కవి యాత్ర…”
కవి యాత్ర కదిలింది
రవియాత్రయై…
కవులందరు ఒక్కటై!!…
కలంపట్టి దళంవలె కదిలిండ్రు…
జనం వైపు కవితలతో
అడుగులు వేసిండ్రు!!…
బాధ్యతనెరిగి వెలుగులునింపే
భావితరానికి పునాదివేయ…
భవితవ్యానికి మార్గంచూప!!…
విజ్ఞానానికి ఊపిరిపోసి
అజ్ఞాన చీకటిని
తరిమి కొట్టే…కవియాత్ర!!…
ప్రజాసేవకై చేతులు కలిపి
కదిలిండ్రు కవులందరు!!…
జనంవైపు రణంలా…
అక్షరాలకు పదునుపెట్టి
శస్త్రాలే అస్త్రాలుగా…
ఐకమత్యం నిలుపుటకొరకై
కదిలిన కవియాత్ర!!…
అజ్ఞానతిమిరాన్ని అణగతొక్కి…
విజ్ఞానకిరణాలు నిలువెత్తు నిలిపి…
చైతన్య కిరణాలవెలుగులనింప
అక్షరాస్యతతో హారతిపడదాం!!…
నిరక్షరాస్యతను నిర్మూలిద్దాం!!…
ప్రతిపనిలో శక్తినినింపి…
ప్రజాశక్తికి చేయూతనివ్వ
సోమరితనానికి సమాధికట్టి…
మానవత్వాన్ని మదిలోనింపి…
కవియాత్ర సహకారం
అందరికి పంచుదాం!!…
సాధించే సాహసం నింపుదాం!!…
స్వేచ్చా స్వాతంత్రంలో నిలబెట్టుదాం!!
మన పదాలకూర్పే ప్రగతికి మార్గం!!…
ప్రతి ఒక్కరినీ ప్రగతి పథంలో నడిపిద్దాం!!…
కొత్త సమాజానికి ఊతమై నిలుద్దాం!!…
తరతరాలు వెలుగై నిలుద్దాం!!…
నిరంతరం కవియాత్ర
అభ్యుదయభావాలు మనలోనే…
ఆత్మీయ ఆలాపనలు మనలోనే…
ప్రేమతత్వాలు మనలోనే..
ఆధ్యాత్మిక భావాలు మనలోనే…
అందుకే అందరిని కవియాత్రతో…
పునీతులను చేద్దాము!!..
ఓ కొత్త పునాదిగా నిలిచిఉండు…
ప్రేమ పునాదిగా పారుతూనే ఉండు!!…
కర్తవ్యోపదేశము చేస్తూ ఉండు!!..
దేశమంత జైజై అంటూ ప్రతిధ్వనిస్తూనే ఉండూ…
ఇదే కవుల యాత్ర..కవిత యాత్ర…
మహాద్భుతమైన భావ యాత్ర!!..
నిజమైన కవుల కవిత్వానికి
సార్థకత ఈ కవియాత్ర!!…
ప్రతి కవి గుండె మండి
సమాజం గుండెను చదును చేస్తుండాలి!!…
జీవితాంతం జ్ఞాపకమై నిలవాలి!!…
అందరిని కరచాలనం చేస్తూ…
ప్రభావితం చేస్తుండాలి!!…
దైన్యాన్ని పోగొట్టి ధైర్యం నింపాలి!!…
కవిత్వం ఓ సంజీవినిలా బతికిస్తోంది!!..
ఓ జీవధాతువై జీవింపజేస్తోంది!!…
కవుల అక్షరాకృతి దాల్చిన
ఓ కవియాత్ర…కవితయాత్ర…
సామూహికంతో సాగి
ఓ ఉద్యమ స్పూర్తితో…
అందరినీ పలకరిస్తూ పరవశిస్తూ
ప్రభవిస్తూ…పయనిస్తోంది!!…
ఇదో కొత్తమార్గంలో పయనిస్తోంది!!..
సరికొత్త ఆలోచనలకు పురుడుపోస్తోంది!!…
కొత్తగా రాబోయే కావులందరికి ఇదో దిక్సూచి!!..
కవుల జాతిని ముందుకు నడిపించే చైతన్య యాత్ర !!..
అంబటి నారాయణ
నిర్మల్
9849326801