె
శుభకృతాగమనము శోభగూర్చె
ఆ.వె. 2
షడ్రుచులును కలిసి సంవత్సరము నంత
సుఖము దుఃఖములను శుభము గూర్ప
పచ్చడారగింత్రు భక్ష్యాన్నముల తింద్రు
స్నాన దానములను సలుపుచుంద్రు
ఆ.వె. 3
భవిత కాలమాన పంచాంగ శ్రవణమ్ము
వత్సరమును దాక పరిగణించి
నూతన పనులెల్ల నుత్సాహమును జెంది
ప్రజలు నాచరింత్రు భక్తి తోడ
తే.గీ. 4
కరొన కడిగేసి శుభకృతు కాలమొచ్చె
రైతు భూముల దున్నియు రంకె వేసె
పాడిపంటలు కలిగించు ప్రగతి తోడ
దేశ రక్షణ గావించు దీక్షతోడ

-డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

Get real time updates directly on you device, subscribe now.