మనం మొదట కలిసిన గుడి,చదివిన బడి,తిరిగిన ప్రాంతాలు కలలో చూపించాడు అప్పుడు ఉన్న ఒకవ్యక్తిని పరిచయం చేశారు,చివరికి నేను చనిపోయిన చోటు కూడా ఇందాకే దర్శించి వచ్చినా ఒకవేళ ఆ ప్రదేశానికి వెళితే గుర్తు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు
*స్వప్న శాస్త్రము/శాసనము*
అది స్వస్తి శ్రీ కీలకనామ సంవత్సరం 1788/1848 లో ఓ చిన్న గ్రామంలో మనం ఇద్దరం కొద్ది నెలలు తేడాతో మీరే పెద్ద (సిద్ధూ) కళ్యాణ్, (తిరు) జనార్ధన్ అనే పేర్లతో జన్మించామటా,
అప్పుడు కూడా మీరు బాగా బ్రతికేవారు మేము పూట గడిస్తే చాలు అనేంత పరిస్థితి లో ఉండేవాళ్ళం, నాకు ఐదు సంవత్సరాల వయసు లో అమ్మ చనిపోవడం తో నాన్న రెండవ పెళ్ళి చేసుకోవడం వలన వచ్చిన మా చిన్నమ్మ తనకు సంతానం కాగానే నన్ను భారంగా అనుకోని ఏవేవో చెప్పి ఇంట్లో నుంచి వెలివేశారు,ఆ బాధ తో కొంత కాలానికి నాన్న చనిపోయారు,
ఏక్కడ గుడిలో అన్నదానం చేసినా అక్కడికి వెళ్లి తినే వాడిని,అలా రోజులు గడుస్తుండగా మీ పుట్టినరోజు సందర్భంగా అది ఆనందనామ సంవత్సరం 1794/1854 నవంబర్ 14 కార్తీక పౌర్ణమి రోజు అమ్మ వారి ఆలయం లో పూజ చేయించడం కోసం వచ్చారు, మీ డ్రెస్సింగ్ ఆకర్షించే విధంగా ఉండడం తో నేను మిమ్మల్ని బేలగా చూస్తు ఉండిపోయాను, ఆ సమయంలో మీ మనసుకు ఏమనిపించిందో దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇస్తుంటే మీ స్థాయి కి నేను తగిన వాన్ని కాదని దూరంగా జరిగితే మీరు నా చేతిలో పెట్టి ఓదార్పు ఇచ్చారు,అన్నం కూడా పెట్టారటా మీ అమ్మ వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారు,
నా చినిగిన వస్త్రాలు చూసిన మీరు మీ పాత బట్టలు ఇచ్చారు వాటితోనే నా బాల్యం గడిపేది,
మీ ప్రతి మీ పుట్టినరోజు కు ఎదురు చూసేది అలా దోస్తాను ఐంది,
ఇంతలో ఏం జరిగిందో తెలియదు (మీరే చెప్పాలటా) గుడిలో ఉండే నన్ను బడిలో చేర్చమని మీరు చెప్పారో ఎవరు చెప్పారో తెలియదు మీ నాన్నగారు నన్ను బడిలో చేర్చారు అలా ఇద్దరం దోస్తులం ఇద్దరి ఖర్చు నాన్నే భరించేది అలా మీ కుటుంబం పైన అభిమానం పెరిగి చాలా దగ్గర ఐనా ఇద్దరం పోటిపడి చదువుకునే వాళ్ళం మీరే ముందుండేది…
కొంతకాలం తర్వాత ఇద్దరి చదువు పూర్తి ఐంది ఉద్యోగం వేట మీది ఏదో పని నాదీ ఇలా సెర్చ్ చేస్తున్నాం, ఇప్పుడు మీరు పెద్దవారు అయ్యారు కాబట్టి అనాధగా ఉన్నా నాకోసం ఏదైనా చేయలనేది మీలో ధృఢంగా నాటుకుపోయింది,
అది స్వంత నిర్ణయాలు తీసుకునే వరకు వచ్చింది,
