తెలుగు భాషా దినోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం నిర్మల్

తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు భాషా ప్రాముఖ్యత తెలిపే టట్లు ఉపన్యాసాలు ఇచ్చారు. వారిని ప్రిన్సిపాల్ గారు ప్రశంసిస్తూ . మన తెలుగు భాష ప్రపంచములో ప్రాచీన భాషల్లో ఒకటి ‘ అందుకనే “నిలుపుదాం నిలుపుదాం- తెలుగు భాష గొప్పతనాన్ని నిలుపుదాం ” అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తర్వాత పూలతో గిడుగు వారి చిత్ర పటాన్ని అలంకరించారు.

“తెలుగు భాష తీయనిది వెలుగులు విరాజిల్లు తున్నది. అనే దీవెన గారి పాటతో కార్యక్రమం కొనసాగింది. తెలుగు సహాయాచార్యు టి నర్సయ్య మాట్లాడుతూ “తెలుగు ఇటాలియన్ ఆఫ్ థ ఈస్ట్ గా పేరు పొందింది. తెలుగు నాగరికతకు ఆలవాలం అని అన్నారు.

“మానవ సంబంధాలు మన భాష ద్వారానే ప్రేమగా నిలదొక్కుకుంటాయి అలాగే సూక్తులు, నానుడిల వల్ల భాష మరింత అందంగా వ్యవహరిస్తున్నామని” కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె భీం రావుగారు ప్రసంగించారు. పీజీ రెడ్డిగారు మాట్లాడుతూ తెలుగు భాష జానపదుల భాష అని కొనియాడారు.


హిందీ సహయాచార్యులు అజయ్ గారు మాట్లాడుతూ “మన దేశ భాష హిందీ- మన దేశీయ భాష తెలుగని , తెలుగును మరువద్దని అన్నారు. డాక్టర్ రజిత గారు మాట్లాడుతూ భావవ్యక్తీ కరణకు వ్యవహరికమే వాడాలి అని అన్నారు. గిడుగు వారు చేసిన కృషి గురించి డాక్టర్ రంజీత్ కుమార్ పద్యం పాడారు అలాగే సమన్వయ కర్తగా వున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఘు గారు, అధ్యాపకులు దిలీప్, నాగేశ్వర్ రావు, రమాకాంత్, తదితరులు మరియు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు .
వందన సమర్పణ తెలుగు విభాగ అధిపతి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.