హృది పారిజాతాలు

సిరిపురపు నాగలక్ష్మి

*శీర్షిక:- హృది పారిజాతాలు*

నా గుండె చప్పుళ్ళు
శ్రీ కృష్ణుని మధుర లీలలు

నా కలల పుప్పొళ్ళు
శ్రీ మాధవుని నయనాలు

నా కన్నుల కన్నీళ్ళు
శ్రీకరుని చరణారవిందాలు

నా ఆలోచనల సంతకాలు
శ్రీ మధనుని అదరాలు

నా మనసు కిరణాలు
శ్రీ ముకుందుని ముద్దుమురిపాలు

నా భావాల ప్రతినిధులు
శ్రీధరుని ధ్యాన ముద్రలు

నా మౌనాల శృతి లయలు శ్రీనంద నందనుని హృదిపారిజాతాలు

శ్రీ మాధవుని ఆరాధనలో మధువనమాయె నా హృదయం
నా మనసు మందిరాన అక్షర దేవతార్చనలు

శ్రీ మాధవుని అర్చించు అక్షర కుసుమాలు

శ్రీ రాఘవుని సేవించు అక్షర నీరాజనాలు

శ్రీ గిరి నివాసునికి విందు సేయు అక్షర నైవేద్యాలు

శ్రీ దేవదేవునికి సర్వం సమర్పించు అక్షర ఆత్మార్పణలు !!

ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
సిరిపురపు నాగలక్ష్మి
కలం పేరు:- సిరి
తెలుగు ఉపాధ్యాయిని
మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులం
శ్రీశైలం
9989659416

Get real time updates directly on you device, subscribe now.