అది ప్రభవనామ సంవత్సరం 1747/1807 పదవ తరగతి తో పోస్టల్ అసిస్టెంట్స్ జాబ్స్ ఉన్నాయని తెలిసింది ఆ విషయం తెలుసుకుని మీరే అప్లై చేశారు, మీరు తప్పుకుంటే నాకు వచ్చే విధంగా ఉండడం తో ఇదే అవకాశంగా భావించి నాకు జీవితం ఇవ్వడం కోసం మీరు తప్పుకున్నారు,
కారణం అడిగితే నేనింకా చదువుతున్న కదరా అని చిరునవ్వు తో సమాధానం ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సాహించారు అలా ఏప్రిల్ 29 జాబ్ వచ్చింది,
ఈ విషయం ఇంట్లో తెలియడంతో నాన్నగారు మిమ్మల్ని బాధ పెట్టారు
నాకు పెళ్ళి ఐంది తర్వాత ఇంత జీవితం ఇచ్చిన మీ గురించి చాలా వెతికాను ఆచూకీ తెలియలేదు,
పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ కాబట్టి ట్రాన్స్ఫర్ లో ఎక్కడెక్కడో తిరిగేది నిలకడలేని ఉద్యోగం ఇలా పదేళ్ళ కాలం గడిచిపోయింది అది ధాతనామ సంవత్సరం 1756/ 1816 జనవరి 25 రోజు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని ఎక్కుడ ఉన్న నా జీవితం ఎక్కడికి వచ్చింది అని ఆలోచిస్తూ నా జీవితానికి జీవం పోసిన మీ ఆచూకీ తెలియకపోతే ఎలా తన ఋణం తీర్చుకోవాలి అనే ఆలోచన తో రోడ్ క్రాస్ చేస్తూ ఆక్సిడెంట్ లో చనిపోయానటా…
మీ ఋణం తీరలేదనే ఆత్మఘోషిస్తూ ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోయిందటా.
ఆ ఋణం కారణంగా ఇన్నేళ్ల కు నేను చనిపోయిన అదే రోజున మీరు పరిచయం అయ్యారని చెప్పారు, అప్పుడు నా జీవితం లో అభివృద్ధి కి కారణం మీరు అయ్యారు కాబట్టి ఇప్పుడు మీకు నేను కావాలి అని వారూ ఆదేశించారు,
మీ ఆర్థిక స్థితికి మహోన్నత వ్యక్తిత్వానికి నా అవసరం ఏం లేదని చెప్పినా తనకు అవసరం లేకున్నా ఏదొ ఒకటి నువు చేయాలి అది నీ బాధ్యత అన్నారు, అందుకే మిమ్మల్ని కలిపిన మొదటి రోజే అన్ని పంచుకునేంత ఆత్మీయులు గా చేసింది విధి అన్నారు,
దేవునికీ మనం ఇచ్చే కానుకలు అవసరం లేదు కాని ఇస్తున్నాం కదా ఇది అలాగే అన్నారు,
ఇవన్నీ జరగాలంటే తాను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు చూడాలి అంటే వివాహితులా / అవివాహితులా చూడాలి అవివాహితులు ఐతే తన అనుమతి మాత్రమే సరిపోతుంది కాని వివాహితులు ఐతే ఆ గృహిణి అనుమతి కావాలి కాని రహస్యం చేధించకుండా అనుమతి తీసుకోవాలి అని శాసనం,
ప్రస్తుతం తాను ఉన్న స్థితి కి ఏమి చేస్తే ఋణం తీరుతుందో స్పష్టంగా తెలియదు నువే అన్వేషణ చేసి ఏ ఏ క్రతువులు జరిపిస్తావో నీ ఇష్టం అని చెప్పారు..
