*నెహ్రూ జన్మదినం– బాలలకు ఆనంద మయము*
(నెహ్రు తాత పై నా గేయం)
*పల్లవి:* నేటి బాలలు మీ పుట్టినరోజు
రేపటి పౌరులు మీ పండగ రోజు
నెహ్రూ కథనే వినరా నిజ మార్గము నువు కనరా!–2
*చరణం:* చాచా అంటే నెహ్రూజీ–చాలా ఇష్టం గురూజీ
నేతలకే ఆదర్శం– నలుగురుతో అనుబంధం
భారతదేశం మొదటి ప్రధాని నెహ్రూ తాత కదరా!
ప్రపంచమంతా మెచ్చుకునే శాంతిదూత కదరా!
భారతదేశం శాంతిమయం– నెహ్రూ తోనే సాధ్యమయం–2
*//నేటి బాలలు//*
*చరణం:* పిల్లలు అంటే పిడుగులురా– చదువుల తల్లి బిడ్డలురా!
బడిలో మెదిలే బాలలురా భవిత మీదేరా!
భారతదేశం ఉప్పొంగే ముద్దుబిడ్డలు కావాలి
భారతదేశం గర్వించే బంగరు నేతలు అవ్వాలి
చక్కని చదువులు చదవాలి– మంచి మార్గం నడవాలి-2
*//నేటి బాలలు//*
*🌹🌹నెహ్రు పుట్టినరోజు సందర్భంగా… బాలల దినోత్సవ శుభాకాంక్షలు🌹🌹*
*జామి సత్యనారాయణ*
*కవి నటుడు ఉపాధ్యాయుడు*