ప్రణయ పరిమళం

శంకర దాసు

ప్రణయ పరిమళం

మనస్సు పులకించి
రమ్మని రవలించే
యోగమనో పలకమున
అరవింద దర్శనమాయే
జటము ముడిజారుచుండ
పరధ్యానమున పరమేశుడు
నల్లని జలపాతము వోలె నున్న సఖి
కురులు జూసి అదృశ్య స్పర్శతో
నైదు మారులు నిమిరే
నిశీధిలో నిండు రెండు
చంద్ర బింబముల వంటి
నేత్రముల గనగానే ప్రణయం
హృదిన పొంగిపొర్లుచుండె
మబ్బుల దాగిన అరకొర
నక్షత్రం వలె నాసికమును చూసే
మకరందము చిందు మందారం
వలెనున్న అదరమును చూసే
తనువు పులకరించు చుండగా
తనకు తెలియక తానే
శ్వాసగా మారి తనువును
పులకరిప జేసే యా క్షణమే
తపన రెట్టింపయ్యేనే
తపోభంగము గాకుండా
ఊహలు గుసగుసలాడంగా
చెలిని చూడాలనీ
చేతిలోని చేయి కలిపి
భూలోకము విహరిరించెను
పంచభూతాత్ముడు
పంచాక్షువులుగా
పంచ విధంబులుగా
విశ్వమంతా విరివిగా
ఏకాంతంలో ఎరుక గనక
రుద్రుడే ప్రణయ ముగ్దుడై
పరవశుడయ్యే పావనమూర్తి
పరిమళాలు వేదజల్లన్
అద్భుతము అవతరించి
సాగే అలా అలా అలలుగా..
…… ……. …..

Get real time updates directly on you device, subscribe now.