మన భాష….. సామర్లకోట

సమదర్శిని న్యూస్

మనం పరభాషగా చూస్తున్న!
మన భాష వెలగాలంటే!
ముందుగా!…అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి!
ఆపై నాన్ననూ ప్రేమించడం!
ఆపై గురువును పూజించడం!
ఇరుగూ పొరుగు పై ఆత్మీయతను!
సాటివారిపై సమాదరణ గుణం!
మూగజీవులపై దయా జాలీ!
భగవంతునిపై నిజమైన భక్తి!
దేశాన్నీ ప్రేమించే గుణం!
ఆపై ప్రాంతీయ భావం!
అలవడిన నాడు!
నిజంగా! తెలుగు భాష!
అదే! మన మాతృభాష!
అక్షరాల్లో నే కాదు!
అందరి హృదయాల్లో నూ మెరుస్తుంది!
ఆపై అది ప్రపంచ భాషల్లో!
సైతం అగ్రగామియై నిలుస్తుంది!
జన్మకు ఆద్యత అమ్మదైతే!
జీవన పోరాటానికి ఆద్యత!
నోసంగేది నిజంగా!
మన మాతృ భాషే!
అందుకే! ఎలుగెత్తి జేకొట్టు!
తెలుగోడా!
ఆన్ని భాషల కన్నా మిన్న!
మా తెలుగుభాషనీ!

ఎస్.ఎన్.మూర్తి. దోసపాటి.
సామర్లకోట.
9866631877

Get real time updates directly on you device, subscribe now.