చిన్న మనసులు పెద్ద వీడుకోలు

ఆనంద్ రాజ్

చిన్న మనసులు పెద్ద వీడుకోలు క్

ఎందరో మంది విద్యార్థుల
జీవిత చరిత్రను తిరిగి వ్రాస్తున్నటువంటి
మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల
అధ్యాపక బృందానికి
మా యొక్క నమస్కారములు.

తేనెకంటే మధురమైనది
తెలుగు తేనెకంటే తీయనైనది
మీ ముత్యాలు,రత్నాల వంటి మాటలు,
ఎటువంటి వారికైనా అజ్ఞానం
అనే అంధకారాన్ని తొలగించే
దివ్య రూపాలు మా గురువులు.

చదువుల తల్లి కొలువైన
అందమైన మనసు
మీ వాక్కులతో మమ్మల్ని సంతోషపరిచారు .
మేము అనుకున్నది సాధించాలి
అనే మీ చిన్న తపన, కోరిక, నే
కానీ మాకు అది స్ఫూర్తిదాయకం
ధీరత్వం, ప్రేమ అభిమానం
ఆత్మాభిమానం ,కలిగినటువంటి
పెద్ద మనసున్న మహానీయులు
మీరు మాలో పోటీ తత్వాన్ని
ధీరత్వాన్ని ,రగిలించే
ప్రియమైన గురువులు మీరు,

పుస్తక పఠనమే కాకుండా
లోకజ్ఞానాన్ని బోధించి మమ్మల్ని
సంస్కారవంతులుగా మంత్రముగ్ధుల్ని
చేసిన మాధుర్యాలు
మీరు కష్టకాలంలో బాధలను
పంచుకుంటే మీయొక్క
జీవిత ప్రయాణంలో
పడిన కష్టాలను
మాకు బోధించి ధైర్యాన్ని నింపి
స్ఫూర్తిదాయక మాటలను
గుండెల్లో నింపిన గురువుల మీరు

చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పిన
మాతృమూర్తులు మీరు తిరుగులేరు
మీకెవ్వరు సరిలేరు మీకెవ్వరు
అద్భుత ఆదర్శం మీరు మహాద్భుతం

వదలబోకు నీ కన్న ఊరిని మరువబోకు
నీ విద్య నేర్పిన గురువులను దూరం చేయకు
ప్రేమాభిమానాన్ని నీవు వదిలిపెట్టకు
గురుశిష్య సంబంధాన్ని అందమైన
ఈ మూడు సంవత్సరాల
పయనం వదిలిపోతున్నాం కానీ
మరువలేక పోతున్నాం
పుట్టిన గడ్డని మరిచినా
విద్య బిక్షులు పెట్టిన
గురువులను మరువబోకు
బర్రె పాలు కన్నా ఆవు పాలు మిన్న
ప్రైవేటు విద్యార్థి కన్నా
ప్రభుత్వ విద్యార్థి మిన్న
మరువనిది ఈ పయనం కానీ
మరువలేక పోతున్నాం

మీ అందమైన తీపి జ్ఞాపకాలు
తీపి కలగా ఈ కార్యక్రమం
గుండెగది(అక్వేరియం)లో చేపల్లా
ఈదులాడుతూనే ఉంటాం
ప్రేమతో చివరి సంవత్సరం
మీ ప్రియమైన విద్యార్థి బృందం

ఆనంద్ రాజ్ 2019 – 22 బృందం
91215111091

Get real time updates directly on you device, subscribe now.