ఉద్యమ కారుల సమావేశం
సమదర్శిని న్యూస్ :
లోకేశ్వరం మండలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు రాజురలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్వరం మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు శ్రీ సంటెన్న గారు మిగతా ఉద్యమకారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన తరువాత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని అదేవిధంగా ప్రభుత్వం నామినేట్ పదవులలో వారికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమించిన ఉద్యమకారుల గ్రామ కమిటీలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు చాకేటి లక్ష్మన్న గారు, లోకేశ్వరం మండల ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు గారు శ్రీ రాములు గారు నాయకులు ముత్తా గౌడ్ గారు రమేష్ గారు పోతన్నగారు నవీన్ గారు ప్రవీణ్ గారు అనిల్ గారు మిగతా గ్రామస్తులు పాల్గొన్నారు.