దివ్య భానోదయం కథ … తిరుపతి

సమదర్శిని న్యూస్

*దివ్య భానోదయం*

*16/12/2022*
*శుక్రవారం*

ఆమని రాకతో అవని పులకరించింది,
మధుమాస వేళలో కోయిల మనసుపడి రాగాలు తీస్తూ ఉంది,ఈ ఆహ్లాదకరమైన వాతావరణం లో సరదాగా గడపాలని వైజాగ్ బీచ్ కి వెళ్ళాడు భానూ…
ఓ మహోన్నత వ్యక్తిత్వం మూర్తీభవించిన మహానీయుడు భానూ,చదవు సంస్కారం,సౌశీల్యం కలగలిపిన సుగుణాభిరాముడు,హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి మంచి గ్రేడింగ్ తో స్నాతకోత్సవం పొందాడు,తన కాళ్ళ మీద తానే నిలపడాలనే ఆలోచన,ఏదో ఒక ఉద్యోగం సాధించాలనే తపన, ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం లేదు ఇలా ఎన్ని రోజులు ఖాళీగా ఉండాలి ఏదో ఓటి చేస్తే గాని చదివిన చదువుకు సార్థకత ఉండదు కదా అని ఆలోచనలో మునిగిపోయాడు భానూ,ఇంతలో….”ఏరా భానూ కులాసేనా ఇక్కడ ఏం చేస్తున్నావు చాలా రోజులు ఔతుంది చూసి, ఎక్కడ ఉంటున్నాను,ఏం చేస్తున్నావు,””నేను బావున్నారా రాజు,చదువంతా ఐపోయింది, ఏదైనా ఉద్యోగం దొరికితే బావుంటుంది, ఇక్కడ ఏమి లేవు ఖాళీగా ఉంటే ఏం తోచడం లేదని ఇలా వచ్చాను,””అంటే ఉద్యోగం దొరికితే పెళ్ళి చేసుకుని సుఖపడాలని ఆలోచననా,””హే అదేం లేదు ఇప్పుడే పెళ్ళేంట్రా బాబూ, లైఫ్ సెటిల్ కావాలి,ఏదైనా సాధించాలి ఆ తర్వాత నే పెళ్ళి ఆలోచనా” “ఏమైనా ప్రేమ దోమ కాటేసిందా లేదా””అంత తీరిక ఎక్కడిది రా, అవేం లేదులే గాని ఏదైనా జాబ్ ఉంటే చూడరా””నువు ఇప్పుడు జాబ్ చేసి ఏం చేస్తావురా ఒక్కగానొక్క కొడుకు వి,అంత ఆస్తి కి వారసుడివి””ఎంత ఉంటే ఏముంది రా మనకంటూ ఓ స్టేటస్ లేకపోతే సమాజం గుర్తించదు కదా..””సరే నేను అదే పని మీద హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నా,ఏదో ఇంటర్వ్యూస్ ఉన్నాయటా,నాతో వస్తావా మరి””ఒకే రా తప్పకుండా, ఎప్పుడూ వెళ్ళాలి నా సర్టిఫికెట్ లు రెడి చేసుకోవాలి,””సోమవారం ఉదయం వెళదాం రా రెడిగా ఉండూ” అని రాజా చెప్పడంతో ప్రయాణం ఏర్పాటు చేసుకున్నారు భానూ,

“నాన్నా… హైదరాబాద్ లో ఏవో ఇంటర్వ్యూ స్ ఉన్నాయటా నేను వెళ్ళొస్తా, ఖాళీగా ఉండడం నా వలన కావడం లేదు,ఉద్యోగ ప్రకటనలేవి రావడం లేదు,”అని నాన్నగారి అనుమతి తీసుకున్నారు భానూ,”నీ ఆలోచన బాగానే ఉంది కాని ఎక్కడో హైదరాబాద్ దాకా వెళ్ళి చేయడం ఎందుకు రా ఇంటిపట్టున ఉంటే మాకు తృప్తి గా ఉంటుంది,ఇన్ని రోజులు చదువు కారణంగా దూరంగా నే ఉన్నావు మళ్ళీ ఇలా అంటున్నావు” “హైదరాబాద్ సిటి కదా నాన్నా,కొంత కాలం అక్కడ జాబ్ చేస్తే నాకు కాస్తా అనుభవాలు దొరుకుతాయి కదా అని,””సరే నీ ఇష్టం, డబ్బు ఎంత కావాలో లాకర్ లో నుండి తీసుకో,నువు చేసే ఉద్యోగం ఏదైనా నీ చదువుకు సరిపోయేలా,నీ గౌరవాన్ని పెంచేది గా ఉండేలా చూసుకో””అలాగే నాన్నా, ఆశీర్వదించండి,”

మరునాడు ఉదయమే భానూ తన మిత్రుడు రాజుతో కలిసి ఉద్యోగ వేటలో హైదరాబాద్ వెళ్ళారు,”ఎంత మహా నగరం ఇది మొదటిసారి చూస్తున్నందుకు ఎంత ముచ్చటేస్తుంది,తన భార్య భాగమతి పేరుతో నిర్మించిన ఈ మహానగరం నిజంగా భాగ్య’నగరమే కదరా,ఎంతో మందికి ఉద్యోగాలు అందించి ఆదుకున్నా ఈ నగరపు ఒడిలో మనకు ఓ స్థానం దొరుకుతుందేమోనని ఆశతో వచ్చాం,రాజు ఏదో హడావిడి లో వచ్చేశాం కాని ఏ ప్రణాళిక చేసుకోలేదు మనకు షెల్టర్ ఎక్కడ రా మరి,”అవగానే, రాజు” దిల్ సుఖ్ నగర్ లో వర్కింగ్ మెన్స్ హాస్టల్స్ చాలా ఉంటాయి అందులో స్టే చే‌సి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడదాం,””అలాగే పదరా” అంటూ ఇద్దరు బయలుదేరారు,

ఉద్యమాలకు ఊపిరి పోసిన
ఉస్మానియా యూనివర్సిటీ, ప్రపంచంలో నే మొదటి పదవ స్థానం లో నిలుస్తూ,అందరికి ఉన్నత విద్య అందిస్తూ, ఎందరికో ఉపాధి కలిగిస్తూ, మరెందరినో డాక్టరేట్లు గా తీర్చి దిద్దిన విశ్వవిద్యాలయం అది,
తేది 15/05/2015 రోజున ఆంగ్ల భాష వర్తమాన స్థితి పై జరిగే సెమినార్ లో పాల్గొనడానికి వక్తల వాఖ్యలు ప్రతినిధులకు ఆహ్వానం అనే ప్రకటన విడుదల చేశారు,”అరే రాజు ఎలాగు ఉద్యోగం కోసమే తిరుగుతున్నాం కదా ఈ సెమినార్ కి వెళితే ఏదైనా ప్రయోజనం ఉందేమోరా కాల్ చేద్దాం రా” అనే భాను సలహా తో ఓకే చేశారు రాజు,అలా ఆ రోజు జరగబోయే సెమినార్ కి ప్రతినిధులు గా వెళ్లారు,”ఎంత బావుంది ఈ విశ్వవిద్యాలయం అంటూనే సెమినార్ హాల్ లో అడుగు పెట్ఝారు ఇరువురు, అప్పటికే మొదలు కావస్తోంది,. “ఎక్స్యూమీ సార్ ఐయామ్ భానూ ఫ్రం వైజాగ్,అనే నా మాటలకు అందరు నిర్ఘాంతపోయి చూస్తున్నారు'” “మిస్టర్ బాపూ ప్లీజ్ కం” అనగానే వెళ్ళి కూర్చున్నాను కాని ఆ సెమినార్ లో నాకున్న పరిజ్ఞానం కంటే తక్కువ వాళ్ళే ఉన్నారు,ఏదో మాట్లాడుతూ ఉన్నారు,ఆ వ్యాఖ్య నిర్మాణం బాగా లేకపోవడంతో నేను మాట్లాడాను,అందరూ షాక్ అయ్యారు”సార్ మీ దగ్గర ఆంగ్ల నేర్చు కోవాలి సార్ ట్యూటర్ గా మాకు టీచ్ చేస్తొరా,”అయామ్ sry,నేను వేరే ఉద్యోగం వేటలో ఇక్కడికి వచ్చాను అని అక్కడ నుంచి వచ్చేశాను, మరుసటి రోజు ఏదో జాబ్ ఉందని తెలిసి డాటా ఎంట్రీ ఆఫీస్ కి వెళ్ళాను, డోర్ టూ డోర్ సర్వే ఉంటుంది,మీకు ఓ యాప్ ఇస్తాం దాని ఆధారంగా మీరు డ్యూటీ చేసింది లేనిది తెలుస్తుందని చెప్పారు,ఇది కూడా చాలా గా ఇబ్బంది గా ఉంటుంది అని భావించాం, ఇలా ఎంత వెతికినా నా అర్హత కు సరిపోయే ఉద్యోగం ఏమి కనపడడం లేదు,ఇప్పటికే వారం గడిచింది తెచ్చుకున్న ఎమౌంట్ కాస్తా ఐపోయిందని తిరుగు ప్రయాణం చేయాలనుకున్నాం”

అరుణ వర్ణాల సూరీడు అలసి పోయి అమ్మ ఒడిలో విశ్రాంతి కోరుకునే సమయం,ఆకాశంలో అరవిరిసిన అందం తో చందమామ వెన్నెల పంచగా ముస్తాబవుతున్న శుభవేళ అది, సమయం సరిగ్గా సాయంత్రం పగలు కి రేయికి వారది వేసే సాయం సంధ్యా సమయం, నాంపల్లి రైల్వే స్టేషన్ లో గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్ ఫాం మీదికి రాబోతుందని అనౌన్స్ మెంట్ విని అంతులేని వేగంతో వచ్చి ఎక్కి హడావిడిగా కూర్చుని విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాము నేను మా మిత్రుడు రాజు,అంతలో కాలం కరుణించిందో ఏమో నయనానందాలను కలిగించే అందంతో ఓ నవమల్లిక వచ్చి నా పక్కనే కూర్చుంది, అంతవరకు విశ్రాంతి కోరుకునే నా శరీరం ఒక్కసారి గా విశ్రాంతి కే విరామమిచ్చి తన వైపు దృష్టి మరల్చిందీ ఏమి అందమా అది స్వర్గ లోకాలను వదిలి ఇలకు జారిన ఇంద్రానియో ఏమో,ఇంద్రసభలో నర్తించే మేనకయో మరెవరో చూడగానే కళ్ళు చెమర్చే అందం తో నయనాలలో నర్తించే రూపంతో ఉన్నా ఆ మృగనేత్రి ఒకసారి గా నా మనసు దోచుకుంది,

