జర్నలిస్ట్ సమస్యలపై పోరాటానికి సిద్ధం: ప్రొ. యం. కోదండరాం

డిజెఎఫ్ ఆవిర్భావ సభ విజయవంతం

 

డిజెఎఫ్ ఆవిర్భావ సభ సక్సెస్

జర్నలిస్ట్ సమస్యలపై పోరాటానికి సిద్ధం: ప్రొ. యం. కోదండరాం

యాజమాన్యాలకు వడ్డీ లేని సబ్సీడీ రుణాలు అందజేయాలి

ప్రింట్ పేపర్ పై 90 శాతం సబ్సీడీ ప్రకటించాలి

జర్నలిస్ట్ కుటుంబాలకు ఉచిత బస్, ట్రైన్ రవాణా కల్పించాలి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు జారీ చేయాలి : యం. కోదండరాం డిమాండ్

మహాశక్తి ఆలయంలో డిజెఎఫ్ లోగో ఆవిష్కరించిన బండి సంజయ్

ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిల్మ్ భవన్ లో ఆదివారం నిర్వహించిన డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ సభ విజయ వంతం అయ్యింది. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఉద్యమకారుడు మానసాని కృష్ణారెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ డిజెఎఫ్ జాతీయ స్థాయిలో మరో పది రాష్ట్రాలలో పురుడుపోసుకుంది. జాతీయ అధ్యక్షులుగా మానసాని కృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి గా మోటపల్కుల వెంకట్, జాతీయ ఉపాధ్యక్షులుగా మహ్మద్ ఖురేషి లు తెలంగాణ నుండి డిజెఎఫ్ ను జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నారు. కరీంనగర్ లోని చౌతన్య పురిలో గల మహాశక్తి ఆలయంలో డిజెఎఫ్ లోగో ను ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ ఆవిర్భావ సభకు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రో.యం. కోదండరాం హాజరయ్యారు. సభావేధిక పై డి జె ఎఫ్ లోగోను కోదండరాం చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి అధ్యక్షతన, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటపల్కుల వెంకట్ సహకారంతో ఈ ఆవిర్భావ సభ కొనసాగింది.

జర్నలిస్ట్ సమస్యలపై పోరాటానికి సిద్ధం: ప్రొ. యం. కోదండరాం డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ సభలో ప్రో.యం. కోదండరాం మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యలపై వాటి పరిష్కారం కోసం జర్నలిస్ట్ సంఘాలతో కలిసి పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ప్రభుత్వం పత్రికా, న్యూస్ ఛానల్ యాజమాన్యాలకు వడ్డీ లేని సబ్సీడీ రుణాలు అందజేయాలని,
ప్రింట్ పేపర్ పై 90 శాతం సబ్సీడీ ప్రకటించి అందజేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్ట్ లకే కాదు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉచిత బస్ రవాణా పాసులు , ట్రైన్ రవాణా కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోదండరాం కోరారు.
పట్టణ, గ్రామీణ ప్రాంత జర్నలిస్ట్ లందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు జారీ చేయాలని యం. కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులకు, కుట్రలకు ప్రభుత్వాలే బాధ్యత వహించి వారికి తగిన రక్షణ కల్పిస్తూ దాడులు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలదేనని గుర్తుచేశారు. జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం కోసం, జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులు, కుట్రలు, అక్రమ కేసులను ఎదిరించేందుకు, జర్నలిస్టుల హక్కుల సాధన కోసమే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 11 అంశాలతో కూడిన సంఘ డిమాండ్లను ఈ సభలో ఆమోదింపజేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మోటపల్కుల వెంకట్ మాట్లాడుతూ ఈ సంఘం ఇప్పటికే జాతీయ స్థాయిలో పలురాష్ట్రాల్లో డిజెఎఫ్ పురుడు పోసుకుందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తో పాటు చిన్న పత్రికలను, ఛానళ్లను కాపాడుకునేందుకు సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ ఆవిర్భావ సభలో డి జె ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎండి ఖురేషి, ఆల్ ఇండియా పార్వర్డు బ్లాక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి, కరీంనగర్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి లు ప్రసంగించారు. రాష్ట్రంలో ని 33 జిల్లాల నుండి సీనియర్ జర్నలిస్ట్ లు, పలు పత్రికల ఎడిటర్లు, ఛానళ్ల ఎండి లు, తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ సభ అనంతరం రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని, వివిధ జిల్లాలకు బాధ్యులను కన్వీనర్, కో- కన్వీనర్ల గా ప్రకటించారు.

Get real time updates directly on you device, subscribe now.