తెలుగును మరువద్దు- డాక్టర్ జే భీంరావు

ఘనంగా తెలుగు భాష ఉత్సవం

ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ నందు తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె భీమారావు గారు అధ్యక్షత వహించారు.

వారు మాట్లాడుతూ తెలుగు భాషా అర్థవంతమైన భాషా అని సుసంపన్నమైన సాహిత్యాన్ని కలిగిన భాష అని అభిమానంతో మాతృభాషకీర్తిని ఖ్యాతిని చాటడం మన అందరి కర్తవ్యం అని అన్నారు.

తెలుగు విభాగాధిపతి నర్సయ్య గారు మాట్లాడుతూ ఎవరి మాతృభాష పై వారికి అంతులేని గౌరవం ప్రేమ వుంటాయని పదాలలో, సంభాషణలల్లో వారి వారి భాష స్వీయ అస్తిత్వం వ్యక్థమౌతుందని మాతృభాషను గౌరవించి వాడుకలో నిలుపుకోవాలని సాహిత్య సాంస్కృతిక జ్ఞాన వారధిగా భాషను భావ తరాలకు అందించాలని మాతృ భాషా ప్రత్యేకతను వివరించారు. విద్యార్థులు తమ అనుభవాలను వ్యక్తం చేశారు.

డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో
పీజీ రెడ్డి, రవి కుమార్, సరితా రాణి, డాక్టర్ శంకర్, రమాకాంత్, శ్రీహరి, నరేందర్, డాక్టర్ రజిత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.