బీడీ కార్మికుల శ్రమ దోపిడి ఇంకెన్నాళ్లు

బీడీ కార్మికుల శ్రమ దోపిడి ఇంకెన్నాళ్లు

పత్రిక ప్రకటన తేదీ:01-05-2023.

137 వ మేడే స్ఫూర్తితో ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి.
**ఎం హరిత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్* *

ఈరోజు 137వ మే డే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపుమేరకు భైంసా లోని ఐ బి వద్ద మేడే జెండాను *తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ)రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హరిత* ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల కష్టాన్ని శ్రమను అత్యంత పైశాచికంగా దోచుకుంటున్న యాజమాన్యం. 12 గంటల వరకు వెట్టి చాకిరి చేయించుకొని తక్కువ వేతనాలు ఇచ్చి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా కార్మికులను బానిసలుగా భావిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్న సందర్భంలో మొదటిసారిగా చికాగో నగరంలో యాజమాన్యంపై తిరుగుబాటు తో ప్రపంచ కార్మిక శక్తులన్నీ ఏకమై యాజమాన్యానికి వంత పాడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది కార్మికులు ఉద్యమ బాట పట్టారు.అమెరికా ప్రభుత్వం కార్మికులను విచక్షణ రహితంగా కాల్చి చంపారు. ఆనాటి ఘటన ప్రపంచ కార్మిక విప్లవం ఉగ్రరూపం దాల్చి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినదించి కార్మిక హక్కుల కోసం పోరాడారు. ఆ పోరాట స్ఫూర్తిని తీసుకొని కార్మిక వర్గం చైతన్యవంతంతో హక్కుల రక్షణ కోసం,4లేబర్ కొడ్ల రద్దు కై, 26 వేల కనీసవేతన అమలు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో aikms రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు, కేజీబీవీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునీత, గంగామణి, సగర, భూలక్ష్మి, భూమవ్వ, రజిత, aikms నాయకులు దినాజీ, సాయినాథ్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.