వేము వందనంకు జాతీయ లెజెండరీ పురస్కారం
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ భవానీ కాలనీకి చెందిన రచయిత వేము వందనంకు ‘తెలుగు వెలుగు’ జాతీయ లెజండరీ పురస్కారం దక్కిం ది. తెలుగు వెలుగు సమితి వేదిక (స్వచ్ఛంద సేవా సంస్థ) 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. గ్రేటర్ వరం గల్లో డిసెంబర్ 4న ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. తాను చేసిన సేవలు, రచనలను గుర్తించి ఈ అవార్డుకు ఎం పిక చేయడం సంతోషంగా ఉందని ఎంపిక చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సమదర్శిని న్యూస్