శీర్షిక… ఎవరు రాయగలరూ! నాన్న గురించి… చెప్పగలరూ…
****
కవిత..
****
1)
కనడంలో తను ఒక పాత్ర!
కనబడని ప్రేమ పంచడంలో తను ఒక అక్షయపాత్ర!!
పెంచడంలో తను ఒక విభిన్న పాత్ర!!!
2)
ఆదరించడంలో తను ఒక విశాల హృదయ దృక్పథం!
ఆచరించడంలో తను ఒక విశ్వాస భావన నిలయం!!
ఆలోచించడంలో తను ఒక నూతన శకపు పుస్తకం!!!
3)
బిడ్డ కోసం తను ఒక నిరంతర శ్రామికుడు!
బిడ్డ కోసం తను ఒక అంతర మదనపడే స్నేహితుడు!!
బిడ్డ కోసం తను ఒక నిరంతర పరిశోధకుడు/యాత్రికుడు!
బిడ్డ భవిష్యత్ కోసం తను నిత్య తపన అన్వేషకుడు!!
మార్గదర్శకుడు!!
అమ్మ ఏమో చంకలో ఎత్తుకుని తాను చూసేదే చూపు,తను చూడని దాని భుజాల పై మోస్తూ చూపు జనకుడు!!
4)
బిడ్డ పిలిచే రెండు అక్షరాల పిలుపు పరవశించి శ్రమను మరచి ఆనందపడే ఏకైక అల్పసంతోష జీవుడు!
బిడ్డకు ఎదురుగా ఉన్న కనబడని దాగిన దేవుడు!!
5)
తన హృదయం కనిపించని ఆహ్లాద దేవాలయం!
బిడ్డకు కష్టం వచ్చిన చలించి తల్లడిల్లి పోయే రెండు అక్షరాల డాడీ!
బిడ్డ ఆపదలో ఉంటే వెన్నుతట్టి ధైర్యం చెప్పే ధైర్యవంతుడు! హద్దులు దాటితే తన కళ్ళెంతో సుబుద్దులు చెప్పి నేర్పే గురుబుద్ధుడే!! రెండు అక్షరాల నాన్న!!
తను చదివిన చదవకపోయిన బిడ్డ ఉన్నత శిఖరాలు చేరేలా చేసే కార్యదక్షత రథసారథియే రెండు అక్షరాల అబ్బ!జీ
తను బిడ్డపై మనో ప్రేమను వ్యక్తపరిచే మనోవాత్సల్యుడే రెండు అక్షరాల తండ్రి!!
తన స్వప్నాలను బిడ్డలో చూసే విజయుడు!!
సంసార సాగరాన్ని అవలీలగా మోసే సాగరబాహుబలుడే! రెండు అక్షరాల పితా!!జీ
కోపపడతాడు భయపెడతాడు సక్రమమార్గం చేసే విక్రమార్కుడే! రెండు అక్షరాల ఫాద్ర్!!
ధర్మాధర్మాలు ఎరిగి మార్గదర్శకుడై బాల్యంలో నడక,నడత ముడతలు, మడతలు లేకుండా చూసే పెద్ద అన్న నాన్న!యే
యవ్వనంలో తన బిడ్డను కాపాల కాసే కంటి కాపరై చేజారి అల్లరి కాకుండా చూసేది ఈ అయ్య! యే
6)
బిడ్డ దృష్టిలో అమాయకుడు,అనామకుడు అంపశయ్యపై భీష్ముడైయ్యాడు!! పాపం!!! నాన్న….
అన్నింటా తానే అయ్యాడు! అని నీవు తండ్రి అయ్యాక తెలిసాక!
కాలం ఆగదుగా!! నిను వదలి పోయాక!
బిడ్డా! నీ అడ్డా!! ఈ గడ్డ!! నుంచి పోకముందే జాగ్రత్త సుమా..!!
7)
ఐనా ఎవరు రాయగలరూ! నాన్న గురించి!! ఎవరు చెప్పగలరూ! నాన్న గురించి!!నాన్నే సర్వస్వం అని !!!
అందరు అంటూ ఉంటారు నాన్న వెనుకబడ్డారని!
నిజమే! తను నిరంతరం కోరేది అదే బిడ్డ కోసం!! వెనుకనే ఉండాలని తపనే నాన్నది!!!
****
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ ,చురకశ్రీ, కావలి,నెల్లూరు జిల్లా,9493242241.
****
పై రచన నా స్వీయ రచన .సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ చురకశ్రీ కావలి నెల్లూరు జిల్లా.