ముత్యాల హారాలు-…రూపకర్త రాథోడ్ శ్రావణ్
……………………………..
1)
ముత్యాల హారాలు
మెరసే ఆభరణాలు
విరసేను ముత్యాలు
మురిసేను సమూహాలు
2)
ముత్యాల హారాలు
చతుఃపాద పద్యాలు
అంత్య ప్రాస అందాలు
సాహితీ కిరణాలు
3)
ముత్యాల హారాలు
పసందైన రత్నాలు
అక్షరాల పగడాలు
సాహితీ సౌరభాలు
4)
ముత్యాల హారాలు
తెలుగుతల్లి హారాలు
శోభిలు సప్తస్వరాలు
తెలుగు వెలుగు నాదాలు
5)
ముత్యాల హారాలు
ఛందస్సు మాత్రాలు
అర్థమైన భావాలు
మధురమైన గేయాలు
6)
ముత్యాల హారాలు
తియ్యటి ఫలహారాలు
కమ్మని పూల గంధాలు
తెలుగు తల్లి గీతాలు
7)
ముత్యాల హారాలు
అందమైన పాదాలు
పద భాండ గారాలు
కోకిలమ్మ పాటాలు
8)
ముత్యాల హారాలు
బుడుతలకు మంత్రాలు
మల్లేపూవ్వుల తోటలు
గులాబీ పూల మొగ్గలు
9)
ముత్యాల హారాలు
అష్టాచమ్మా ఆటలు
పసిపాపల గేయాలు
మధురమైన రూపాలు
10)
ముత్యాల హారాలు
రంగు రంగుల దారాలు
దారాలలోని పువ్వులు
తెలుగు తల్లి కుసుమాలు
11)
ముత్యాల హారాలు
సాహితీ గీతాలు
శాంతి సౌభాగ్యాలు
విజయ సోపానాలు
12)
ముత్యాల హారాలు
విరబూసిన మల్లేలు
ప్రగతికి సోపానాలు
సాగిపోయే ఘనులు
13)
ముత్యాల హారాలు
బాలల గలాభాలు
అక్షరాల ఉత్సవాలు
మన తెలుగు అందాలు
14)
ముత్యాల హారాలు
సరస్వతీ శ్లోకాలు
తామర పూదండాలు
మకరంద స్రవంతులు
15)
ముత్యాల హారాలు
గుండ్రని పదసంపదలు
అమ్మ పలుకే అక్షరాలు
త్యాగరాజు కీర్తనలు
16)
ముత్యాల హారాలు
తేనెలొలుకు అందాలు
బాలల జోలపాటలు
సాహితీ సరిగమలు
17)
ముత్యాల హారాలు
అక్షరాల శిఖరాలు
కవుల ఆలోచనలు
అందమైన భావాలు
18)
ముత్యాల హారాలు
చిన్నారుల పలుకులు
సాగిపోయే కవితలు
వెలుగు నిచ్చే దీపాలు
19)
ముత్యాల హారాలు
అమ్మ పలుకే అక్షరాలు
జ్ఞాన జ్యోతి వినయాలు
రుచి నిచ్చే పానియాలు
20)
ముత్యాల హారాలు
తేట తెలుగు మాటలు
ఇంపు సొంపు భాషలు
తెలంగాణ యాసలు
*రాథోడ్ శ్రావణ్,✍️*
ముత్యాల హారంరూపకర్త,
పూర్వ అధ్యక్షులు,ఉట్నూరు సాహితీ వేదిక ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లా