విజయ సారథులు – 1
హన్మకొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నాయి రెండు తండాలు వాటిలో ఒకటి హరి చంద్ర నాయక్ తండ అందులో అందరూ ఉద్యోగస్తులే ప్రతి ఇంటికీ ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఆఫీస్ స్థాయి నుండి అటెండర్ వరకూ ఏదో ఒక స్థాయిలో ఉద్యోగం పొందిన వారే అందరూ. దానికి భిన్నంగా దాని పక్కనే ఆనుకుని ఉంది మరొక తండ దాని పేరే నిరూప్ నగర్ తండా ఆ తండాలో గుడుంబా వ్యాపారం ఎక్కువ. అందరూ నిరక్షరాస్యులు తాగి గొడవ పడని రోజ అంటూ ఉండదు ఆకుటుంబాలలో అటువంటి తండాలో హరిసింగ్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకొని ఆసుగుపెట్టింది రాదబాయి.
పెళ్లి జరిగిన తెల్లవారే నుండి కుటుంబ వారు గుడుంబా బట్టి పెట్టడం నేర్పించారు దానికి ఈ రోజు కూడా తయారుచేయడం పక్కనే ఉన్న పట్టణంలో సాయంత్రం పూట అమ్మడం పనిగా మారింది తరచూ పోలీసులు తండా కి రావడం మామూళ్ల పేరిట వేధించడం ఏ సందర్భాల్లో అరెస్టు చేసి జైల్లో కి తీసుకెళ్లడం ఇవన్నీ నచ్చలేదు రాధాబాయికి.పక్క తండా లాగా చదివి మంచిగా ఉండలనుకున్నది. అభ్యుదయ భావాలున్న ఆమె అక్కడ బ్రతకడం కష్టమైపోయింది దానికి తోడు తన భర్త తాగుబోతు గా మారిన నిత్యం డబ్బుకోసం వేధింపులకు గురి చేసేవాడు. చేసేది లేక అన్ని భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నది రాధాబాయి. దానికి తోడు కొన్నాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకుకి రామ్ సింగ్ అని పేరు పెట్టుకొని తనను చూస్తూ ఆపిల్లవాడిని గూర్చి కలలు కంటూ కష్టాలను మరచి బ్రతుకుతున్నది. ఆ అనదం ఎంతో కాలం నిలవలేదు తనకు
:రామ్ సింగ్ కు నాలుగేళ్ల వయసు వచ్చింది. తాగుడుకు బానిస అయిన భర్త హరిసింగ్ తాగి,తాగి చనిపోయాడు. నాటి నుండి కష్టాలు మరింత పెరిగాయి. తనకు ఉన్న ఒక్క గది కోసం తోటికొడళ్లు రకరకాలుగా వేధించడం మొదలు పెట్టారు. రామ్ సింగ్ కోసమే బ్రతుకుతున్న తాను తనకొడుకును చదివించి ప్రయోజకుడిని చేయలనుకుంది. తనను బడికి పంపించింది. రామ్ సింగ్ చక్కగా చదువుతున్నాడు. 4వ తరగతి వరకు చేరుకున్నాడు.ఒకరోజు రామ్ సింగ్ వాళ్ళ సార్ రమ్మంటున్నాడని అమ్మని బడికి తీసుకువెళ్లాడు. వెళ్లి సార్ ని కలిసింది రాధాబాయి. నీ కొడుకు బాగా చదువుతున్నాడు ప్రభుత్వ గురుకుల పాఠశాలకు పంపించు సీటు వచ్చింది అని తెలిపాడు. ఎంతో సంతోషించింది. అందుకు కావలసిన పనులకు ఆ ఊరిలో చదువుకున్న లింగన్న సాయం తీసుకుంది. కొడుకును గురుకులంలో చేర్పించింది. అది చూసి తోటికొడళ్లు మరింత రగిలిపోయారు.
ఈ మార్పును వారు ఆయుధంగా మలుచుకోవాలనుకున్నారు. సెలవులలో ఇంటికి వచ్చిన రామ్ సింగ్ ని చేరదీసి తన తల్లి లింగన్నతో తిరుగుతుందని కావాలనే నిన్ను గురుకులంలో చేర్పించారని లేనిపోనివి నూరిపోశారు రామ్ సింగ్ కి. దానితో తల్లిని శత్రువుగా చూడడడం మొదలు పెట్టాడు రామ్ సింగ్. రాధాబాయి బాధను భరిస్తూ నిజం గ్రహిస్తాడని ఓపికపట్టింది. సెలవులకు ఇంటికి రాకుండా బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళేవాడు. అయినా మంచిగా చదువుతున్నాడుకదా అని సరి పెట్టుకుంది అలా తొమ్మిదవ తరగతికి చేయూకున్నాడు. అప్పుడే కొత్తగా కౌన్సెలింగ్ తరగతులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆకౌన్సెల్లర్ దగ్గరకు తీసుకు వెళ్లారు. ప్రిన్సిపాల్ చాలా బాగా చదువుతాడు కానీ సెలవులు వస్తే ఇంటికి వెల్లడు. ఎంత అడిగినా కారణం చెప్పడం లేదు అని చెప్పారు ప్రిన్సిపాల్ గారు. రామ్ సింగ్ తో గంటపాటు మాట్లాడిన కౌన్సెల్లర్. వారం తరువాత మళ్ళీ కలవమన్నాడు. వారం తరువాత మళ్ళీ ఒక గంటపాటు మాట్లాడి. రామ్ సింగ్ సమస్యను గుర్తుంచాడు. తన తల్లి ఉన్న పరిస్థితులను. తాను పడుతున్న శ్రమను మరోకోణంలో చూడమన్నాడు. అప్పటికి నీ తల్లిది తప్పనిపిస్తే తనని మార్చుకోమని నీకోసమే బ్రతుకుతున్న తనకు నీప్రేమను అందించు అని సూచించాడు. సెలవురాగానే ఆనందంతో ఇంటికి వెళ్ళాడు రామ్ సింగ్ తను ఇన్నాళ్లు చెప్పుడు మాటలు విని తల్లిని బాధపెట్టినందుకు బాధపడ్డాడు. పదేళ్లుగా రాధాబాయి మనసులో అనుభవిస్తున్న బాధను తుడిచివేశాడు. తన తల్లి కలలను నిజం చేస్తూ చదువు పూర్తి చేసి ఊద్యోగం పొందాడు.మనసు ఉంటే మార్గం ఉంటుంది.
కష్టాల రాపిడి నుండి అగ్నికణం పుడుతుంది.
గుండమీది కృష్ణ మోహన్
హాసన్ పర్తి, హన్మకొండ.