హిమ సోయగం చాటున… సూర్య సోయగం.

కొల్లాబత్తుల సూర్య కుమార్.

*హిమ సోయగం చాటున… సూర్య సోయగం.*
ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయాన్నే ప్రశాంతంగా ప్రకృతిని పరికించి చూద్దామని ఇంటి నుండి ఆరు బయటికి వచ్చి పరిశీలిస్తున్నాను. మంచు తెరలు తొలగుతున్నాయి.చెట్లు మసమసగా అస్పష్టంగా కనిపిస్తున్నాయి.ఆకాశం వైపు చూడగా మంచుతెరల మాటున సూర్యబింబం ప్రత్యేకంగా ఉండడం గమనించాను.సూర్య కిరణాలను కంటితో సూటిగా చూడలేక సెల్ తో క్లిక్ అనిపించా.మొదటి ఫోటోలో సూర్యబింబానికి దగ్గరగా ఎర్రటి వలయం కనిపించింది.తరువా రెండవ ఫోటో తీసి చూసా.దీనిలో ఎర్రటి వలయం సూర్యబింబానికి కొంచెం దూరం జరగడం కనిపించింది.వెంటనే మూడో ఫోటో తీసి చూశాను.దీనిలో ఎర్రటి వలయం రంగు పలుచబడి సూర్యబింబానికి దూరంగా కనిపించింది.వెంటనే నాలుగో ఫోటో తీయగా సూర్యబింబం సాధారణ స్థితిలో కనిపించడం జరిగింది.ఈ ప్రక్రియ అంతా ఒక నిమిషం లోపుగా జరిగిన గమ్మత్తు.సూర్యబింబం ఇలా ఎందుకున్నదంటే… సూర్యుని నుండి ప్రసరించే సూర్య కిరణాలు మంచు బిందువులగుండా పయనించి భూమిని చేరడమే ఈ గమ్మత్తుకి కారణం.
*చూశారా! మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించక, ప్రకృతి మనకి ఉచితంగా ప్రసాదించిన మనోనందకర దృశ్యాలను చూసి మనం మనసు పరవశించే భాగ్యాన్ని కోల్పోతున్నాం.పనుల ఒత్తిడితో మనం ప్రకృతి చిత్ర విచిత్రాలను ఆస్వాదించలేక పోయినా…కనీసం రేపటి పౌరులౌతున్న మన పిల్లలనైనా పృకృతితో చెలిమి చేసే ప్రయత్నం చేద్దాం!పిల్లలు పాలిట ‘చెర’వాణిగా మారిన చరవాణి(సెల్ ఫోన్)నుండి కొంచెం సమయమైనా దూరం చేద్దాం!*
-కొల్లాబత్తుల సూర్య కుమార్.

Get real time updates directly on you device, subscribe now.