ఆత్మీయ వర్ణన
అరుణ వర్ణ వేళ
ఆకాసమున వెడలిన
కిరణ సహిత అవజా గిరి
యెతెంచి నొక రహస్యంబు
సఖునకు సెల్వవివ్వగను
యచట పారిజాత సవర మికర జాజి
తులసి గంధి సుగంధి సర్వఔషధ
పుష్ప పూకుసుమ వనమున
యెల్ల దిశలు కనువిందు సేయగా
సుమ పరిమళంబులు శివ పార్వతుల
మదిమేనులను పరవసింప జేయగా
ఆనందము ఆహ్లాదకరము నిరతమై
సాగుచున్న వేళ కాలము క్షణంలో
గతించు చుండెను అలా అలా ……
అలనాటి జ్ఞాపకాలను
తడిమి తన్మయత్వం
పొందెను ఈ వేళ నిప్పుడే…
హస్తము వదలక ఇరువురు
ఆది దంపతులు ఇలా విహరించే…..