ఇన్నాళ్ళు గా ఎప్పుడు పరిచయం లేని ఓ అలజడి మనసంతా కలవరం కలిగిస్తున్న ఆ అనుభూతి కి తట్టుకోలేక మాట కలపాలని మనసు తహతహలాడుతుంటే మీ పేరేంటి మేడం “నా పేరు దివ్య ఐనా మీరేంటి మేడం అని సంబోధిస్తున్నారు మరేం ఫర్లేదు నువ్వు అని పిలవండి సరిపోతుంది నేను కూడా మిమ్మల్ని నువ్వు అనే పిలుస్తాను మీకు అభ్యంతరం లేకపోతే,మీ పేరు కూడా అడగను”అని బదులిచ్చింది ఎంత చనువు ఎంత అణుకువ, అంత అందం, ఆత్మాభిమానం, ఛలాకితనం,కలిసిపోయే తత్వం కలగలిసి నిజంగా తనూ పేరుకు తగినట్లుగా దివ్యంగా నే ఉంది అని మనసులో అనుకున్నా,మీరు అడగక పోయినా నా పేరు చెప్పడం సంస్కారం కదా అనీ నా పేరు భాను ప్రకాశ్ అని చెప్పాను మాటలతో మా పరిచయం పెరిగి పెద్దవుతుంది, ట్రైన్ వేగంగా పరుగెత్తుతుంది మా ఆలోచనలు కూడా అంతకు మించిన వేగంతో పయనిస్తున్నాయి, నిజంగా తనను చూడగానే తొలి ప్రేమంటే ఏంటో తెలియని నాలో తొలకరి జల్లు కురిసినట్లు ఐంది,మరులు గొలిపే ఆ అందం నేను కవనం లిఖించడానికి కారణమైందిరా రాజు,ఈ క్షణం ఇలా శాశ్వతం ఐతే బావుండు అనిపిస్తుంది అని ఆలోచన మా మిత్రుడు తో పంచుకొన్నాను,ఏంట్రా అమ్మాయిలు అంటే ఆమడ దూరంలో ఉండే నువేంట్రా ఇలా కవితలు అల్లుతూ కలవరపడుతున్నావు,ఏమోరా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది తను ఎవరు నాకెందుకు ఇలా పరిచయం ఐంది,ఏదో సినిమాలో లాగా తొలి చూపులోనే ప్రేమలో పడిపోయా’నా అని మైమరిచిపోయాను,

ఇంతలో దివ్య…

“భాను గారూ మీరేం చేస్తుంటారు”అనే ప్రశ్నతో ఈ ప్రపంచంలోకి వచ్చాను,నాది ఎం ఏ లిటరేచర్ పూర్తి చేశాను జాబ్ సెర్చ్ లో ఉన్నాను,మా నేటివ్ వచ్చేసి వైజాగ్ దగ్గర లో మద్దులపాలెం అనే ఓ చిన్న ఊరు, అనగానే దివ్య”ఓహ్ ఔనా మాది అనకాపల్లి లోకల్,ఏంటి మన స్థానికత ఒకటే ఐంది,నేను మీరు తెలంగాణ వాళ్ళేమో అనుకున్నాను,” అని దివ్య చెప్పగానే ఏదో ఆలోచిస్తూ స్నాక్స్ కోసం నా స్థలం నుంచి కాస్తా జరుగుతున్న,భానూ ఈ పాప్ కార్న్ తీసుకోండి కాస్తా కాలయాపన ఉంటుంది,ఫర్లేదు నాకు వద్దండీ,హే ఎందుకు మీరు ఏమైనా ఇవ్వాల్సి వస్తుందని వద్దంటున్నారా… అనే ఆ మాటకి ఏంటి ఈమే ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంది అనుకున్నా కాని ఆ చనువు కి ముచ్చటేసింది,సరే లే అని తనకు కంపనీ ఇవ్వడం కోసం తీసుకుని కాస్తా సాయంత్రం కావడంతో మలయ పవనాస్వాదితుడనై రైలు డోర్ దగ్గర కూర్చున్న కాని మనసంతా భానుడి చుట్టూ వసుధ తిరిగినట్లు తన చుట్టూనే తిరుగుతుంది, నిశ్చలమైన నా మనస్సులో చంచలాన్ని కలిగించిన ఆ ఛలాకీ చంద్రముఖి ని చూడాలని ఆపిల్ తీసుకుని వచ్చేశాను,మేము అటు వెళ్ళగానే ఎవరొ ఓ పోకిరి వాళ్ళ బ్యాచ్ వచ్చి కాస్తా దూరం లో కూర్చుని తనను గురించి మనస్సులో ఏదో రన్నింగ్ కామెంటరీ వేస్తున్నారు,అవి గమనించిన నాకు చాలా కోపం వచ్చేసింది వారించాలకున్న కానీ తను ఏమనుకుందోనని ఆగిపోయాను కాని వాని వికృత చేష్టలు గమనించిన రాజు,భాను తను ఆ అమ్మాయి ని అనవసరంగా టచ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు చూడమని చెప్పడంతో ఒక్కసారి గా కోపం వచ్చేసి,దివ్యా ఏంటిది వాడు అంతలా అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నాకు చెప్పడం లేదేంటి అని చాలా కోపంతో అనేశాను, తర్వాత ఏదో ఎమోషనల్ గా ఇలా అన్నానేంట్రా అని ఆలోచిస్తూ తన ప్రక్కనే కూర్చున్నాను,నేను తీసుకు వచ్చిన ఆపిల్ తనకిచ్చాను,తను ల్యాప్ టాప్ లో ఏదో సెర్చ్ చేస్తూనే ఒక్కసారి షాక్ పడినట్లు గా “ప్రకాశ్ ఏంటి నా మీద ఇంత కేరింగ్ తీసుకుంటున్నారు నిజంగానే అన్నారా లేకా…. నిజమైతే బావుండేది,నీవు పేరుకు తగినట్లుగా ప్రకాశవంతంగా నే కనిపిస్తున్నారు,ఇంత జాగ్రత్త గా చూసుకునే బాడి గార్డ్ లాంటి నీకు ప్రేమ పంచే ఆ ప్రేయసి ఎంత అదృష్టవంతురాలో కదా, కొద్ది గంటల క్రితం పరిచయం అని నా మీదనే ఇంత కేర్ తీ‌సుకుంటున్నారంటే మీతో ఏడడుగులు నడిచే నీ రాణిని ఎలా చూసుకుంటారో కదా అని” ఆ అదృష్టవంతురాలు మీరే ఎందుకు కాకూడదు అని ఒక్కసారి మనసులో అనిపించింది,కాని నాకు ముందు భవిష్యత్తు,తర్వాతే ఇవన్నీ అని కాసేపు అనుకుని నిద్రలో కి జారుకునే ప్రయత్నం చేస్తున్నా,కాని కళ్ళు మూస్తే తన అందమే నందనవనమై కనులముందు కదలాడుతూ ఉంటే ఆ ఆలోచనావళులు నన్ను తన ప్రణయ ప్రవాహం లో ముంచెత్తుతూ ఉంటే నిద్ర కూడా రాకుండా ఉంది, ఎలాగోలా కనులు మూసుకుని ఉండగానే”ఏంటీ భానూ నన్ను ఒంటరి దాన్ని చేసి పడుకుంటున్నారేంటి,ఇంత లాంగ్ జర్నీలో నేనొక్కదానినే ఎలా వెళ్ళాలి,””అయ్యో నేనేం నిదుర పోవడం లేదు దివ్య జస్ట్ రిలాక్స్ కోసం కనులు మూసుకున్నా అంతే,ఐనా మీ ఫ్రెండ్ తోడుగా ఉంది కదా ఇంకా నా తోడు ఎందుకు”” అలా ఎలా ఉంటుంది భానూ,తను కూడా నా లాంటి ఆడపిల్ల నే కదా,”ఓహో అలాగా మరి ఇందులో నేను లేకపోతే ఏం చేసేవాళ్ళు” “అంటే అప్పుడు తప్పదు కాబట్టి మేమే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు నను బాధ్యత గా చూసుకునే నీ తోడు దొరికింది కాబట్టి నీ ఒళ్ళో తలవాల్చి హాయిగా సేద తీరాలని ఉంది,కాని మీకు నచ్చకపోతే ఏం చేయాలి కనీసం మీరున్నారనే ధైర్యం తో అయినా ప్రయాణం చేస్తానంటే మీరేమో కనులు మూస్తున్నారు” “అదేం లేదు లే కాని,చెప్పండి ఏదైనా విషయాలు ఉంటే టైంపాస్ ఔతుంది కదా””మాదేముంది భానూ ఏదో బాల్యం అలా గడిచిపోయింది, పద్దతి గల కుటుంబం,అంతే పద్ధతి గా పెంచిన అమ్మ నాన్నలు,మాది ఓ పెద్ద బృందావనం లాంటి ఇల్లు””ఔనా అందులో గోపిక లాంటి నీవా””హ్మ్…ఔను నేను గోపికనే శ్రీకృష్ణుడు లా నువు వస్తొవా మరి””అమ్మో నేను శ్రీకృష్ణుడు కాదులే శ్రీరామచంద్రుడనే అని అంటూనే ఈ అమ్మాయి ఏంటి ఇలా అంటుంది అనుకుంటుండగానే మళ్ళీ తాను””హే భానూ నేను సరదాగా అన్నాను ఫీల్ వచ్చిందా, ఫ్రెండ్స్ కదా కాస్తా ఫన్ ఉండాలి కదా””ఓకే కంటిన్యూ నో ప్రొబ్లం ఐయామాల్సో ఎంజాయ్””థాంక్స్ ఇంతవరకూ నా గురించి మాత్రమే చెప్పాను మీరేం చెప్పరా….””మాది కూడా పెద్ద కుటుంబమే కాని బృందావనం కాదు మామూలు భవనమే మేం నలుగురం మాత్రమే ఉండేది,బాల్యం చాలా అందమైనది కదా చాలా సంతోషంగా గడిచింది, డిగ్రీ వరకు ఊర్లో చదువుకుని హయ్యర్ ఎడ్యుకేషన్ కి సిటి కీ వచ్చేశాం అంతే””అంతేనా బాల్యం మాత్రం చెప్పారు కళాశాల కబుర్లు కలలు కన్న తీరాలు,కన్నెల మనసుల గాలాలు””అమ్మో అమ్మో ఏంటిది అలాంటివి ఏం లేవు నాకు”””భానూ మీరెలాంటి సినిమాలు చూస్తారు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు,””ఏముంటుంది దివ్య ఖాళీ సమయం దాదాపుగా దొరకదు నేను చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగునే, ఎంజాయ్ చేయాలనే ఆలోచన ఏం రాలేదు, అప్పుడప్పుడు సినిమాలు చూస్తుండేది, అందులో మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం””మీకు ప్రేమంటే ఇష్టమా…””అదేం ప్రశ్న దివ్య ప్రపంచంలో ఎవరు ప్రేమకు అతీతులు కారు కదా నేను కూడా అంతే””మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా,హే లేదు”మరేం ఫర్లేదు చెప్పండి ఇది సహజమే కదా అని బలవంతం చేస్తూనే ఉంది” “నిజమే దివ్యా..చదువు,ఫస్ట్ ర్యాంక్ అనే ప్రయత్నం లో ఖాళీ సమయం దొరకలేదు, ఇంతవరకు ఆ అనుభవం ఎదురు కాలేదు””అంటే వేకన్సీ ఉందన్నట్లేనా మేం ట్రై చేసుకోవచ్చు నా””హ్మ్ ఏంటి దివ్యా అంత ఓపెన్ గా అడిగేస్తున్నావు””ఏముంది భానూ ఫ్రెండ్ అనే చనువుతో అడిగాను అంతే,సరెలే కాని మాకు మిమ్మల్ని ఫీల్ అయ్యే అవకాశం అదృష్టం కూడా లేదా,హే మేం నచ్చలేదా,మీ స్థాయికి సరిపోలేదా,” “అయ్యయ్యో నేనలా అనలేదు దివ్య””అంటే యాక్సెప్ట్ చే‌సినట్లేనా” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఏం చెప్పాలో తోచలేదు మౌనంగానే ఉన్నా,మౌనం అర్థంగీకారం అనుకోవాలా అని మళ్ళీ అదో ప్రశ్న,ఏంటి ఈమె ఇంతలా బ్రతిమాలుతుంది,ఇదంతా నిజమేనా అని ఒక్కసారి ఆశ్చర్యం కలిగింది కాని తను చూసే వాలు కనుల చూపు,తన మాటతీరు చలాకీతనం, ఇవన్నీ గమనిస్తూ ఉంటే నిజమేనేమో,నిజమే ఐతే బావుండు అనిపిస్తుంది, ఒక్కసారి గా నా కెరీర్ లైఫ్ గుర్తుకు రావడంతో టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం లో దివ్యా నీ ముందున్న లక్ష్యం ఏంటి, భవిష్యత్తు గురించి నీ ఆలోచనలు ఏంటి అని అడిగేశాను,””ముందు మీకు ఎలాంటి అమ్మాయి ఐతే నచ్చుతుందో చెప్పండి,””ముందు ఆడవాళ్ళు ఫస్ట్ అంటారు కదా మీరే చెప్పండి తర్వాత నేను చెప్పాలా వద్దా ఆలోచిస్తా,”ఏముంది భానూ నను మా అమ్మ నాన్నల తర్వాత అంతా ప్రేమ పంచుతూ చూసుకోవాలి,ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి,ఒక మంచి మిత్రుడు లా లైక్ నీలాగా నను చూసుకోవాలి,సదా నీవే నా ప్రఫంచం దివ్యా అనేలా ఉండాలి,””బాగానే ఆశలు ఉన్నాయి కానీ నువే ప్రపంచమని నీ వెంట వస్తే వాళ్ళమ్మనాన్నల మాటేమిటి దివ్యా ఇది స్వార్థం కాదా,నీలాగా నను చూసుకోవాలి అంటున్నావు నేనేం చూసుకున్నాను మిమ్మల్ని”నేనే ప్రపంచం అనాలి అన్నాను కాని నా వెంటే రమ్మనలేదు అందరం కలిసే ఉంటాం, ఆడపిల్ల పాతికేళ్ళు అమ్మ నాన్నల తో ఉంటే మరో ముప్పాతికేళ్ళు అత్తారింటిలో నే కదా ఉండేది, అత్తా మామలు మరో అమ్మా నాన్నలాగా చూసుకోవాలి,నేను మాత్రం అలాగే చూసుకుంటాను,ఇక మీరంటారా కొద్దిపాటి పరిచయానికే నా పైన కేరింగ్ తీసుకుంటున్నారు ఇంతలా ఎవరు ఉండగలరు అందుకే నా అభిప్రాయం చెప్పినా, ఇబ్బంది కలిగిందా ఐనా మంచిదే నాకోసం పడు అనేసింది,”ఇబ్బంది ఏం లేదు లే కాని ఇంకా ఏంటి విషయాలు” “ఏముంది బి టెక్ ఐపోయింది, ఎలాగు ఏదో జాబ్ వస్తుంది, కొద్ది రోజులు జాబ్ చేసి అమ్మ నాన్నల ఋణం తీర్చుకుని పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవడమే” “అమ్మ నాన్నల ఋణం ఏంటి దివ్యా అది వాళ్ళ బాధ్యత నే కదా””జన్మనిచ్చి కొత్త లోకానికి నన్ను పరిచయం చేసి నాకోసం ఎన్నో త్యాగాలు చేసి ఉన్నత విద్యలు నేర్పించి నా స్వంత కాళ్ళ మీద నేను నిలపడేలా చేసిన అమ్మ నాన్నల ఋణం ఎంత ఇచ్చినా తక్కువే కదా”ఈ మాటలకు చాలా ఆనందం కలిగింది ఫిలాసఫీ ఏంటో నాకు తెలియదు కాని తనను అభినందించకుండా ఉండలేకపోయాను, నిజంగా అత్తామామలు అమ్మ నాన్నల లాగా చూసుకునేంత ఔన్నత్యం ఈ కాలం అమ్మాయిలకు ఉంటుందా అని ఆశ్చర్యపోయాను,

