నాశబోయిన నరసింహ కు “ఛత్రపతి శివాజీ పురస్కారం”

నాశబోయిన నరసింహ(నాన)కు "ఛత్రపతి శివాజీ పురస్కారం" ప్రదానం:

నాశబోయిన నరసింహ(నాన)కు “ఛత్రపతి శివాజీ పురస్కారం” ప్రదానం:
నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన ఆరోగ్య పర్యవేక్షకుడు, కవి,రచయిత నాశబోయిన నరసింహ (నాన) “ఛత్రపతి శివాజీ అవార్డ్” అందుకున్నారు.ఆదివారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం హైద్రాబాద్ లో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం&ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు సందర్భంగా వైద్య &ఆరోగ్య రంగంలో నైపుణ్యత ప్రదర్శించినందుకు గౌరవ ప్రదంగా ఆర్.కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్కాజ్ గిరి విశ్రాంత జడ్జి బి.మధుసూదన్, గాంధీనగర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డా.చిల్లా రాజశేఖర్ రెడ్డి,సినీ హిరో కిరణ్,ఆర్.కె ఫౌండేషన్ చైర్మన్ డా.రంజిత్ మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా నరసింహకు “ఛత్రపతి శివాజీ పురస్కారం” ప్రదానం చేసి మెమెంటో, సర్టిఫికెట్,శాలువాతో ఘనంగా సన్మానించారు.
ప్రస్తుతం NVBDCP సబ్ యూనిట్ సికింద్రాబాద్ లో విధులు నిర్వహిస్తున్న నరసింహ గత ఇరవై రెండు యేళ్ళ నుంచి వైద్య ఆరోగ్య రంగంలో క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో గ్రామీణ ప్రజలను చైతన్యపరచడం ద్వారా వృత్తిలో నైపుణ్యం ప్రదర్శిస్తూ సమాజ హితం కాంక్షించే వైద్యారోగ్య విశిష్ట సేవలకు గుర్తింపుగా తనకు ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు చెప్పారు.మరో వైపు ఈ పురస్కారం అందుకున్నందుకు వైద్యారోగ్యశాఖ సహోద్యోగులు,సాహితీ మిత్రులు, బంధువులు నరసింహకు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.