ఎన్నికల సంస్కరణల దిక్సూచి* *(పుస్తక సమీక్ష .సమీక్షకులు, రచయిత రాథోడ్ శ్రావణ్)*

*ఎన్నికల సంస్కరణల దిక్సూచి*
*(పుస్తక సమీక్ష .సమీక్షకులు, రచయిత రాథోడ్ శ్రావణ్)*
_________________________
తెలుగు భాష పై బాల్యం నుండి అభిరుచి పెంచుకున్న కవి మార్గం కృష్ణమూర్తి గ్రామీణ ప్రజల ‌నిజ జీవితాలను చదివి అర్థం చేసుకున్నారు.వృత్తి భాద్యతలు తీరాక తెలుగు సాహిత్యంలో తెలుగు తల్లికి అక్షర సేద్యం చేస్తు ముందుకు దూసుకుపోతున్నారు.

సృజనాత్మక కళా నైపుణ్యం గల ఉన్నత విద్యావంతుడు,సమాజ మార్పుకొరకు, కవితలు, గేయాలు, వ్యాసాలు, శతకాలు, సీస,కంద పద్యాలు,తొణుకులు, నానీలు,హైకూలు,షాడోలు, ముత్యాల హారాలు, మధురిమలు, నిజాలు,మణిపూసలు, ఐడియాలు,ఇష్టపదులు,వ్యంజకాలు బుల్లెట్ పాయింట్స్, స్వరాలు, అక్షర మాలికలు,కిటుకులు, నినాదాలు, సామెతలు మొదలగు ఎన్నియో ప్రక్రియలు , కవితలు , గేయాలు , కథలం రచించిన
ప్రముఖ యూట్యూబ్ చానల్ వ్యాఖ్యాత, శతకకర్త, సాహితీ వేత్త, కథరచయిత, కవి
*గౌ, శ్రీ, మార్గం కృష్ణమూర్తి, గ్రామం సూరిపెల్లి , వరంగల్ జిల్లాలో జన్మించారు* తండ్రి పేరు కీ.శే.మార్గం రామయ్య తల్లి పేరు శ్రీమతి మార్గం రాంబాయమ్మ , మారుమూల పల్లెలో పుట్టి ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివారు.
ఎం.కాం,ఐసిడబ్లుఎఐ గృపూ వన్,ఎంఆర్ ఎన్ విద్య ఆంగ్ల మాధ్యమంలో పూర్తి చేసినారు.
వృత్తి రీత్యా హైదరాబాద్ యందు స్థిరపడి
అకౌంట్స్ ఆఫీసర్ గా సేవలందించారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ప్రతి సాహితీ సృజన, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుచూ
*”MARGAM SAHITYA YOUTUBE CHANNEL”*
ద్వారా వివిధ సాహిత్య ప్రక్రియలపై ,ఇతర అంశాలపై ఇప్పటి వరకు 124 వీడియోలు, శార్ట్స్ సృష్టించి తెలుగు భాష సాహిత్యాన్నీ ప్రచారం, ప్రసారం చేస్తూ , సమాజాన్ని చైతన్యపరుస్తున్న ముఖ్య కవులలో శ్రీ మార్గం కృష్ణమూర్తి గారు ఒకరు కావడం ప్రశంసనీయం.

ఉట్నూర్ సాహితీ వేదిక ఆదిలాబాద్ జిల్లా అద్వర్యంలో రూపొందించిన తెలుగు సాహిత్యంలో నూతన లఘు వచన కవితా ప్రక్రియ ముత్యాల హారంలో శ్రీ మార్గం కృష్ణమూర్తి గారు శతాధిక ముత్యాల హారాలు లిఖించి‌ *సాహితీ ముత్యాల హార పురస్కారం* పొందారు.అప్పటి నుండి మార్గం గారు సుపరిచిత మిత్రులైనారు,
అతి తక్కువ కాలంలో చాలా మంది సాహితీ వేత్తలు రూపొందించిన వివిధ ప్రక్రియల్లో శతకాలు రచించి సాహితీ వేత్తలచే ప్రశంసలు అందుకొని జీవనదిలా ప్రవహిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ రమణీయంగా సామాజిక స్పృహతో
*”ఎన్నికల సంస్కరణలు”*
అనే అంశంపై తెలుగు సాహిత్యంలో ఉస్మానియా తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు
*గౌ శ్రీ ప్రశాంత్ కుమార్ ఎల్మల గారు*
రుపొందించిన నూతన లఘు వచన కవితా ప్రక్రియ
తొణుకుల్లో రోజుకు రెండు
*తొణుకులు*
అల్లుకుంటు ఈ ప్రక్రియలో అక్షరాల ఒక వంద నలభై నాల్గు తొణుకులు లిఖించారు.