“ఇంతలా నాకోసం ఆరాటపడుతున్న అమ్మాయి ని దూరం చేసుకోవాలా అని ఒక క్షణం ఆలోచనలో పడ్డాను,ఆ విషయం గమనించిన రాజు,””ఏంట్రా భాణు కొత్తగా కనిపిస్తున్నావు ఏంటి విషయం””ఏం లేదు రా””మహా బాగా చెప్పొచ్చావులే కాని అబద్ధాలు చెప్పడం నీకు రాదురా, చిన్నప్పటి నుంచి గమనిస్తున్న నీ మనసేంటో నీ ఆలోచన విధానం ఏంటో నాకు తెలియదరా,ఒకే నాతో కాకపోయినా మంచిదే కాని నాలో చిన్న సలహా,మనం ప్రేమించిన వారికంటే మనల్ని మనసారా ప్రేమించిన వారితో జీవితం పంచుకోవడం చాలా బావుంటుంది,నువు తనతో సంతోషంగా ఉంటే ప్రపంచంలో నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు లేరురా,నచ్చితే నా సలహా ఫాలో చేయండి, ఏదైనా సహాయం కావాలంటే బాధ్యత గా నేను చేస్తా,””రాజు ఇలా అనడంతో నిజమేనేమో అనిపిస్తుంది,తను ఏం చేస్తుందా అని అటువైపు చూపు మరల్చాను అమ్మో ఏంటిది షేక్ స్పియర్ కథలు చదువుతుంటే ఏంటి అవి చదువుతున్నావు దివ్యా అని అడిగేశాను””భాణూ మీరు చదువరా మంచి రోమాంటిక్ స్టోరి లు కదా ప్రయాణం లో కాలయాపన గా ఉంటుంది అని తెచ్చాను కాని ఇంతవరకు వీటి అవసరం రాలేదు, ఎందుకంటే అవి చదువుతుంటే వచ్చిన ఫీల్ మీరు చూపిన కేర్ తోనే అనుభవం లోకి వచ్చింది,మీరు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు కదా అని మళ్ళీ తీశాను ఫీల్ గుడ్ స్టోరీ స్ కదా సో అలా”

“నాకు కూడా ఇష్టమే అని ఏంటి మా అభిరుచులు ఇలా కలిసిపోతున్నాయి అని ఒక్కసారి గా ఆలోచన అటువైపు పోనిచ్చాను,ఏమా అందం నీలి రంగు పరికిణి కట్టుకున్న నింగినిడిసిన చందమామ నేలపై నెరజాణలా నడిచివచ్చి నను తన అందం తో ముగ్ధుడను చేసింది,కలువ రేకులను కన్నులు గా ఒదిగి, ఇంద్రధనుస్సునే కనుబొమ్మలు గా చేసుకొని,పసిడి ఛాయతో మెరిసిపోతున్న తన అందం నాకు మతిపోగొట్టేసింది,తను నను కావాలని ఇంతలా ఆరాటపడుతున్న కాదనడం ఎందుకో అర్థం కాలేదు,కాని ఎక్కడో చిన్న న్యూనతా భావం ఇంత ఉన్నత చదువులు చదువుకోని బాధ్యతా యుతమైన ఉద్యోగానికి అర్హతలు సాధించి ఇలా చేయడం ఏంటి అనిపిస్తుంది మనసిచ్చిన మధుమతిని కాదనలేక అమ్మ నాన్నల గురించి ఆలోచించలేక సతమతం అవుతున్న,””ఏంటి భాణూ ఏమి ఆలోచిస్తున్నారు,నేను ఏ విషయంలో ఐనా చాలా ఓపెన్ గా ఉంటాను ఇంతవరకు నాకు మీ లాంటి ఓ మిత్రుడు పరిచయం కాలేదు, చాలామంది అంటుంటారు ప్రేమకి టర్నింగ్ పాయింట్ ఫ్రెండ్షిప్ దాని పై మీ అభిప్రాయం ఏంటి,భాణూ గారు మీకు నచ్చినట్లు గా ఉండేందుకు ఏమైనా త్యాగం చేస్తాను,నేను నా మనస్సాక్షి గా ఫిక్స్ అయ్యాను ఏది ఏమైనా మీతో జీవితం పంచుకోవాలని అనుకుంటాను,మీరు కాదంటే నేను ఏం చేయలేను కాని ఓ మంచి స్నేహితుడను కోల్పోయిన నేను ఎలా ఉంటానో మీరే ఊహించుకోండి,ఇదంతా ఎందుకు చెపుతున్నా అంటే మరో గంటలో మనం గమ్యాలు చేరువవుతాయి, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో తెలియదు,ఏది ఏమైనా మీకు బాధ కలిగించే పని నేనెప్పుడూ చేయను,మనం ప్రేమించిన వాళ్ళు బాగుండాలనే తత్వం నాది,””తన యొక్క ఆరాటాన్ని చూస్తుంటే నాకు కూడా తన వైపు మనసు పోతుంది,కాని చేసేది ఏం లేదు దేనికైనా కాలమే సమాధానం చెపుతుంది,మాకు ఇద్దరికీ రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది కాబోలు,””ఖచ్చితంగా జరుగుతుంది భాణూ అని ఒక్కసారి గా నా మైండ్ వాయిస్ రీడ్ చేసింది,నేను ఇలాంటివి చాలా నమ్ముతాను మీరు పరిచయం ఐనా కొద్దిసేపటికే నా పై చూపిన కేరింగ్ నా నమ్మకానికి ప్రాణం పోసింది, నమ్మకం ఎప్పుడూ వమ్ము కాదు,ఐతే మన ఈ పరిచయానికి అర్థమే లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది,” “దివ్యా అన్ని ట్రాష్ నేనేదో అలా అనేశాను,కాని ఇది సినిమా కాదు జీవితం అని అంటుంటే””అంతే నా భాణూ అని తను బేలగా అడుగుతుంటే తన నీరజాక్షులలో నీరు తిరిగింది,ఆ నీరు చెంపల పై ముత్యపు బింధువులుగా దొర్లుతూ పోతుంటే ఓదార్పు ప్రయత్నం గా నా చేతితో అద్దేశాను,,ఏమా స్పర్శ తొలిసారి ఆ స్త్రీ స్పర్శ నను ఉక్కిరిబిక్కిరి చేసింది,ఏదో బంధం ఉన్న అనుబంధం ఆ స్పరశను తలుచుకుంటూ అలా ఉండిపోయాను,తను మాత్రం బుంగమూతి పెడుతూ మౌనరాగాలను ఆలపిస్తుంది”

