*కాలం కలిసి రాక గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోతున్న విద్యా వ్యవస్థ*
. ఈ విద్యా సంవత్సరం కరోనాతో కొంత కాలం వృధాగా గడిచిపోవడం. 317 GO ప్రకారం ఉపాధ్యాయ,ఉద్యోగస్తులు వివిధ జిల్లాలకు బదలాయింపు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఎట్లాగూ కొనసాగుతూనే ఉంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తీవ్రమైన ఎండ వేడిమి తో పాఠశాలల వేళల్లో మార్పు తో సమయం కుదించబడింది.
కర్ణుడు చావుకి పలు కారణాలు అన్నట్లు విద్యా వ్యవస్థ, విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలిగించే కారణాలు అనేకం ఉన్నాయి. ఆన్లైన్ తరగతులు బోధనా అనీ కొంతకాలం, ప్రత్యక్ష తరగతుల బోధన అని కొంతకాలం, ఉపాధ్యాయుల్లో సగం మంది బడులకు వెళ్లాలని కొంతకాలం, మొత్తం ఉపాధ్యాయులు బడికి వెళ్లి ప్రత్యక్ష బోధన జరపాలని కొంతకాలం. పాఠశాలల్లో తగినంత ఉపాధ్యాయులు లేరని , తగినంతమంది ఉపాధ్యాయులను నియామకాల ద్వారా నియమించినప్పుడే విద్యా వ్యవస్థను గాడిలో పడుతుందని సమస్య ఎట్లా ఉంది. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన సరిగాలేదనే సమస్య ఉంది. ఆంగ్ల మాధ్యమం,తెలుగు మాధ్యమం అనే నిర్దిష్ట పాఠశాలలు లేక ఏ మాధ్యమంలో చదువుకోవాలి అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు.ఇలా అనేక సందిగ్ద సమస్యల మధ్య కాలం గడిచిపోతూ విద్యా సంవత్సరం పూర్తికావస్తుంది. కానీ, విద్యార్థులకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రణాళికాబద్ధంగా అందించడానికి కాలం కలిసి రాక అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విద్యావ్యవస్థ, విద్యార్థి లోకం మరియు ఉపాధ్యాయ లోకం.
భవిష్యత్తులోనైనా కాలం కలసి వచ్చి అన్ని పరిస్థితులు అనుకూలించి విద్యా వ్యవస్థ గాడిన పడుతుందని ఆశిద్దాం.
—— *ప్రతాపగిరి శ్రీనివాస్,హనుమకొండ 7993103924*