*కొన్ని తొణుకులు పరిశీలిద్దాం:-*
“ఓటు భారతీయులందరీ
జన్మ హక్కు మరువరాదు
ఓటుతో రాజ్యాధికారము
సాధించడం ఏమి కష్టం కాదు..!”

భారత దేశం ప్రజాస్వామ్య దేశం. దేశంలో దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు, ఓటు మన జన్మహక్కు గురించి తొణుకులో తక్కువ మాటాల్లో చక్కగా వివరించారు.

“ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ
తప్పక జారీ చేయవలెను
ఆధార్ కార్డు ఉన్న వారే
ఎన్నికల్లో నిలబడవలెను..!”

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వారు రూపొందించి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తప్పక జారీ చేయవలయును, ఆధార్ కార్డు ఉన్న వారు మాత్రమే ఎన్నికల్లో పోటి చేయవలయును అని సూచన చేస్తూ ఆధార్ సామాన్యని హక్కు ‌అని ఆధార్ కార్డు యొక్క ‌ప్రాధాన్యతను వివరించారు.

”అవినీతిని అరికట్టాలంటే
ఒకే ఒక్క చక్కటి ఉపాయము
అయిదేండ్ల కొకసారైనా
రాష్ట్రపతి పాలనతో సాధ్యము..!”

పై తొణుకుల్లో తక్కువ మాటల్లో చక్కగా చెప్పారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టాలంటే ఒకే ఒక్క చక్కటి ఉపాయము ఐదు సంవత్సరాల కొక‌సారైన దేశంలో రాష్ట్రపతి పాలన విధించాలని అప్పుడే అవినీతిని కొంత వరకు అరికట్టవచ్చు అని చక్కగా వివరించారు.

“టి.ఎన్ శేషన్ వలే కఠిన
నిబంధనలమలుపరుచాలి
టి.ఎన్ శేషన్ లా చరిత్రలో
శాశ్వతంగా నిలిచిపోవాలి..!”

భారత పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ టి.ఎన్ శేషన్ గారు భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి, అతను తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల వల్ల భారతదేశ ఎన్నికల వ్యవస్థ మారిపోయిందని అటువంటి గొప్ప పనులు చేసిన గొప్ప వ్యక్తులు చరిత్రలో నిలిచిపోతారు అని అన్నారు.

తెలుగు సాహితీ క్షేత్రంలో తొణుకులు ప్రక్రియలో ఈయన వెలువరిస్తున్న తొలి పుస్తకం
*ఎన్నికల సంస్కరణల కరదీపిక*
ఇప్పటి వరకు దాదాపు ఇరువై పైన పుస్తకాలకు సంబంధించిన సామాగ్రిని సంసిద్ధత చేసినప్పటికీ అవి అనివార్య కారణాలతో అముద్రితంగా ఉన్నాయి.ఇప్పటి వరకు పది పురష్కారాలు అందుకున్న మార్గం గారు అనేక పుస్తకాలు ముద్రించి మరెన్నో పురష్కారాలు అందుకోవాలని, ఈ పుస్తకంలో పదసౌజన్యంతో లయబద్దమైన, సరళమైన పదాలు జీవిత సత్యాలు మంచి ఆణిముత్యాలు కూర్చినట్లుఉన్నాయి. ఈ పుస్తకం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభంజనాన్ని సృష్టించాలని, ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటూ మిత్రులు గౌ, శ్రీ, మార్గం కృష్ణమూర్తి గారి కలము నుండి మరింత సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు జాలు వారాలని వారి కీర్తి ప్రతిష్టలు నలుమూలలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.
*ప్రక్రియ:-తొణుకులు*
*వెల:99/-*
*ప్రతులకు:-*
మార్గం కృష్ణ మూర్తి
కె.ఎస్.ఆర్.కాలనీ
ఇంటి.68, రోడ్ నెం .5
అమీన్ పూర్, సంగారెడ్డి, హైదరాబాద్ చ.నెం 9441841314
*పుస్తక సమీక్షకులు*
*రాథోడ్ శ్రావణ్*
రచయిత ,ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక , ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా
చరవాణి సంఖ్య:- 9491467715.

Get real time updates directly on you device, subscribe now.