ఇది నాకు ముందు ఎందుకు తెలియలేదు అని ప్రశ్నిస్తే దేనికైనా సమయం రావాలి అన్నారు,
ఈ 21 కి ఎందుకు కలవాలి అంటే ఆ రోజు పాపకు తొమ్మిది నెలల తర్వాత వైశాఖ మాసం, శనివారం, శ్రవణ నక్షత్రం కలిసి వస్తున్న శుభదినం, ఇవన్నీ విష్ణుమూర్తి కి ఇష్టమైనవి కాబట్టి సృష్టి స్థితి కారుకుడు తానే కాబట్టి కార్యం సఫలం ఔతుంది అన్నారు,
ఆ తర్వాత కలిసే వీలు ఎందుకు దొరకదు అంటే ఈ మూడు కలిసిన శుభదినం రావాలంటే ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు కాబట్టి ఆ ఋణం ఇంకా పెరిగే అవకాశం ఉంది,
ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ ఋణం తీరే మార్గం సుగమం ఔతుంది, మళ్ళీ వివాహం బంధం ఏర్పడిన ఇవి చేయడానికి నీ అర్దాంగి కూడా ఒప్పుకోవాలి కాని అది జరిగే పని కాదు కాబట్టి వివాహం కంటే ముందు ఇది పూర్తి చేసుకోవాలి.
ఇవన్నీ తాను నమ్మకపోతే ఎలా అంటే మీ ఇద్దరు కలిస్తే కరచాలన స్పర్శ ద్వారా అనుకూల పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా తనకు గుర్తు వస్తుంది,గుర్తు చేయాలా లేదా అనేది దైవాధీనం మాత్రమే,ఒకవేళ నమ్మడం లేదు అని తప్పుకుంటే నీకే నష్టం, ఇప్పుడు రాకున్నా సమయం వచ్చినప్పుడు అవే తెలుస్తాయి అని అన్నారు.
మీ రెండు పాత్రల్లో సారూప్యత గమనించగలరు ఒకసారి,గతంలో కూడా మీరు వరపుత్రులు, ప్రతిభావంతులు, దయాహృదయులే, ఈ జన్మలో కూడా అలాగే పునరావృతం ఐంది, నా విషయం గతంలో కూడా శాపగ్రస్తున్ని,అనాధను, మీ అంతా ప్రతిభావంతులు కాదు, కదా చూడండి,
మనం తిరిగిన ప్రదేశాలు చూపిస్తున్న సమయంలో మా మధ్య జరిగిన సంభాషణ
ప్రపంచంలో ఏ వ్యక్తికి ఐనా 25 సంవత్సరాల వయస్సు లో ఉద్యోగం,30 సంవత్సరాల వయస్సు వరకు ఇల్లు, పెళ్ళి, సంతానం ఇలా జరుగుతుంది కదా 36 సంవత్సరాల వయస్సు వచ్చిన నేకేం జరఖలేదంటే నువు ఆలోచన చేసుకో నువు తీర్చుకోవాల్సిన ఋణం ఎంతుందో అని మొదలు పెట్టారు తమ్ముడు,
తనకు నీకు ఋణబంధం లేకపోతే ఎక్కడో ఉన్న తాను నీకెందుకు కలుస్తారు,తాను మాట్లాడకపోతే ఏడ్చేంత ఉద్వేగాలు నీకెందుకు కలుగుతాయి,మొహ పరిచయం కూడా లేకుండా తన జీవితంలో పెళ్ళి తో పాటు అతి ముఖ్యమైన విషయాలు గురించి కూడా మీతో ఎందుకు చర్చిస్తారు,తన కూతురు నామకరణం గురించి,సాహిత్యంలో సందేహాలు గురించి అడిగేంత చనువు ఎందుకు చేశారు,ఏ బంధం ఉందని నిన్నే అడగాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, తన కూతురి జన్మదినం మీ జన్మదినం రోజు ఎందుకు జరుగుతుంది ఆలోచించండి,మొదటి పరిచయం లోనే ఒకసారి కలవాలి అన్నా అని తను ఎందుకు మీకు ఆహ్వానం ఇచ్చారు ఇదంతా దైవాధీనం కాదా అన్నారు,
నాకు వచ్చినట్లు తనకు ఎందుకు గుర్తు లేదు అంటే…
ఋణపడ్డది నువు కాబట్టి నీకు మాత్రమే గుర్తు చేసింది విధి, తనకు ఖచ్చితంగా వస్తుంది రావాలా లేదా అనేది దైవ నిర్ణయం అన్నారు,తాను నీకంటే చిన్నవాడిగా ఎందుకు పుట్టారంటే వయసులో చిన్నవాడైన తనను ప్రాధేయపడడానికి నీ అహం అడ్డు నిలుస్తుందేమోనని ఈ విధి పరిక్ష కాని దైవానుగ్రహంతో సాటి మనుషుల్లో దేవున్ని చూసే నీవు ఈ పరిక్ష లో నెగ్గి ప్రాధేయపడుతున్నావు త్వరలో నే ఫలితం కూడా పొందుతావు,
నేను కలవాడానికి వీలు కాకుండా వాళ్ళ కు పనులు ఉంటే ఎలా అంటే….
