భోగేశ్వరస్వామి కి గజమాల సమర్పణ
***********************
పామిడి, జనవరి 30:రాజకీయ నాయకుల మెప్పుకోసం, అభిమానసినినటుల చలనచిత్రం విడుదలరోజు అభిమానులు బంతిపూల గజమాలలు సమర్పించేవారిని నిజ జీవితం లో చూస్తూనే ఉంటాము. కానీ నిత్యం పూజలందుకునే దేవుళ్లకు గజమాలలు సమర్పించేవారు కరువే. పామిడి పట్టణం లో వెలిసిన శ్రీ భోగేశ్వర స్వామి వారికి రోజాపులతో అతిపెద్ద గజమాల సమిర్పించిన సంఘటన ఈరోజు కన్పించింది. పట్రా పుల్లయ్య భక్తుడు మాల సమర్పించి తన మొక్కు తీర్చుకున్నాడు. మాఘమాసం రెండవ సోమవారం స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ఫల రసాలు, గరిక రుద్రాక్ష అభిషేకం గావించిన అనంతరం ఈ మాలను స్వామి వారికి అలంకరించారు. ప్రసన్న పార్వతి అమ్మవారిని చందన, హరిద్ర లేపనం తో అలంకరించి దీపారాధన సేవ చేశారు. నివేదన, మంత్ర పుష్పపఠనం అనంతరం సప్తవిధ హారతులు గావించి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు. వేద పండితులు రామేశ్వర శర్మ, చంద్రమౌళి, అనిల్ కుమార్, ప్రవీణ్, శాంతన్, జగదీష్, అప్పారావు లు అలంకరణ, పూజ కార్యక్రమం లో చేపట్టారు.
Get real time updates directly on you device, subscribe now.

తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
Prev Post
Next Post