“ఏరా భానూ నీ ఆలోచనల ఫలితం ఏమి రావాలని ఆలోచిస్తున్నావు” “ఏం లేదు దివ్య ఆటిట్యూడ్ చాలా నచ్చింది రా నాకు,నిజంగా ఇన్నాళ్ళు గా ముముక్షువుగా ఉన్న నాకు కొత్త ఉత్సాహం వచ్చేసింది ఎందుకనో నేను తన వైపు వెళుతానేమోనని పిస్తుంది కాని””కాని ఏంట్రా భవిష్యత్తు గురించి ఆలోచన””నీ భవిష్యత్తుకు ఏం లోటు రా ఎక్స్లెన్స్ఆంగ్ల పరిజ్ఞానం ఉంది మంచి ఉద్యోగం దొరుకుతుంది, కాని ఇలా నీవంటే పొడి చచ్చే అమ్మాయి దొరకడం కుదరదు,ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి మరో వ్యక్తి కలలో కూడా కనిపించరు రా కళ్ళ ముందు ఉన్న ఈమెను దూరం చేసుకొవద్దు” అని చెప్పేశాడు నేను తీక్షణమైన ఆలోచనలలో మునిగి పోయాను,అది వైజాగ్ జంక్షన్ “”భాణూ ఆ ట్రైన్ ఎంత ఖాళీగా ఉంది చూడు అలాంటి దాంట్లో మీ లాంటి వారితో లాంగ్ జర్ని చేస్తే ఎంతో బావుంటుందో””అంటే మళ్ళీ హైదరాబాద్ వెళదామా ఏంటీ దివ్యా,””మీరు తోడుగా వస్తానంటే హైదరాబాద్ కి ఏంటి నరకానికైనా నడిచి వస్తా,””ఎందుకో””పిచ్చి మొద్దు ఏమి అర్థం కాదేంట్రా బాబు,నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా,” “ప్రేమేంటి మనం పరిచయం కలిగి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే ప్రేమేంటి ఎవరి గురించి ఎవరికీ ఏమి తెలియదు కదా,””భాణూ ప్రేమ ముహూర్తం చూసుకొని పుట్టదు,ఏలాంటి ఫీలింగ్స్ మీకు లేకుంటే నా పైన అంత కేరింగ్ తీసుకున్నారు,””ఏదో మానవత్వం తో చేశాను,””ఆ మానవత్వమే ప్రేమగా పురుడు పోసుకుంది,నీలో పురుషత్వం పురివిప్పి రసికత్వం వికసించలేదా,ఏమి అర్థం కాదా””అమ్మో ఏంటి ఈ కథ ఎక్కడికో పోతుంది అనుకుంటున్నాను,కాని అంతలోనే ఇంకో కొద్ది సేపట్లో మేము దిగబోతున్నాం తనను మిస్ చేసుకోవాలా,నం అడిగితే ఏమనుకుంటుందో,అని అనుకుంటున్నా తను కూడా నా లాంటి ఆలోచనతో ఉన్నట్లు గా మొబైల్ చేతిలో పట్టుకొని సిగ్నల్ ఇస్తా ఉండే కాని ఓపెన్ కాలేదు నేను కూడా అలాగే ఉండిపోయాను,”

“నిజంగా ప్రేమించబడితే ఇంత ఆనందంగా ఉంటుందా అని కొత్తగా అనిపించింది,ఇంతలో అనకాపల్లి జంక్షన్ వచ్ఛేస్తున్నట్లు సిగ్నల్ రాగానే దివ్య వాళ్ళ అన్నయ్య కు ఫోన్ చేసింది వాళ్ళ అన్నయ్య తో వెళతా ఉంటే బేలగా నా వైపుకి చూస్తుంటే ఆ ఫీలింగ్ తల్లి కూతురు ని దూరం చేసిన భావన కలిగింది,కాని నం తీసుకొనే ప్రయత్నం చేయలేదు, అనకాపల్లి జింక్షన్ లో దిగిపోయింది,అంతవరకు ఏ బాధా లేకుండే కాని దూరమైతే కానీ మనిషి విలువ తెలియదన్నట్లు మొదటిసారి అనిపించింది,అలా దూరం చేసుకున్న నా మనసు దోచిన మధుమతి ఎక్కడ ఉందో ఒకటే వెతుకులాటా”

“రా అమ్మా దివ్యా… ప్రయాణం బాగా జరిగిందా,అంతా కుషలమేనా,ఏంటే ఇంత చిక్కిపోయావు, డ్యూటీ పేరుతో వేళకి తింటున్నావా లేదా….ముందు ఆరోగ్యం తర్వాత నే పని, డబ్బు ను సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేం కదే,””ఏంటమ్మా నువు వచ్చి రాగానే ఏదోటి అంటుంటావు అసలు రావాలా వద్దా అని ముభావంగా అనేశా ఏం చేయాలి,మనసెరిగిన నేస్తం ఎడబాటు తట్టుకోలేక తనువు అణువణువునా తల్లడిల్లుతున్న తరుణమిది, ఎలాగైనా తన నం తీసుకుంటే బావుండేది అని చాలా బాధేసింది తనతో జరిగిన పరిచయం కాలక్షేపం గుర్తుకు వస్తుంటే మళ్ళీ ఎన్నాళ్ళకు తనను కలుస్తొనో లేదో అసలు ఈ జన్మకి తను కనపడతాడో లేడోనని ఆందోళన గా ఉండడంతో కళ్ళలో ఒకసారి సునామీ తిరిగింది” “ఏమైందమ్మా ఎందుకు బాధ పడుతున్నావు””లేదమ్మా..
చాలా రోజుల తర్వాత మళ్లీ మిమ్మల్ని కలిశాను కదా చిన్న భావోద్వేగం అని చెప్పి నా గదిలోకి వఛ్చేశాను, మనసంతా బాధ గా ఉంది ఏం తినాలి అనిపించడం లేదు, అలాగే పడుకున్నా,”

“భానూ…””చెప్పురా రాజా”” ఆ అమ్మాయి ని మిస్ చేసుకున్న బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందేంట్రా””హే అదేం లేదు,””నేను నీ మనసును చదివిన నేస్తాన్నిరా దాచిపెట్టిన నిజం, పాతిపెట్టిన బీజం ఎప్పుడూ దాగవురా, ప్రకృతి చాలా గొప్పదిరా,కాలానికి ఉన్న శక్తి దేనికి లేదురా,నేను మీ ప్రేమకి వారధి వేస్తా, మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తా నువు నాతో నిజం చెప్పురా,””ఔనేమో అనిపిస్తుంది రా ఇన్ని రోజులు ఎరగని కొత్త అనుభూతిని చవి చూశానురా, నిజంగా దాని పేరు ప్రేమే ఐతే నేను కూడా పడిపోయానురా కాని తర్వాత ఏం చేయాలి తెలియడం లేదు”””ఏం కాదు రా నేనున్నాను కదా నీ ప్రేమను గెలిపించి నిన్ను ఓ ఇంటి వాడిని చేస్తా,నిను గెలిపించకపోతే నేనుండి ఎందుకు రా””రాజా అలా అంటుంటే ఎంతో ఆనందంగా ఉండే తాను మళ్లీ నాకు కలుస్తుందో లేదోననే ఆందోళన లో ఈ ప్రయాణం భారంగా జరిగింది, ఎప్పటికైనా తాను నా స్వంతం ఔతుందనే ఆనందం ఒకవైపు, ఎన్నాళ్ళకు ఫలిస్తుందో అనే బాధ మరోవైపు ఇలా ప్రయాణం పూర్తి చేసి మా ఊరికి చేరుకున్నాం,”భాణు ఓ రెండ్రోజులు తర్వాత మన సెర్చింగ్ మొదలు పెడదాం ఆ లోపు రిలాక్స్ గా ఉండు”అని. రాజా హామి ఇవ్వడంతో ఆనందం కలిగింది”

“ప్రకాశ్ ఓ గొప్ప పారిశ్రామిక వేత్త,ఒక కుమారుడు ఒక కూతురు, చెప్పకూడదు కాని కలికి చిలకల కొలికి,అన్నులమిన్న అందాల భరిణ,ముద్దుల గుమ్మ, మురిపాల కొమ్మ,అల్లారు ముద్దుగా పెరిగిన దివ్య అంటే ఇంట్లో అందరికి ఎనలేని ప్రేమ,ఉన్నత చదువులు పూర్తి చేసుకొని హైదరాబాద్ లో కొంత కాలం ఉద్యోగం చేసి ఈ మధ్యనే ఇంటికి వచ్చింది, ప్రకాశం కూడా అమ్మాయికి పెళ్ళి చేసి అత్తారింటికి పంపిస్తే బాధ్యత తీరిపోతుంది అనే భావనతో ఆ ప్రయత్నం మొదలుపెట్టే పనిలో మునిగిపోయాడు,ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే మాటలా మంచి వరుడు దొరకాలి ఇంతకన్నా ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా పంపించాలి, అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్ల చుట్టంలా వస్తె బావుంటుంది కదా ఎప్పుడు ఆ కల నెరవేరుతుంది అనే ఆలోచన లో ఉన్నాడు,”

“హలో భాణూ మనం అనుకున్న సమయం ఆసన్నమైంది రా ఒకసారి మీ కలల రాణి ని వెతికే ప్రయత్నం చేద్దామా రేపు అనకాపల్లి దాకా వెళదాం అనుకుంటున్నా ఏమంటావురా””నిజమే కాని తను తప్ప తనేవాళ్ళు ఎవరు తెలియదు అంత పెద్ధ పట్నంలో ఎలా వెతకాలిరా తనను,”ఆ బాధేమి అక్కర్లేదు నా వెంట రా నేను మొత్తం వెతుకుతా అని చెప్పారు,మీరు నాడు ఉదయమే అనకాపల్లి వెళ్ళాం,కళ్ళలో నిండిన ప్రతిబింబం కనపడేదెలాగా అని పార్క్ లు, సినిమా హాల్లో ఆడవాళ్ళు కు ఆలయాలు అంటే ఇష్టం అని అన్ని తిరిగేశాం కాని ఎక్కడ తన ఆచూకీ తెలియడం లేదు, ఆందోళన వ్యక్తం చేస్తోంది మనసు”‘నీ మనసు దోచిన మధుమతిని తీసుకువచ్చే బాధ్యత నాది ఇవాళ ఒకరోజు తోనే ఐపోలేదు ఇంకా చాలా సమయం ఉందని రాజా ఓదార్చారు ఆ రోజు కి ఈ ప్రయత్నం విఫలం కావడంతో వెను దిరిగాం,”

