సందర్బం: 25/01/2024…
జాతీయ ఓటరు దినోత్సవం :
అంశం : ఓటు విలువ
శీర్షిక : ఐదేండ్ల ప్రగతికి బాట
వృక్షానికి వేరుల్లా
జగతికి ఉదయంలా
జనులకు హృదయంలా
బహుళ అంతస్తుల భవంతులకు పునాదుల్లా
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అలా!
ఓటు రాజ్యాంగం కల్పించిన వరం
నోటుకు ఓటును అమ్ముకోక
నైతిక విలువలకు పట్టం కడుతూ
సమర్థులకు ఓటేసి ఎన్నుకోవడం మన కనీస కర్తవ్యం!
మనవాడేనని మొగ్గుచూపుతూ
కులపోడేనని కదంత్రోక్కుతూ
అయినవాడని అభిమానిస్తూ
వందల నోట్లకు అమ్ముడుపోతూ
మధ్యంకు బానిసలౌతూ
అమూల్యమైన ఓటును దక్కినకాడికి తెగనమ్ముకుంటూ
ప్రశ్నించే హక్కును కోల్పోతూ
వజ్రాయుధం లాంటి ఓటును నిర్వీర్యం చేస్తూ
ఐదెండ్ల ఉజ్వల ప్రగతికి అవరోదం కల్పించేలా
ఓటుహక్కును దుర్వినియోగ పరచడం
మన వేలితో మన కంటిని పొడుచుకోవడమౌతుంది
కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది!
ఓటేసేముందు అయిదు నిముషాలు ఆలోచించు
ఐదెండ్ల ప్రగతికి పునాధిరాయిని దించు!
ఓటరు చేతిలోని వజ్రాయుధమే
ఓటు
దానిని గురిపెట్టి సంధించాలి ప్రతి ఓటరు
నోటుకు తిలోదకాలిచ్చి
ప్రజాస్వామ్యాన్ని సంరక్షించుకోవాలి ప్రతిఒక్కరు!
**************************
రచన :
ఆళ్ల నాగేశ్వరరావు
ఆర్టీసీ కండక్టర్
నాజరుపేట
తెనాలి….5