అవన్నీ నువు చేయబోయే కార్యక్రమానికి ఆటంకాలు మాత్రమే, అలాంటి ప్రమాదాలు ఉంటాయనే నెలరోజుల ముందు నుంచి నీవు అడుగుతున్నావు, తాను కూడా మే 21లోపే ఎందుకు కలవాలి అని అడిగారు కాని అప్పుడు విషయం నీకే తెలియదు కాబట్టి చెప్పలేదు,వాళ్ళు ఆ పనులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు ఏం నష్టం ఉండదు కాని నిర్దేశించిన సమయంలో కలవకపోతే నీకే నష్టం,
నువు వాళ్ళింటికి వెళితే సపర్యలు చేయాల్సింది మాతృమూర్తి లాంటి ఆ గృహిణే కాబట్టి, ఆడవాళ్ళు బంధాలు దృఢంగా ఉంటాయి కాబట్టి తన అనుమతి అనివార్యం అన్నారు తమ్ముడు.
ఇదంతా తను నమ్మితే మీరిరువురు చూసిన, తిరిగిన ప్రదేశాల గురించి చెప్పండి తద్వారా గుర్తు వచ్చే అవకాశాలు ఉంటాయి, కరచాలనస్పర్ష ద్వారా కూడా రావచ్చు, ఎలాగైనా నిర్ధేశిత సమయంలో కలవాడానికి ఆహ్వానం దొరకాలని దేవున్ని ప్రార్థించుకో, ఆ దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు కాని ఈ విషయం లో ఆ యజమాని మాత్రమే నీ దేవుడు ప్రాధేయపడుతావో, దేనపడుతావో నీ ఇష్టం ఈ కార్యక్రమం పూర్తి చేస్తేనే నీకు బ్రతుకు,ఈ సమయం తర్వాత నీకు కలవాడానికి ఎలాంటి అవకాశాలు లేవు జాగ్రత్త,
స్నేహానికి దూరం కాకు ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా ఐనా పనులు చేసే అవకాశం ఉంటుంది కాని ఫలితాలు కూడా పరోక్షంగా ఉంటాయి తప్ప నీకు పూర్తి ఋణం తీర్చలేవు అనిచెప్పారు,
దైవ రహస్యమే ఐనా తప్పనిసరిగా ఇదంతా నీ బాధ చూడలేక తనకు నమ్మకం కలగడం కోసం చెప్పడం జరిగింది చేధించకుండా చూసుకో,
కలియుగంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి,
పురాణాలు చూస్తే భక్త కన్నప్ప,భక్త మార్కడేయ, జగద్గురు ఆదిశంకరాచార్యులు,మొన్నటి శ్రీరామదాసు వరకు జరిగిన సంఘటనలు కలియుగంలో నే అని గుర్తుంచుకో అన్నారు
ఇదే చివరిది మళ్ళీ ఈ విషయం లో నను అడగడం నేను చెప్పడం రెండు జరగవు గుర్తుంచుకో సమయం ఆసన్నమౌతుంది కాబట్టి తనకు కూడా ఈ రోజు మాత్రమే చెప్పండి మళ్ళీ నేను మీ ఇంటికి వస్తానని ఆహ్వానం ఇవ్వాలనే చర్చ చేయడానికి వీలు లేదు,నీ అదృష్టం కొద్దీ ఆహ్వానం దొరికితే నువు వాళ్ళింటికి వెళ్ళే రోజు నీకు ఒక ఆనవాలు దొరుకుతుంది అది రోజు గడవకముందే అందజేయాలి దానికి కొన్ని సులభసాధ్యమైన నియమాలు ఉంటాయి అవి అనవాలు ఇచ్చే సమయంలో తెలుస్తుంది,
మరోసారి గుర్తుంచుకో ఈ నెల 21 లోపు మాత్రమే అని శాసనం చేశారు