“నమస్కారమయ్యా ప్రకాశం గారు,”రండి రండి రుద్రాక్ష భార్గావాచార్యులు గారు బాగున్నారా….”ఏదో మీ దయ వలనా బాగానే ఉన్నాము,”ఏంటో పని మీద వెళ్ళినట్లుంది,”పని మీద కాదండి బండి మీద వచ్చాను గమనించండి,”ఓహో మీ పాండిత్య చమత్కార వాక్యాలకు మేము తట్టుకోలేము గానీ విశేషం ఏంటి చెప్పండి”ఏం లేదు మీ అమ్మాయి దివ్య బావుందా ప్రస్తుతం ఏం చేస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను పెళ్ళీడుకి వచ్చి నట్లేగా ఏమైనా పప్పు భోజనం పెట్టిస్తాలేమోనని తెలుసుకుందాం అని వచ్చాను,ఈ అబ్బాయి పేరు భరత్,మంచి ఉన్నతమైన కుటుంబం ఉత్తమ ప్రవర్తన గలిగిన వాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు మీకు నచ్చితే ప్రయత్నం చేద్దాం ఓ సారి మీ శ్రీమతి గారితో సంప్రదించి చూడండి వస్తానండి,”అలాగే పంతులుగారు,మంచిది, పంతులుగారు చెప్పిన ఆలోచన బాగానే ఉంది కాని అమ్మాయి మనసులో ఏముందో ఒకసారి తెలుసుకుని అన్ని సవ్యంగా ఉంటే చేసేస్తే బాధ్యత తీరిపోతుంది కదా”

“అమ్మా భాణూ లేరా…”అని అడుగగానే సూర్య కాంతం బయటకు వచ్చింది,రా రాజు ఇంట్లో నే ఉన్నాడు ఇందాకే టిఫిన్ చేసి ఏదో ప్రాజెక్ట్ పని ఉందని తన గదిలోకి వెళ్ళారు, పిలుస్తాను ఉండండి”ఫర్లేదు నేనే లోపలికి వెళతా ఏం ప్రొజెక్టు డిస్టర్బ్ చేయడం ఎందుకు,ఏరా భాణూ బిజీ గా ఉన్నారా,నీ అదృష్టం పరిక్షీంచడానికి మళ్ళీ ఒకసారి అనకాపల్లి వెళదామా, ఖాళీగా ఉన్నాను””సరే పదా అని ఇద్దరం బైక్ వెళ్ళామూ ఈ రోజైనా నా కలల రారాణి కనిపిస్తే బావుండు,తన నువ్వు తో నా నరనరాల్లో నాట్యమాడిన నవయవ్వన నయన తార ఎక్కడ ఉందోనని స్వాతి చినుకు కై వేచిన చకోర చూపులు,మావి చివురులకై మధుమాస కోయిలలా ఎదురు చూస్తూ ఓ సిని కవి అన్నట్లు *గాలినడిగా మబ్బుల నడిగా రామచిలుక రెక్కలనడిగా* అని ప్రయాణం చేస్తూ ఆ జాలి జాబిలమ్మ నాకు కనిపించనే లేదు,గ్రహణం పట్టిన చంద్రునిలా అలసిపోయి కళావిహీనంగా ఇంటికి వచ్చాను,మనసంతా నిండిన చెలి దోబూచులాడుతుందోనని చాలా బాధేసింది,నా ప్రేమ నిజంగా ఫలిస్తుందో లేదోననే భయం వెంటాడుతూ ఉంటే, మౌనం నా పెదాలపై రాజ్యమేలుతోంది”

“అర్చనా…..అనే ప్రకాశ్ పిలుపుతో బయటకు వచ్చింది, దివ్య వాళ్ళమ్మ””చెప్పండి..” “ఇందాకే భార్గవాచార్యులుగారు వచ్చారు ఏదో పెళ్ళి సంబంధం గురించి మాట్లాడారు అబ్బాయి ఫోటో కూడా ఇచ్చారు,మంచి కుటుంబం,ఉన్నత స్థాయి ఉద్యోగం, ఉత్తమమైన వ్యక్తిత్వం కాదనడానికి నాకు ఏం కారణాలు కనిపించలేదు అమ్మాయి అభిప్రాయం కనుకో హైదరాబాద్ లో నుండి వచ్చింది కదా,ఈ కాలం అమ్మాయిలకు ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం ఎక్కువ తనకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారేమో తెలుసుకో చూద్దాం””ఏమండీ మన అమ్మాయి కి ప్రత్యేకంగా ఏమి ఉంటుంది,మనకు తెలుసు కదా మన అమ్మాయి కి ఏం కావాలో””అది కాదు అర్చనా ఈ రోజుల్లో ప్రేమనేది సాధారణ విషయం ఐపోయింది,,”
“ఐతే మాత్రం ప్రమనేది మన ఇంట్లో వంట్లో లేదు మనమెలా ఒప్పకుంటాము””తప్పు అర్చనా అలా అనకూడదు ఒక్కగానొక్క కూతురు తనకు అన్ని విధాలుగా ఆనందాన్ని కలిగించే పని చేయాలి కదా,ఒకవేళ తన మనసుకు ఎవరైనా నచ్చితే మనమే తెలుసుకుని మన స్థాయిలో ఘనంగా పెళ్లి చేద్దాం,లేదంటే ఈ అబ్బాయి ఫోటో నచ్చితే చేసేద్దాం,మంచి సంబంధం కదా నీ అభిప్రాయం కనుకోమని మన బాగోగులు కోరే సిద్ధాంతి గారు స్వయంగా చెప్పారు” “అలాగే నండి కనుకుంటాను”

అల్లారుముద్దుగా పెంచిన అమ్మ కి అన్నీ తెలుసుకదా, వారం క్రితం సిటీ నుంచి వచ్చిన తర్వాత నాలో జరుగుతున్న మానసిక సంఘర్షణను అమ్మ గమనించిందో ఏమో,”చిన్నా…. ఏమైంది రా హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నీలో మరో కోణం కనిపిస్తుంది చిన్నబోయి ఉంటున్నావు ఏమైంది చెప్పు,” “ఏం లేదు అమ్మా ఎలాగు చదువు మొత్తం పూర్తి చేశాను మంచి మెరిట్ లో సాధించాను తీరా చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనలు ఏం రావడం లేదు, ఇంకా ఎన్ని రోజులు మీకు భారంగా ఉండాలి,ఈ రోజుల్లో కన్నవారిని వదిలిపెట్టి దూరంగా హైదరాబాద్ లో దూరంగా ఉండలేను కదా అని ఆలోచన””కన్నవారికి ఎప్పుడూ కొడుకు భారం కాదురా అన్ని ఒకేసారి జరగవు కదా దేనికైనా సమయం రావాలి,వస్తుంది అప్పటివరకు ఎదురుచూడాలి, పట్నం వెళ్ళే ఆలోచన లేకపోతే ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేస్తు మా కళ్ళముందే ఉండు””అని అమ్మ అన్నది కాని తను నమ్మినట్లు గా లేదు, ఇంతకుమించి చెప్పడానికి నాకు ధైర్యం చాలడం లేదు, ఒకవేళ ధైర్యం చేసుకుని చెపితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు కాని తను ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియకుండా విషయం చెప్పి తీరా తాను దొరక్కపోతే నచ్చిన అమ్మాయి కి దూరమై నేను పడుతున్న బాధలు చూస్తూ అమ్మా నాన్నలు కుదురుగా ఉండలేరు నేనంటే ఆరో ప్రాణం వీళ్ళకి,నేను బాధ పడినా మంచిదే కానీ వీళ్ళకు విషయం తెలియనీయకుండా పంటి బిగువు నా నొక్కిపట్టే ప్రయత్నం చేస్తూ నిజజీవితంలో కూడా నటిస్తున్నా కొంతకాలం”

“భానూ జ్ణాపకాలనే ఊపిరిగా భావిస్తూ గతాన్ని తలుచుకుంటూ ధీర్ఘాలోచనలో తన గదిలో కూర్చుని ఏదో కాలక్షేపం చేస్తున్న దివ్య, అర్చనా అనే నాన్న గారి పిలుపుతో ఈ లోకానికి వచ్చింది,తన గది ప్రక్కనే హాల్లో సోఫాలో కూర్చున్న ప్రకాశ్ కి కాఫీ ఇవ్వడానికి వచ్చిన అర్చన తో, ప్రకాశ్ దివ్య ను అడిగారా ఏముంటుంది,ఆ సిద్ధాంతి మళ్ళీ గుర్తు చేశారు మనకి నచ్చకపోతే వేరే చూస్తారట నాన్చుడు దేనికి ఏదో ఒకటి చెప్బేద్దాం ఇవాళ దివ్య ను అడుగు,”మీరే అడగండి మీ మీద తనకు చాలా నమ్మకం,చాలా గౌరవం మీరంటే ఒప్పుకుంటుంది కదా” “అది కాదు అర్చనా, ఆడపిల్ల మనసు ఆడవారికే తెలుసు నువ్వు అమ్మ వి కాబట్టి నీతోనీ అన్నీ పంచుకుంటుంది,నేను అడిగితే చెపుతుంది కావచ్చు కాని తను మనసులో ఏమండకపోవచ్చు ఒకవేళ ఉంటే ఇంతలా ప్రేమ పంచే నాన్నతో ఎలా చెప్పాలని చెప్పకపోతే ఎలా,తనకు అలాంటి ఆలోచన ఉంటే చేసేద్దాం తన ఆనందం కన్నా ముఖ్యమైనది మనకు ఏం లేదు కదా,ఈ ఫోటో పేరు భరత్ కనుకోమని మాట్లాడుకుంటున్న” సంభాషణలు విన్నది దివ్య,ఇంత ప్రేమ పంచుతున్న అమ్మ నాన్నల కి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదని సరళ కి ఫోన్ చేయాలి అనుకుంది”

