వినాయక గేయం

అక్కి నర్సింలుగౌడ్ గారి రచన

వినాయక గేయం
🌹🌹🌹🌹🌹

గణనాయక ఓ వినాయక
గణగణ గజ్జెలు మ్రోగగను
ఇటురావయ్యా విఘ్నేషా
తొలుతనిన్నే వేడెదను

చదువుల నాయక వినాయక
చక్కగ దయజూడు గణనాయక
లంబోదరా జాగేలనయా
బిరబిర రావయ్య పార్వతి తనయా

శంకరునికి ముద్దుల తనయా
శంకలేక మము బ్రోవుమయా
ఎలుక‌ వాహనా ఏదయ నీదయ
ఎంతని నినునే వేడుదునయా

సురపూజితా సుందర‌ వదనా
అసుర పూజితా ఆదుకోవయా
సర్వేశ్వర సుత సకలలోకాల
కాచేవాడవు‌ నీవేనయా

కైలాసవాస కరుణామయా
కావగరావా ఓ దయామయ
గౌరీపుత్రా గంగా తనయా
దేవదేవతలకు దైవంనీవయా

అక్కి నర్సింలుగౌడ్
విశ్రాంత ఉపాధ్యాయుడు
మల్లాపూర్ (రంగారెడ్డి జిల్లా)
9912659965

 

Get real time updates directly on you device, subscribe now.