బీసీ గురుకులాల్లో అనర్హులకు ఒప్పంద ఉద్యోగాలు

నిర్మల్ జిల్లా రాచాపూర్ లో దారుణం

బీసీ గురుకులాల్లో అనర్హులకు ఉద్యోగాలు

అనర్హులను అర్హులుగా చూపిస్తూ పక్కా ప్రణాళికతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్నీ బిసి గురుకులాల్లో ఇటీవల జరిగిన జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నియామకాలు పూర్తిగా ముడుపులతో జిల్లా సమన్వయ కర్త ఆర్ సి ఓ గోపిచంద్ రాథోడ్ లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఒప్పందాలతో ఒప్పంద అధ్యాపకుల నియామకం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ఆర్ సి ఓ కు వత్తాసు పలికారని అర్థమౌతుంది. ఎందుకంటే అన్నీ అర్హతలు ఉన్న వారికి ఈ ఉద్యోగాలు రాలేవు. గత సంవత్సరం కూడా గెస్ట్ టీచర్ జేయల్ నియామకాలు కూడా ఇలాగే డబ్బులు తీసుకొని ఇచ్చారనే అనుమానాలు ఉన్నాయి. స్థానికేతరులకు ఇవ్వడంతో ఈ విషయాన్ని బీసీ వెల్పేర్ సెక్రెటరీ మల్లయ్య భట్టుకు కొందరు అభ్యర్థులు చెప్పిన ఏమి పట్టించుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ అతనికి ముందే తెలుసు కానీ షరా మామూలే, తెలంగాణలో అన్నీ గురుకులాల్లో ఇదే జరుగుతుంది. కానీ ఎవరు పట్టించుకోరు.

Get real time updates directly on you device, subscribe now.