కరుణా కటాక్ష సాగరం
“””””””””””””””””””””””””””””””””””””
పవిత్రత ప్రశాంతతల ప్రతిరూపం
తర తరాల భవితకు మార్గదర్శనం
సంకల్ప కార్య సిద్ధికి అంకురార్పణం
నారాయణుడే చాటిన నరజన్మ ఔన్నత్యం
రామనామం వినయ విధేయతా సమాహారం !
ఏకపత్నీ వ్రత జగదానంద కారకం
రమణీయ రసమయ జీవనవేద సారం
రాతిని నాతిగ మార్చిన కరుణా కటాక్ష సాగరం
లోకోపకారార్ధం ఉదయించిన రఘువంశ తిలకం
సతతం రామనామ స్మరణం సర్వపాప హరణం !
అన్నదమ్ముల అనుబంధానికి చెరగని చిహ్నం
ఆడిన మాట తప్పని సత్య సుగుణ శీలత్వం
మాతృ పితృ మాటలకు కట్టుబడిన సంస్కారం
అనురాగ స్నేహ పరిమళం పంచిన మధురామృతం
శ్రీరామనామం ఆశ్రిత శరణార్థుల అభయ హస్తం !
పరస్త్రీ వ్యామోహం పతనమని పలికిన చందం
కష్టాల కడలికి ఎదురీగి తీరం చేరిన మనో నిబ్బరం
ధర్మ పాలనకు ప్రతీకగా నిలిచిన నిలువెత్తు నిదర్శనం
స్వకార్యం కన్నా స్వామి కార్యం మిన్నగ తలచిన వైనం
శ్రీరామ నామం ఆదర్శ దాంపత్య జీవన తరంగం !
(శ్రీరామ నవమి శుభాకాంక్షలతో..)
🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
రచన:కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకులు,NVBDCP సబ్ యూనిట్,సికింద్రాబాద్,8555010108