తేది :-13-6-23
శీర్షిక :-అనాధ బాలుడు
గాజుల నరసింహ
నాగటూరు గ్రామం
పల్లవి :-
ఎవరికోసమో వృధా చేయకు నీ కన్నీటి బొట్టు
నేలతల్లి ఒడిలో పసిపాపవే నువ్వు నీమీద్దొట్టు..
అనుపల్లవి :-
కళ్లుమూసి కన్నది కాలం నిన్ను
నెత్తికేక్కి కళ్ళు ఎగతాళి చేస్తున్నది లోకం నిన్ను
బాధపడకు బరువెక్కినా హృదయం….
ఎక్కడా లేదులే నువ్వు చేసిన నేరం…
చరణం :-:1
రాసివుంటె రాత రాసినోడు నీ తలరాత
దిగివచ్చి పెడతాడు నీకు మేత
కష్టం మనిషికి సహజం ఎదరు ఈదటమే మనిషి లక్ష్యం..
ధరిరాని క్షణాలకోసం ఎన్నడూ ఎదరు చూడకు నేస్తం
నీ శ్రమనే నీకు ఇచ్చు ఫలితం
తప్పదు ఇక నీకు రోజు యుద్ధం ..|| పల్లవి ||
చరణం :-2
వీధికుక్కలా నిన్ను తరిమినా
వెంపగొడ్డులా నిన్ను బాదినా
ఓర్చుకో.. ఒడిదుడుకులను ఎదురుకో…
ఉగ్గపట్టి నిగ్గధీసి తిరగరాసుకో మళ్ళీ నీ చరిత
తెలుసుకో చేతగాన్ని వాణ్ని చేరాదీయదు ఈ సమాజం
ఎవరి చావు పుట్టుకలు ఎక్కడో ఎరుగదులే ఈ లోకం
కన్నీళ్ళే దిగమింగుతూ దాహాలే తీర్చుకో..
ప్రతీదీ గమనిస్తూ నిన్ను నీవు మలుచుకో..
||పల్లవి ||
చరణం :- 3
కడుపు నింపినోడు పరమాత్ముడు
కలనైనా మరిచిపోకు వాణ్ని ఎప్పుడు
కస్సు బస్సు లాడు సంఘం కాదునీకు నేస్తం
కటిక చీకటికి కరుణ ఉండదు నేస్తం
బండరాతికి బరువు తెలియదు లే దాని మనసే శూన్యము
బాధపడకు తల్లిదండ్రి లేరని చింతించకు చిరిగిన బతుకు నీదని
ఈ లోకమే నీకు చేయకపోదు సలాంలు
నీ జీవిత చక్రం చక్కగ ఉంటే..
గాజుల నరసింహ
9177071129
హామీపత్రం :- ఈ రచన నసొంతం అని తెలుపుతున్నాను