పోలీస్ స్టేషన్ ను సందర్శించిన చాణక్య విద్యార్థులు

క్షేత్ర పర్యటన

న్యూస్
మా పాఠశాల (చాణక్య హై స్కూల్) 3,4,5 తరగతుల విద్యార్థులు స్థానికంగా సందర్శించడం జరిగింది.

నిన్న పోస్టాఫీసు మరియు పోలీస్ స్టేషన్ లను క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులకు చూపించి వాటి అవగాహన కల్పించారు. తపాలా ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా చేరుకుంటుంది, ఎప్పుడు చేరుతుంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమానంగా ఎలా పోటీకి నిలుస్తుంది.అనే అనేక విషయాలను విద్యార్థులు తెలుసుకున్నారు.

P

పోలీస్ వ్యవస్థ ఎందుకు మనం ఏర్పర్చుకున్నాం, నేరాలు చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి పోలీసులలో పెద్ద ఎవరు , దొంగలను ఎలా పట్టు కుంటారు, మనకు ఏదన్నా జరిగితే పోలీసులను సంప్రదించాలి. దానికోసం 100 కు డయల్ చేయాలి, గుర్తు తెలియని వ్యక్తుల తో మాట్లాడ కూడదు అనే విషయాలు విద్యార్థులు తెలుసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.