“పూర్ణిమ, నిండు పౌర్ణమి లాంటి స్నేహాన్ని అందించే సున్నితమైన మనసు కల అమ్మాయి, దివ్య పదవ తరగతి లో ఉండగా వీడ్కోలు సమావేశం లో వీళ్ళిద్దరికి పరిచయం కలిగింది,ఆ పరిచయం ఒకరిని ఒకరు అర్థం చేసుకుని విడదీయరాని బంధం గా మారిపోయింది,ఒకరంటే ఒకరికి ఆరోప్రాణం,వీళ్ళ జంటని చూస్తే గతజన్మలో బంధాల బాధ్యత లను నెరవేర్చడానికి భగవంతుడే మళ్ళి పుట్టించాడేమో నడిపిస్తుంది, *పూర్ణిమ దివ్యకి తోడు,దివ్య పూర్ణిమ కు నీడ*” అలా ఉంటుంది వీళ్ళ స్నేహం, ఆదివారం కావడంతో కాలయాపన కోసం ఏదో ప్రేమ కథ పుస్తకం చదువుతూ,అందులో ఉన్న కథా,కథనం అమ్మాయి ధైర్యం,పెద్దవారంటే ఉన్నా గౌరవం మర్యాద ఇవన్నీ కలగలిపి నవరసాలతో నిండిన ఆ కథలో పూర్తిగా లీనమై పోయింది పూరి,ఇంతలో ఏం చేశానో నా మనసు అనే కాలర్ టొన్ తో దివ్య నుంచి ఫోన్,తన పేరు పూరి కదా ఎవరినైనా పూర్తిగా గుర్తుపట్టాలని కొంతమంది కాంటాక్ట్ నం ప్రత్యేకమైన కాలర్ ట్యూన్ సెట్ చేసుకుంటుంది తను, టోన్ వినగానే దివ్యా అని గమనించింది,ఏంటి ఇది ఇంత మంచి ప్రణయగాథ చదువుతుండగా ఫోన్ చేసింది తన ప్రణయం ఫలించడం కోసమేనా అనుకుని..హా దివ్య చెప్పవే”పూరి ఏం చెప్పాలి నా జీవితం లో అన్ని పంచుకునే ఏకైక బంధం మనది నీవే ఏదైనా సలహా ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, అమ్మ నాన్నల సంభాషణ లో నాకు అర్ధం ఐంది,ఎవరో అబ్బాయి ఫోటో కూడా పంపించారు మంచి కుటుంబం అంటున్నారు,నాకు భాణూ అంటే ప్రాణం కదనే ఇప్పుడు నేనేం చేయాలి,తన గురించి ఇంకా ఇంట్లో చెప్పలేదు,చెప్పితే ఏమంటారో తెలియదు, ఒప్పుకున్నా తను ఎక్కడ ఉన్నారో తెలియదు,అలాగని తనను మరిచి ఉండలేను, అమ్మ నాన్నల కు చెప్పలేను ఏం చేయాలి,””దివ్యా టెన్షన్ ఎందుకే ముందు అమ్మ వాళ్ళు నీతో విషయం చెప్పిన తర్వాత, ఇప్పుడు ఏం తొందర లేదు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనలు వచ్చేలా ఉంది ఆరునెలల లో ఏదో ఒక జాబ్ దొరుకుతుంది నాకు కాస్తా సమయం కావాలని చెప్పి చూడు ఆ లోపు ఏదో ఒక మార్గం దొరుకుతుంది,” “అంతేనంటావా , అప్పటికి దొరక్క పోతే””పిచ్చా నీకేమైనా అన్నింటిలో అపశకునం పలుకుతావేంటే, పాజిటివ్ గా థింక్ చేయలేవా,మీ ప్రేమ పైన నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఫలిస్తుంది, *పవిత్రమైన ప్రేమకి పంచభూతాలు, ప్రకృతి కూడా సహకరిస్తాయే* ఏం కాదు అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది పూరీ”

“భానూ…””ఆ చెప్పండి నాన్న,””నీ భవిష్యత్తు ఆలోచన ఏమిటి,మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే ఆలోచన ఉందా లేక ఇక్కడే మనకున్న బిజినెస్ లో ఏదైనా సెట్ చేయమంటావా, ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కష్టమే దాని పైన ఆధారపడి ఉండడం కంటే ఏదో ఒక దాంట్లో ప్రవేశం చేస్తే కాస్తా అనుభవం కూడా వస్తుంది కదా, నీకున్న విషయ పరిజ్ఞానానికి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కాని అందుకు అవకాశాలు అంది రావాలి కదా,బాగా ఆలోచించుకో నీకు నచ్చితేనే అనకాపల్లి లో ఉన్న మన జ్యూవెలరీ షాప్ ని కాస్తా నూతనంగా మార్చేసి నీకు ఇచ్చేస్తా ఆ లోపు బిజినెస్ నాలేడ్జ్ కాస్తా సంపాదించుకో, హైదరాబాద్ లో ఏమైనా పెండింగ్ పనులు ఉంటే చూసుకోమని నాయుడు గారు చెప్పారు,పాతకాలపు మనిషి ఐనా మంచి కార్యాదక్షత, అనుభవం గడించిన గొప్ప వ్యక్తి నాయుడు, అడగకుండానే సహాయం చేస్తారు కాని సలహాలు మాత్రం అనడిగితేనే చెపుతారు, అదేమంటే,మనం చేసే ఆర్థిక సహాయం ద్వారా కొన్ని జీవితాలు నిలబడతాయి కాని ఇచ్చే సలహాలు ఎదుటి వారు ఉచితంగా భావించుకుంటే వాళ్ళు పడే ఇబ్బంది కి కారణం మనమవుతాము,తెలిసి తెలియక ఒకరి బాధకు మనం ఎప్పుడూ కారణం కాకూడదు అంటారు,”నాన్నగారు చెప్పిన విషయం బావుంది ఒకసారి హైదరాబాద్ వెళ్ళి దివ్య జాబ్ చేసిన చోటు వెతికితే దొరికే అవకాశం ఉందేమో, లేకపోతే అనకాపల్లి లో ఏదైనా కాలేజీ లో ఫ్యాకల్టీగా చేరితే కాస్తా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది,సిటిలో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా తాను కలుస్తుందేమోనన్న ఆలోచనతో, అలాగే నాన్నగారు మీరూ చెప్పినట్లు గా ఒక నెల రోజుల లో హైదరాబాద్ పనులు పూర్తి చేసుకుని వచ్చేస్తా,ఆ లోపు ప్రకటనలు ఏమైనా వస్తే సరే లేకుంటే ఇక్కడే జాబ్ చూసుకుంటానని చెప్పి, హైదరాబాద్ వెళ్ళే ప్రయత్నం లో ఉన్నారు భాను,రాజు ఒకసారి సిటీ కి వెళ్ళి వద్దాం””హే ఎందుకు రా” “నాన్నగారు ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోమని సలహా ఇచ్చారు, సిటీ లో తను ఉన్నట్లు తెలిస్తే చూసొద్దాం లేకుంటే నా ప్రేమకి తిలోదకాలు ఇచ్చి,అని ఆ మాట అంటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి,””భాణూ అలా కాదురా ప్రపంచంలో ఎక్కడా ఉన్న తనని వెతికి నీ దరికి చేరుస్తాను కాస్తా సమయం ఇవ్వండి చాలు అని చెప్పి రేపే హైదరాబాద్ వెళదాం అనడం తో గుండె నిబ్బరం ఐంది”

“మరునాడు ఎంతో ఆశలతో హైదరాబాద్ వెళ్ళాం కాని మనసులో ఏదో తెలియని అలజడి తను కలుస్తుందా కలవదా కలిస్తే నా మదిలోని భావన ఎలా చెప్పాలి, కలవకపోతే నా జీవిత గమనం ఏంటి అని ఆలోచన,ఏది ఏమైనా దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మనిషి నమ్మకం బండరాయిలో భగవంతున్ని దర్శింపచేస్తుంది అంటారు బ్రతికి ఉన్న ఆ బంధాన్ని నాకు చేరువ చేయడా అని ఓ ఆశ, ఇన్నాళ్ళు గా ఏ రోజు ఈ విధమైన బాధను భరించలేని నాకు గుండె బరువెక్కింది, ఎలాగోలా గమ్యం చేరుకున్నాం కాస్తా రిలాక్స్ ఐనా తర్వాత తను మాటల మధ్యలో హైటెక్ సిటీ లో జాబ్ చేస్తున్నానని చెప్పడంతో ఆ లొకేషన్లో వెతికాం తను చెప్పిన రౌండ్ బిల్డింగ్ దగ్గర కి వెళితే వాచ్ మెన్ అడ్డగించారు,మీరు చేస్తున్న ఉద్యోగం,ఐడి కార్డ్,లేదొ మిమ్మల్ని పంపించిన రెఫరీ ఎవరైనా ఉంటేనే లోపలికి అలో ఉంటుంది అని,లేదండీ దివ్య మాకు తెలిసిన అమ్మాయి,ఏ అమ్మాయి ఐనా మా రూల్స్ మేం బ్రేక్ చేయలేం కదా,తెలిసిన అమ్మాయి ఐతే తనకి ఫోన్ చేసి విషయం చెప్పండి తను అపాయింట్మెంట్ ఇస్తే మీకు అనుమతి వస్తుంది అని,ఏం చేయాలి తోచలేదు ఓకే ఒక్క అవకాశం చేజారుతుంది నిజంగా ఇది పరిక్షనా దేవుడి శిక్ష నా అర్థం కాకుండా నే అక్కడి నుంచి వచ్చేశాం కాని నెక్స్ట్ ఏంటి అనేది ప్రశ్నార్థకం,కదిలిస్తే కాలువలై పోయే కన్నీటి దారలు,ప్రతి సమస్యకు కాలమే పరిష్కారం చెపుతుందని నాకు నేనే ఓదార్చుకుంటూ,నా స్వార్థం కోసం తనను నం అడగకుండా ఇలా చేసుకున్నానేంట్రా అని నన్ను నేనే నిందించుకుంటూ,ఆ దేవుడు తన పరిచయం ఎందుకు కలిగించాడని కాసేపు దేవున్ని తిడుతూ కాస్తా రిలాక్స్ కోసం కళ్ళు మూసుకుని వాలిపోయా”

“పూరి చెప్పి నా మాటలతో రెక్కలు వచ్చినట్లు గా ఉన్న దివ్య భాను ఆచూకీ దేంట్లో ఐనా దొరుకుతుందేమోనని సోషల్ మీడియా లో ఫేస్బుక్, వాట్సాప్,, ట్విట్టర్, ఇన్స్ట్రాగ్రాం ఇలా అన్ని వెతుకుతుంది ఎక్కడా దొరకలేదు,ఈ మహానుభావుడు ఏ కాలం మనిషి ఈ రోజుల్లో ప్రతి వారు సోషల్ మీడియా తో సహవాసం చేస్తుంటే తానేంటో దేంట్లో కనపడడం లేదు,ఔను కదా తనో పుస్తకాల పురుగు కదా ఏ పుస్తకాలు కొరుక్కుంటూ కాలక్షేపం చేశాడో సరిపోతుంది,ఇంకా సాంఘీక మాధ్యమాలా సావాసం ఎందుకు అసలు తనను కలిసేదెలాగా,నేనంటే ఏదో అమ్మాయి ని ఓపెన్ కాలేకపోయాను తను మగవాడు కదా తనైనా ధైర్యం చేయొచ్చు కదా,మొదటి చూపులోనే నేను పడిపోయారా నీ వైఖరి కి,మనసుదోచుకొని మనిషినే కనిపించవేంట్రా బాబు,నిన్నెలా వెతికేది అనుకుంటూనే ఇది అసలు ప్రేమేనా, ఆకర్షణ నిజంగా ప్రేమే ఐతే నాలాంటి అనుభవమే తనకు కలగాలిగా, కలుగుతుందా లేదా,కలిగినా ఈ పుస్తకాల పురుగు పట్టించకుంటాడా ఏంటి అనే భావనతో చేసేది ఏం లేకా పూరిని సంప్రదించాలని అనుకుంది,”

