మనసున్న అమ్మ కొండూరు కృష్ణమ్మ

సమదర్శిని. కామ్

మనసున్న అమ్మ కొండూరు కృష్ణమ్మ

అక్షర జ్ఞానం లేకపోయినా… ఆస్తి అంతస్తులు ఇవ్వలేకపోయినా… అమూల్య వరంగా జన్మనిచ్చి, లాలించి పాలిచ్చి… నిత్యం కష్టపడి పూట గడపాల్చివచ్చినా నిరుపమాన మమకారాన్ని పంచుతూ పిల్లల వికాసమే పంచప్రాణాలుగా భావిస్తూ పిల్లల కోసమే జీవించే ఆదర్శ మాతృమూర్తులు కొందరుంటారు అలాంటి వారిలో ఒకరు కొండూరు క్రిష్ణమ్మ
తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధి నెర్నూరు ప్రాథమికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రచయిత కొండూరు వెంకటేశ్వరరాజు మాతృమూర్తి గారైన క్రిష్ణమ్మ పాత తరం మనిషైనా పిల్లల పట్ల ప్రేమను చూపడంలో దైవం కన్నా మిన్న. స్వార్థం ఎరుగని స్త్రీమూర్తి. నిరాడంబరం ఆమె మనో ఆభరణం. గొప్పలు తెలియని మహిళమణి. పిల్లల సేవలో తరించిన దయామయి. కష్టకాలంలో కష్టపడి కూలిపనులు చేసి కుటుంబానికి అండగా నిలిచిన శ్రమజీవి. ఉమ్మడి కుటుంబమైనా వివాదాలకు తాను దూరం ఎన్నడూ ఎవరినీ మాట అనని మనసున్న అమ్మ. తాను తినకపోయినా పిల్లల ఆకలి తీర్చి సంతృప్తి పడే స్ఫూర్తిదాయక జనని. కంటికి రెప్పలా కాపాడుతూ పిల్లల ఉన్నతికి పాటుపడిన అమృతమూర్తి. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వయోజన విద్యా వ్యాప్తికి తన భర్త రమణరాజుతో కలిసి సహాయసహకారాలు అందించింది. పీడిత జనులపట్ల సానుభూతిని ప్రకటించేది. అభాగ్యుల జీవితాల్లో వెలుగును కోరుకునే మానవతామూర్తి. వృద్ధాప్యం సమీపించాక ఆనందంగా గడిపింది. మే నెలలో తల్లుల దినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యుల నుండి సత్కారం అందుకుంది. క్లిష్టమైన కరోనా కాలంలోనూ ఆరోగ్యంగా జీవించిన ఆమె అనూహ్యంగా డిసెంబర్ 11వ తేదీన అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని వీడింది. క్రిష్ణమ్మ ఆదర్శనీయత ఇనుమడించేలా కొండూరు వెంకటేశ్వరరాజు కుటుంబ సభ్యులు 22 తేదీన సంప్రదాయబద్ధంగా కర్మక్రియలు నిర్వహించారు. ఔదార్యంతో అన్నదానం ఏర్పాటు చేశారు.
వస్తు రూపేణ ఆహ్వనితులందరికీ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బంధువులతో పాటు పలువురు ఉపాధ్యాయులు, సాహితీమిత్రులు పాల్గొని క్రిష్ణమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మమకారం మూర్తీభవించిన రూపమే అమ్మ అనే మాటకు సార్థకత చేకూర్చుతున్న క్రిష్ణమ్మ ఆధునిక తరాల మాతృమూర్తులకు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం!… క్రిష్ణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిద్దాం!…
ఇట్లు
తెలుగు ఉపాధ్యాయుడు
కొండూరు వెంకటేశ్వరరాజు

Get real time updates directly on you device, subscribe now.