నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో ఈ రోజు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం మరియు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నృత్యాలతో అలరించారు మరియు కొందరు విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలను బోధించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాలను గురి పెట్టి గట్టి పట్టుదలతో కృషి చేస్తే దేనినైన సాధించ వచ్చని అన్నారు మరియు ప్రతి విద్యార్థి బాధ్యత పట్టుదల సహనం అనే కంకనలను కట్టుకొని లక్ష్యం వైపు చేరడనికి పాటుపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.