“భానూ ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది తనకోసం వెతకని చోటంటూ లేదు, ఒకవేళ తను జాబ్ మానేసిందేమోరా,ఇంత పెద్ద మహానగరంలో తనను ఎక్కడని వెతకడం,ఇంటికి వెళదాం పదా నాన్న గారు చెప్పినట్టు అక్కడే జాబ్ చేసుకుంటే కాస్తా రిలాక్స్ ఔతావు, ఖచ్చితంగా తను కలుస్తుంది కాని దేనికైనా సమయం రావాలిరా,ఏ కారణం లేకుండా దేవుడు ఏ ఇద్దరు వ్యక్తులను కలపడు,కాని సమయానుసారమే అన్ని జరుగుతాయి అదే కాలధర్మం కదరా,అని భానుతో చెప్పారు రాజా తనకు కూడా ఎక్కడో కాస్తా వీళ్ళుకలుస్తారో లేదోనని ఆందోళన గా ఉంది బయటపడితే భానూ ఇంకా బాధపడతాడని ధైర్యం చెపుతూ ఇంటికి వచ్చేశారు,”
“రాజా తను దొరక్కపోతే నా పరిస్థితి ఏంట్రా అనే భాణూ మాటలకి ఏం చెప్పాలో తోచలేదు ఇలా ఐతే కష్టం మీందు వీనికి ఏదో జాబ్ చూడాలి తద్వారా మనసు రిలాక్స్ ఔతుంది తను ఎక్కడ ఉందో నేనే వెతకాలి, ఖచ్చితంగా ఫలిస్తుంది, స్వార్థం లేకుండా చేసే ఏ పని ఐనా పూర్తి స్థాయిలో విజయవంతం ఔతుంది అని మనసులో అనుకుంటూనే””తను దొరకదు అనే మాటకి అవకాశమే లేదురా సాంఘీక మాధ్యమాలా పుణ్యమా ప్రపంచం మొత్తం చిన్నదిగా మారిపోయింది ఎలాగైనా మిమ్మల్ని కలుపుతానని ధైర్యం చెప్పారు రాజా”

“ఆ రోజు ముక్కోటి ఏకాదశి కావడంతో ఉదయమే లేచింది పూరి,రాత్రి సమయంలో మొబైల్ సైలెన్స్ లో పెట్టి పడుకుంది ఆలయ దర్శనం పూజా కార్యక్రమాలు అయిపోయే సరికి చాలా ఆలస్యంగా మొబైల్ చూసింది చాలా మిస్డ్ కాల్స్ వాయిస్ మెసేజ్ లు ఉన్నాయి,అవి అంతులేని బాధతో దివ్య పంపించినట్లు గా తెలుసుకుని వెంటనే తన దగ్గరకి వెళ్ళింది, దివ్యా ఏమైంది””పూరీ నా ఆశలు నెరవేరేలా గా లేవు తను ఏ సోషల్ మీడియా లో కూడా దొరకడం లేదు,తనను ఎలా వెతకాలి ఇన్నిరోజులు ఏదో రకంగా దొరుకుతాడేమోననే ఆశతో ఎదురుచూస్తున్నా కాని అవకాశాలు ఏం లేవు అమ్మ వాళ్ళకు విషయం చెప్పాలా, వాళ్ళు చూసిన సంబంధం కి ఒకే అనాలా ఏదైనా సలహా ఇవ్వవే,”దివ్యా…ప్రేమనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి దానిలోని ఆనందమేంటో అనుభవిస్తేనే తెలుస్తుంది,మీ ఇద్దరిలో పుట్టిన ప్రేమ స్వచ్ఛమైనది ఖచ్చితంగా గెలుస్తుంది,నువు ఇలా ఆలోచిస్తున్నట్టు గానే తాను కూడా ఇలాగే ఆలోచిస్తారు కదా,ఒక్కరోజులోనే ఇంత దగ్గర చేసిన దేవుడు ఎప్పుడూ విడగొట్టడు కాలమే దీనికి పరిష్కారం చెపుతుంది,అమ్మ నాన్నల కు విషయం చెప్పు, లేకుంటే నేనే చెపుతా నీవంటే ఇంత ప్రేమ ఉన్నది కాబట్టి నీ మనసు అర్థం చేసుకుంటారు,వాళ్ళు ఏమనుకుంటారో అని బాధతో నువు వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే జీవితాంతం బాధ పడతావు,నువు బాధ పడడం నీ ఇష్టమే కాని ఎన్నో ఆశలతో నీ జీవితం లోకి వస్తున్నా మరో వ్యక్తి కి నువు దగ్గర కాలేక అతడి బాధకు కారణమయే హక్కు నీకు లేదు, కాబట్టి దాపరికం లేకుండా మొత్తం చెప్పు తను ఖచ్చితంగా వస్తారు,”అనే పూరి సలహాలు దివ్యకి కాస్తా ఊరటనిచ్చాయి”

“ఇంటికి వచ్చిన భాను కి ఏం తోచడం లేదు కాస్తా రిలాక్స్ ఔదామని విశాఖ బీచ్ కి వెళ్ళారు, అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించలేదు,ఏదో కాలయాపన కోసం వస్తే ఇక్కడేంటి ఇలా బోర్ గా ఉందని పేపర్ తీసుకురావడానికి వెళ్ళాడు,”స్వామి ఇదేంటి ఇక్కడ అందరు వారి వారి పేర్లు అలా చెక్కిస్తున్నారు,””దీనిని పునర్జన్మ శిల అంటారమ్మా ఎవరైనా ఈ శిల పైన పేర్లు రాయించుకుంటే వాళ్ళు ఈ జన్మలో ఏ బంధం కలిగి ఉన్నారో ప్రతి జన్మలో కూడా అలాంటి బంధం కలిగి పుడతారని దార్శనికుల విశ్వాసం,””అలాగా స్వామి మా ఇరువురి పేర్లు రాయించండి, దివ్యా మనోహర్””అలాగే నమ్మా అని స్వామి చెప్పారు,””ఎవరు ఈ దివ్యా నా ఊహల విహంగమా ఏమోనని ఆతృతతో వచ్చాడు కాని తను మరో మనిషి స్వంతమైనదని తెలిసి,తన జ్ణాపకాలు నను ఇంతలా వెంటాడున్నాయేంటి, *ఏ హరివిల్లు విరబూసినా తన దరహాసం* లా కనిపిస్తుంది ఏంటి పరిస్థితి ఎక్కువ సేపు ఇక్కడ ఉంటే మనసుకు బాధ కలుగుతుంది అని ఈనాడు పేపర్ తీసుకుని చదువుతు వెనుదిరిగాడు”అనకాపల్లి లో నాయుడు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓ కార్పొరేట్ కళాశాలలో అన్ని అధ్యాపకుల పోస్ట్ లకు సోమవారం రోజున ఇంటర్వ్యూ ఉందని ఇచ్చిన ప్రకటన చూశాడు, అనకాపల్లి కదా అక్కడ ఈ జాబ్ దొరికితే తను కలిసే అవకాశం ఉంటుంది కదా అని అనుకున్నాడు,”నాన్న ఈ రోజు కాలేజీ లో ఇంటర్వ్యూ కి వెళుతున్న ఆ జాబ్ రావాలని ఆశీర్వచనాలు ఇవ్వండి,” *మనో వాంఛ ఫల సిద్ధిరస్తు* ఇదేంటి నాన్నా నేనేదో అల్ ది బెస్ట్ అంటారనుకుంటే ఏదేదో చెపుతున్నారేంటి,”ఆల్ ది బెస్ట్ అనేది నేటి మాట రా,మనో వాంఛ ఫల సిద్ధిరస్తు అంటే నీ మనసులో ఉన్నా కోరికలన్నీ తీరుతాయని ఆశీర్వాదం నాన్నా,”అంటే నిజంగా అనుకున్న కోరికలు అన్నీ తీరుతాయా నాన్నా,” “తప్పకుండా మన కోరికలలో స్వార్థం లేకుంటే ఖచ్చితంగా తీరుతాయి” అని నాన్నగారు అనడం తొ నా నమ్మకానికి కాస్తా బలం వచ్చింది,ఆ దేవుడు కూడా సహకరిస్తే ఈ జాబ్ తో పాటు నా ప్రేమ కూడా ఫలిస్తుంది అనే ఆశతో వెళ్ళాను,అమ్మో ఏంటి ఇంత కాంపిటీషన్ ఏదో ప్రభుత్వం ఉద్యోగ పరిక్ష రాస్తున్నట్టు,అని అక్కడ ఉన్న అటెండర్ నాని అడిగా ఒక పోస్ట్ 30 మంది ఉన్నారు,మీరు చేయండి మీ అదృష్టాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయమిదె అనడంతో నేను చేశాను, నాన్నగారి ఆశీర్వచనాలు ఫలితంగా ఆ జాబ్ లో సెలెక్ట్ అయ్యాను రెండు రోజుల్లో జాయిన్ కావాలి అని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వస్తూ నాన్న ఆశీస్సులు ఫలితంగా ప్రేమ కూడా ఫలిస్తుంది అనే ఆనందం తో ఇంటికి వచ్చేశాను,”

“దివ్యా ఇంకా ఆలస్యం చేయడం సరి కాదు ఇప్పటికే నీకు ఇచ్చిన సమయం గడిచిపోయింది, అమ్మానాన్నలతో విషయం చెప్పేద్దాం వాళ్ళ ఏమంటారో చూద్దాం,””వాళ్ళు ఏమంటారో అనేది ముఖ్యం కాదు ముందు నాకే ఏ క్లారిటీ రావడం లేదు,తనను తప్ప మరొకరిని నా జీవితంలో భర్త లా ఊహించుకోలేను,వేరే వారితో నా జీవితం పంచుకోలేదు తనకు ఇబ్బంది కలిగించలేను కాని ఏం చేయాలో తెలియడం లేదు,””నీ జీవితం నీ నిర్ణయం నీదే కదా నువ్వే తీసుకోవాలి నీ ఆలోచనలు ఏంటో నాతో చెప్పవే నేను సలహా ఇస్తాను””నాకైతే ఎన్ని రోజులు ఐనా తనకోసం ఎదురు చూడాలని ఉంది,తను దొరక్కపోతే ఇలాగే ఉండిపోతాను అనుకుంటున్నా,”నిచ్చి దివ్యా ఇది జీవితమే సినిమా కాదు, చూస్తూ గడిపేస్తాను అని సర్దుబాటు చేసుకోవడానికి, ఇప్పుడు బాగానే ఉంటుంది,వయసు మీద పడిన తర్వాత ఏం తోడు లేని జీవితం నరకంగా ఉంటుంది పిచ్చి ఆలోచనలు మాని అమ్మ నాన్నల సలహా తీసుకోవడం మంచిది, ఒక్కగానొక్క కూతురివి పెళ్ళి చేయకుండా వదిలేశారు అంటే ఎంత నామూషిగా ఉంటుంది, ముందు చెప్పి చూద్దాం నిజంగా మీ ప్రేమ నిజమే ఐతే ఖచ్చితంగా ఫలిస్థుంది, పిచ్చి పనులతో జీవితాన్ని పాడు చేసుకోకు,తను కూడా నీలా ఆలోచిస్తే తాను కూడా వెతుకుతున్నారేమో కదా,తన పరిస్థితి ఏంటో మనకు తెలియదు,ఏదేమైనా ఈ ప్రపంచం అంతా ప్రేమ మయమే కాబట్టి ఖచ్చితంగా మీ ప్రేమ గెలుస్తుంది”అని పూరి చెప్పడంతో అమ్మనాన్నల దగ్గరకు వెళ్ళింది దివ్యా”

