మనో సంద్రమున వెడలు కెరటాల వలె లోచనలన్నీ
నీ వైపుగా ఆకర్షితమై పరుగులు తీస్తూండగా
. ఒక్కొక్క శరమై నీ పాద పద్మ దూళిని తాకుటకు తీవ్రంగా పయనమయ్యే వేళ
నీ శిరమున గల శశికాంతులు విరబూసిన క్షణాన కలువను నేనై నిద్రాంధకారాల్ని మెల్లగా తొలగించు కొని నీ తలంపులతో కాలం గడుపు వేళ
హృదయ మనే కోనేరులో వెల్లివిరిసిన పారిజాతమునై పరిమళత్వాన్ని నిలువెల్లా నింపుకొన్న వేళ ..
నా అంతరంగాన నీవు అంతరాత్మవై అలరించినప్పుడు ఆ క్షణం అనంత విశ్వమంతా పవిత్రమైన
నీ రూపం సాక్షిత్క రింపబడు వేళ
ఏ జన్మలో ఇచ్చిన మాటనో ఈ జన్మలోనే నెరవేర్చుకొన బలమైన సంకల్పముతో బ్రతుకు తోవల తోడై నీడై సర్వమై సర్వేశ్వరుండవై వరాలు వరబిందువుల వలె గురించు వేళ ..
సర్వ బంధాల సమూహారము నీవై నిలిచి కావగా నీతోడు కోరుకునే భక్తులకు స్నేహ హస్తము అందించు వేళ
శుభములు అందించుమా ఆది దేవా శరణం కోరితి నిన్నే
నీ పాదాభివందనం చేసితి ఇప్పుడే
14.4.2022