ఆళ్ళ కు పురస్కారం – సాహితీ బంధువు

ISBN NEWS

రచయిత ఆళ్ళ కు తెలుగు వెలుగు జాతీయ సాహిత్య పురస్కారం మరియు సాహితీ బంధువు ప్రదానం “”

తెలంగాణా రాష్ట్రం వరంగల్లుకు చెందిన తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ స్వచంద సేవా సంస్థ) వారు ,ది. 10/12/2023, ఆదివారం నాడు జరిపిన జాతీయ సాంస్కృతిక, సంగీత ,సాహిత్య ,నృత్య సమ్మేళనంలో…2023 , విజయవాడ, బాలోత్సవ భవన్ లో నిర్వహించిన సాహిత్య సభ లో
తెనాలి కి చెందిన కవి, రచయిత, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు ను తెలుగు వెలుగు జాతీయ సాహిత్య పురస్కారం మరియు సాహితీ బంధువు బిరుదు తో ఘనంగా సత్కరించి, పురస్కార ప్రదానం గావించారు. ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం లో తెలుగు వెలుగు సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పోలేటి రాజ్ కుమార్, తెలుగు వెలుగు జాతీయ సాహిత్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రంగిసెట్టి రమేష్, ప్రముఖ పద్య కవి శ్రీ పంతుల వెంకటేశ్వర్లు , సంస్థ గౌరవ అధ్యక్షుడు డా. పెద్దేటి యోహాను తదితర సాహితీవేత్తల మరియు మాజీ ఇస్రో చైర్మన్, రాష్ట్ర అధికార బిజెపి అధికార ప్రతినిధి శ్రీ చందు సాంబశివుడు మరియు మహాత్మాగాంధీ ఉపాసకులు శ్రీ గాంధి నటరాజన్ పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది.

Get real time updates directly on you device, subscribe now.