ఈ ప్రపంచం ఒక సత్రం..

ఈ ప్రపంచం ఒక సత్రం..

మనం కేవలం సత్రం లో కొంతకాలం ఉండే యాత్రికులం. సత్రం మనదికాదు; జీవితం స్థిరమైంది కాదు. మన స్వప్నాలు చంచలమైనవి; అధికారం; డబ్బు ఎల్లకాలం మనల్ని అంటిపెట్టుకుని ఉండలేవు…. అధికార దాహానికో ; సంపద కాంక్షతోనో విలువైన జీవితం జారవిడుచుకోరాదు…కీర్తికోసం ఎంతకాలం పరుగులు తీస్తాము . ఒకరోజు పరుగుల పందెరం నుండి హటత్తుగా నిషక్రమిస్తాము.మన ప్రయాణం ఎందుకో జరిగిందో తరచి చూసుకోలేని దుస్థితి!!ఆఖరికి సంపద :కీర్తి ‘బంధుమిత్రులు మనల్ని అప్రాధాన్యత జాబితాలోకి నెట్టెస్తారు. మనతో ఎంతో ప్రేమగా జర్నీ చేసిన వారి విలువను గుర్తించక మధ్యలోనే వదిలేస్తాము. ఆఖరి దుఃఖం శూన్యంతో నిండిపోతుంది. స్మృతుల గాయం సల్పుతూనే ఉంటుంది.అందుకే ఈ చరాచర జగత్తు నిరంతరం మారుతూఉంది. నువ్వెలా స్తబ్దంగా ఉంటావు. జడుడివై ఎందుకు పడివుంటావు నువ్వే ఒక తోటమాలివో!!ఒక పూదోట యజమానివో ఎందుకు కారాదు

Dr తుమ్మల దేవరావ్

Get real time updates directly on you device, subscribe now.