డిగ్రీ కళాశాలను సందర్శించిన ఆర్ జే డి

నిర్మల్ న్యూస్

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన తెలంగాణ కళాశాలల సంయుక్త అధిపతి (జాయింట్ డైరెక్టర్) డాక్టర్ డి ఎస్ ఆర్ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ “ఈచ్ వన్ జైన్ హండ్రెడ్” అని పిలుపు నిచ్చారు, నవీన్ మిట్టల్ గారు కళాశాల ను అభివృద్ధి కి నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే పాల్వంచ, బీచ్ కుంద లాంటి చిన్న కళాశాలు ఏ గ్రేడ్ పొందాయి. వచ్చే సంవత్సరం నాటికి ఇదికూడా ఏ గ్రేడ్ పొందాలని అన్నారు. విద్యార్థుల భావితను దిశా నిర్దేశం అందించేది న్యాక్ అని అన్నారు. జిజ్ఞాసలో మొదటి స్థానాన్ని పొందాలని అన్నారు. ఉద్యోగానికి మన దగ్గర జరిగే బీసీ వెల్పేర్ కోచింగ్ ను వాడుకోవాలి అన్నారు. బాగా కష్టపడి అందరికి ఆదర్శనంగా నిలవాలి అన్నారు. మన కళాశాలలో అధ్యాపకులు నెట్ సెట్ పరిశోధనలు చేసి వున్నారు వారి సలహాసలు తీసుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని అన్నారు. గన్ ఎలాగా నిండి ఉంటుందో అలాగే మీరు చదువుకొని సిద్ధమవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విద్య పోటీ కార్యక్రమాలకు హాజరవ్వాలి.
రాజపథ్ లో ఎన్ సి సి విద్యార్థులు పరేడ్ చెయ్యాలనే లక్ష్యంతో ఉండాలి. మోడీ కూడా ఎన్ సి సి విద్యార్థి కావున మీరు క్రమశిక్షణ తో ఉండాలని సూచించారు. జూన్ నెలలో న్యాక్ వస్తుంది అప్పుడు ఈ కళాశాల ఏ గ్రేడ్ పొందాలని అన్నారు. యూజీసీ నుండి వచ్చే నిధులు పొందాలని ఆశిస్తున్నాను. పీజీ కోర్సులను విద్యార్థులు ఉస్మానియా, నెహ్రు లాంటి విశ్వ విద్యాలయం చేయాలని అన్నారు. అడ్డంకులు చదువుకునే విద్యార్థులకు ఉండవు అని అన్నారు.

కార్యక్రమంలో పి రాం బాబు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు పరిపాలన వ్యవస్థను వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 1999వ సంవత్సరం లో 9 ఓట్లతో గెలిచాడు. కావున ఓటు హాక్కు నమోదు చేసుకోవాలి. 17 సంవత్సరాల వయసు దాటినా వారికి అంటే అక్టోబర్ నెలలో జన్మించిన వారికి ఓటు హక్కు కల్పిస్తుంది ప్రభుత్వం. ఆధార్ పత్రం దేశములో ఒకటే ఉంటుంది రెండు మూడు ఇవ్వరు. ఆధార్ కు ఓటరు లింకు చేస్తున్నాము. 1994లో ఓటరు లిస్టులో ఫొటోను ప్రవేశపెట్టారు. దాని వల్ల ఓటరు వినియోగం ఉపయోగవంతంగా ఉందని అన్నారు. పత్రం సంఖ్య 6 ను నింపి ఓటరు వివరాలు నమోదు చెయ్యాలి. ఓటు వజ్రాయుధం లాంటిది దాన్ని సమర్తవంతంగా వాడాలి. నిర్మల్ జిల్లాలో 40 శాతం ఓటరు నిర్దారణ చేసాము ఇంకా మొత్తం చేయాల్సి ఉందన్నారు. ఓటరు మంచి నాయకుని ఎన్నుకోవచ్చు. విద్యార్థులు వ్యక్తి గతమైన శ్రద్దను చూపి వార్తా పత్రికలలో వస్తున్న ఎడిటోరియల్ కాలంను జనరల్ నాలెడ్జి కోసం చదవండి. ఉద్యోగాల లో స్థిర పడాలి అన్నారు.

తహసీల్దార్ సుభాష్ గారు మాట్లాడుతూ ఓటరు లిస్ట్ లో పేరు నమోదు చేసి, ఓటరు శాతం పెంచాలి అందుకోసం మన చుట్టుపక్కల వాళ్లకు చెప్పాలని అన్నారు

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె భీం రావు గారు మాట్లాడుతూ కళాశాలల అభివృద్ధి చేయుటలో నవీన్ మిట్టల్ , రాజేంద్ర సింగ్ ల కృషి గొప్పదని కొనియాడారు,ఓటరు నమోదు తప్పకుండా చేస్తాము.
ఏ గ్రేడ్ రావడానికి ప్రయత్నాలు, ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డివో తుకారాం, అధ్యాపకులు డాక్టర్ జే భీం రావు, సరితా రాణి, పీజీ రెడ్డి, శ్రీనివాస్, టేకులపల్లి నర్సయ్య, రఘు గారు, రవి కుమార్, డాక్టర్ రజిత, అరుణ్, అజయ్, దిలీప్, డాక్టర్ రంజీత్ కుమార్, సైదులు,గులహానాజ్ తదితరులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.