“నాన్న ఇన్నాళ్ళు మీ దగ్గర ఓ విషయం దాచాను, హైదరాబాద్ నుంచి వస్తుండగా ట్రైన్ లో భానూ అని ఓ ఫ్రెండ్ పరిచయం అయ్యారు, మామూలు పరిచయమే ఐనా తను నా పైన చూపిన కేరింగ్ నాకు చాలా సంతోషం కలిగించింది,ఆ ప్రయాణంలో అంత సేపు కలిసే ఉన్నాం ఏమి అనిపించలేదు కాని తనను వదిలేసి వస్తుంటే చాలా బాధేసింది, ఇప్పుడు తను దూరమయ్యాడనే బాధ వెంటాడుతు ఉంది,ఆ రోజు అబ్జర్వ్ చేయలేదు కాని ఇప్పుడు అనిపిస్తుంది అది ప్రేమేనని,ఎలాగైనా తనతో జీవితం పంచుకోవాలని,తను లేకుండా నేను బ్రతకలేనని అనిపిస్తుంది,తన ఆచూకీ తెలుస్తుందేమోనని ఆశతో ఇన్ని రోజులు సమయం అడిగాను,కాని అది కుదిరేలాగా లేదు కాబట్టి తన కోసం ఎన్నాళ్ళైనా ఎదురుచూస్తూ ఇలాగే ఉండిపోవాలని అనుకుంటున్నా,””దివ్యా అవేం మాటలే నిజంగా అది ప్రేమే ఐతే మీరు ఖచ్చితంగా కలుస్తారు, ఇన్నాళ్ళు కలవలేదంటే అదో ఆకర్షణ కావచ్చు,ఫలించని ప్రేమకోసం ఎదురు చూడటంలో ప్రయోజనం లేదు,తను ఈ పాటికే పెళ్ళి చేసుకుని ఉంటాడేమో,తనను ఇబ్బంది పెట్టడం ఎందుకు,మా మాటలు విని భరత్ అనే ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండు,””రెండవ పెళ్ళా అమ్మ””రెండవ పెళ్ళి ఏంటి””ఏ రోజైతే మా మనసులు కలిశాయో ఆ రోజే మా మనువు జరిగిపోయింది, ఇప్పుడు నేను ప్రాణమున్న శిలనే అమాయకుడైనా భరత్ గారిని బాధ పెట్టలేను,*మనసులు కలవని మనువు,మనువే కాదని,ఆ నాటి మనువే చెప్పాడు* నేను ఈ పెళ్లి చేసుకోను, “అనగానే ప్రకాష్”అర్చనా…తనేదో చిన్న పిల్ల ఒక్కగానొక్క కూతురు తనను బాధ పెట్టడం దేనికి మనం ఉన్నాం కదా తనకోసం ఈ మాత్రం చేయలేమా… “”మీరంటున్నది నిజమేనండి కాని తన కాంటాక్ట్ నం కూడా లేదు కదా ఈ విశాల ప్రపంచంలో తనను ఎలా వెతకాలి, ఒకవేళ తను దొరక్కపోతే దొరికినా తను ఒప్పుకోకపోతే””ఖచ్చితంగా దొరుకుతాడు దేనికైనా కాలమే సమాధానం చెపుతుంది, ఒకవేళ దొరక్కపోతే మనతో పాటే మన కూతురు ఉంటుంది,అంతే తప్ప తన మనసు నొప్పించే పని నేనేమి చేయను, అమ్మా దివ్య,నీ ఇష్టమే కానీ తనని వెతికే ప్రయత్నం వదిలేయకు ఎప్పుడూ దొరికినా నాకు చెప్పేయి అంగరంగ వైభవంగా మీ పెళ్ళి జరిపిస్తారు అని చెప్పడంతో దివ్య సంతోషంగా ఉంది,”

భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో మొదటిరోజు ఉద్యోగం లో చేరిన బానూ కాలేజీ కి వెళ్ళాడు,ముందుగా ఎంట్రన్స్ లో ఉన్న స్టాఫ్ వివరాల బోర్డు చూశాడు అందులో ఉన్న దివ్య వాణి MBA అని ఉండడం తో ఒక్కసారిగా షాక్ అయ్యారు,తను నా దివ్య నేనా మరి ఇక్కడ వాణి అని ఉంది,పూర్తి పేరు ఇదే కావచ్చు షాట్ కట్ లో అలా పిలుస్తారేమో మరి,నిజంగా తను నా రాణియే ఐతే ఎంత బావుంటుందో కదా,అని మనసులో అనుకంంటూనే తనే కావాలని ప్రార్థన చేసుకుకుంటూనే ఆఫీస్ లోకి వెళ్ళారు,”భానూ గారు ఇవి మీ టైం టేబుల్ వివరాలు,ఇది కార్పొరేట్ కాలేజి కాబట్టి లీజర్ లో కూడా నెక్స్ట్ క్లాస్ కి ప్రిపేర్ అవుతూనే ఉండాలి”అని ప్రిన్సిపాల్ చక్రధర్ చెప్పడంతో అక్కడి నుంచి తన క్లాస్ లోకి వెళ్ళిపోయారు, దివ్య ఎవరు అనే అనుమానంతో స్టాఫ్ అందరి టైం టేబుల్ చూశాడు ఏ ఒక్క క్లాస్ లో కూడా దివ్య ను భానూ కి కలిసే అవకాశం లేకుండానే ఆ టైం టేబుల్ తయారు చేయబడి ఉంది,ఇదేంటి ఇలా ఉంటే తనను ఎలా కలవను లీజర లో కూడా వీలు కాదు కదా అని తన వివరాలు ఎవరినైన అడగాలా,అడిగితే ఏమనుకుంటారో అనే అనుమానంతో తో అలాగే ఆరునెలల కాలం గడిచిపోయింది, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ లో అనుకోకుండా ఇద్దరికీ ఒకే హాల్ ఇన్విజిలేషన్ డ్యూటీ వేసినట్లు అటెండర్ ద్వారా తెలుసుకుని ఈ రోజు నా కలల రారాణి చూస్తానని సంతోషంగా వచ్చారు,కాని తను ఓ పాతికదాటి పదేళ్ళ ప్రయాణం చేసిన పెద్దావిడ కావడంతో చాలా బాధ పడ్డాడు,ఇక నా రాణి దొరకదనే బాధతో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు,”

అతని ప్రేమే ప్రాణంగా జీవిస్తూ ఇక్కడ దివ్యా,తన రూపమే దైవంగా భావిస్తూ అక్కడ భానూ, ఇద్దరి మధ్య ఈ ఎడబాటును కలిగించిన కాలాన్ని ఏమని నిందించాలి,కలవని జంటను కలపడం సరికాదేమోనని,కలవకుండా కథ సుఖాంతం కాదు ఎలా అనుకుంటూ ఒక రచయితగా చాలా మధన పడ్డాను,భ్రమలో భ్రాంతో తెలియదు,కలో కలవరమో తెలియదు కాని ఆ రోజు రాత్రి ఎవరో తెలియని అమ్మాయి దివ్య లా అ’కనిపించి,నిజ జీవితంలో ఎలాగు కలిసే అదృష్టం లేదు కనీసం ఓ రచయిత గా కలలో ఐనా మమ్మల్ని కలిపితే వచ్చే జన్మలో నైనా మేము కలుస్తామేమో విధిని గెలవలేక ఓడిపోయిన ఈ జంట కథ,ఓ వింత కథలా ముగిస్తే మీలో రచయిత ఊరుకుంటారా,ఇది న్యాయమా అని ప్రశ్నిస్తే ఏం చేయాలో తెలియలేదు చాలా ఆలోచన తర్వాత స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ ఓడి పోకూడదు,ఖచ్చితంగా గెలిచి తీరుతుందనే నా సంకల్పంతో ఇలా….

“భానూ””ఆ అమ్మా చెప్పు””మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ కదరా,ఈ సంవత్సరం లోనైనా నువు ఓ ఇంటి వాడిని కావాలి కదరా అరుణాచల శివుని దర్శనం చేసుకో నీ కోరికలు తీరుతాయి””ఔనా అమ్మా “సరే రేపు ఎలాగు నా ప్రేమ ఫలించాలనే ఆశతో ఉన్నాను కదా,అదే రోజు”ఫిబ్రవరి 14, మహాశివరాత్రి కూడా కలిసి వచ్చింది,నిజంగా ఇది దంపతులు గా పేరొందిన ఆ పార్వతీపరమేశ్వరులు మా జంట కలిపితే బావుండు అనే భావనతో అరుణాచలం బయలుదేరాను, కొత్త గా తొలిసారి దైవ దర్శనం వలననసు ప్రశాంతంగా ఉంది, ప్రకృతి లో అలా సేద తీరుతూ కూర్చుంటే ఆ చల్లగాలికి కనురెప్పలు వాలిపోయాయి,

“పూరీ దర్శనం ఐపోగానే వెళ్ళిపోతున్ధావేంటే కాసేపు అలా రిలాక్స్ ఔదాం పదవే, ఎప్పుడూ ఏదో పనిలో ఉంటాం కదా కనీసం ఈ రోజైనా ప్రకృతిని ఆస్వాదిద్దాం పదా,”అంటూ అక్కడికి వచ్చారు ఇరువురు” “పూరీ…తను భాను లా ఉన్నారు కదా…”భాను లా ఏంటే భాను నే పదా నీ అదృష్టం బావుందే.”హే కాదు మనుషులను పోలిన మనుషులు ఉంటారే..”
ఒకసారి పలకరిస్తే సరిపోతుంది కదా…హే పిచ్చిదానిలా మనమెలా పలకరిస్తామే…నువ్వుండు చిక్కీ ఆ అంకుల్ దగ్గర వాటర్ బాటిల్ ఉంది అడుగు,సరే అమ్మా….”

“”అంకుల్ ఆ మంచినీళ్ళు కావాలి అనే మాటతో తొలి యెత్తి పైకి చూశాడు భాను,కనులముందు ఉన్న దివ్యమైన రూపాన్ని చూస్తూ కలా నిజమా అని ఆలోచన లో ఉండగానే””హే భాను మీరేనా ఏంటి దివ్య ఇది ఇన్నాళ్ళు ఏమైపోయావు,ఇప్పుడైనా నీ నెంబర్ ఇస్తావా …””నం ఏంటి భాను నువు ఓకే అంటే మా దివ్యనే అప్పగిస్తారు అని పూరి చెప్పింది,నిజంగా మన ప్రేమ ఇలా ఫలించింది బాపూ అని ఇద్దరు ఎంతో మురిసి పోయారు”

ఓ రచయిత గా కాలం వేసిన గాలానికి చిక్కిన నిజ జీవితం లో కలవని జంటను కథలో కలపడమనేది కాలం కరుణిస్తుందేమో చూడాలి, కథలో కలిపిన ఈ జంట లాగే ఎంతో ప్రకృతి సహకరించి వాళ్ళ ప్రేమ గెలవాలని మనం కూడా కోరుకుందాం,

చిలకమారి తిరుపతి
స్వరమయూరి
చెన్నూర్
9640908491

Get real time updates directly on you device, subscribe now.