కథ……. శ్రీనివాస్

సమదర్శిని ఐ ఎస్ బి ఎన్ మ్యాగజైన్ సమూహం ప్రచురణ నిమిత్తం

కథాంశం : నిశ్శబ్దం
రచన : యడ్ల శ్రీనివాసరావు
ఊరు : విజయనగరం

ఆ ఊరి పేరు అమ్ముల పురం. అచ్చట సవరం చేసేవారు అనగా మంగలి వారు అధికం.కానీ అక్కడ వారి జీవితం గడపడానికి అదో గతి. ఎన్నో సంవత్సరాల గడుస్తున్నాయి కానీ ఆ ఊర్లో చైతన్యం లేదు చాలా రోజులు గడిచింది. రమణ కుమార్ అనే ఇంట్లో ఒక మారుడు పుట్టాడు . అయితే అతడు ఎన్నో అభ్యుదయ భావాలు కలిగి ప్రజా ప్రశాంతి సేవా సమితి పెట్టి ఎందరికో చేతనైన సాయం చేస్తూ వచ్చాడు. ఒకరోజు వినాయకరావు అనే ఒక పెద్ద సర్పంచ్ ఆ ఊర్లో ఒకతని నిర్ధాక్షణంగా కొట్టడం శిక్షలు వేయడం తన అసలు నీరు గారు పోయే. దీంతో రమణ కుమార్ కుమారుడు వసంత్ కుమార్ ఎలా అయితేనేం తిరగబడాలి అనుకొని ఒక పెద్ద ఉద్యమ లేవనెత్తాడు. దీంతో ఆ ఊర్లో ఒక ముసలి అవ్వ మృతి చెందింది. అవ్వ పేరు అపూర్వ. అయితే అవ్వ నాలుగు ఇల్లు అడుక్కునేది. ప్రతిరోజు అలా అడుక్కుంటూ భిక్షాటనం చేయగా వచ్చిన డబ్బులు సంచుల్లో కుక్కి దాస్తుంది. నలుగురు నాలుగు ఇళ్లల్లో పెట్టింది తింటూ కాలం గడుపుకుంటుంది . దీంతో తనకు ఏ లోటు లేదు అనుకోకుండా ఒక అర్ధరాత్రి నిశ్శబ్దమై తను మరణించింది. అదే ఒక విషాద గడియ . తన వద్ద డబ్బులు ఉన్నాయని ఎవరు తెలుసుకోలేకపోయారు. చివరికి ఆ ముసలి అవ్వకం కుష్టు వ్యాధి అని తనని సర్పంచ్ వినాయకరావు ముట్టుకోవడం కూడా చేయలేదు.. ఎవరు ముట్టిన శిక్ష విధిస్తా అని దండోరా వేయించాడు.. ఇంతలో అనుకోకుండా ఆ మూటలు బయట నెట్టాడు . అనుకోకుండా 11 మూటలు లోంచి డబ్బు గబగబా గల గల గల పారి సాగింది . సెలయేరుల చూస్తుంటే ఆ డబ్బు సర్పంచ్ వినాయక రావుకి కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే డబ్బు చూసి మైకం కమ్మి వినాయకరావు దహన కాండకు ముందుకు రమ్మని పిలుపు , మాట్లాడడం దండోరా వేయించి ఒక సామాన్య ముష్టిది కుష్టిది అని చూడకుండా దానికి దహనం చేసి ఆ డబ్బుతో పంచాయతీ ఆఫీస్ కట్టుకున్నారు. మిత్రమా నిశ్శబ్దం సుమా డబ్బు ఉంటే కొండమీద కోతైన కిందకి వస్తది. అది లేకుంటే అంతా నిశ్శబ్ద భ్రమణం కాబట్టి వినాయకరావు వసంతరావు చేసిన సేవని గుర్తించకపోయినా, తను చెప్పిన మాటలకి చైతన్య పడకపోయినా లొంగ క పోయిన డబ్బు చూశారా ఎలా మార్చేసిందో. నాన్న వాళ్ళు లేని లోకంలో అందరూ వచ్చారు. నేనున్నానంటూ కుష్టిని సైతం ముట్టారు . ఇదే లోకం నిశ్శబ్దం. తెలుసుకో మిత్రమా ఉంటా. ఇదే రంగుల ప్రపంచం ఇదే వింత లోకం ఇదే వింత విడ్డూరం అని వసంతరావు అందరికీ తెలియపరచి కనువిప్పు చేశాడు.

———————+++————-
హామీ పత్రం
ఈ కథ నా యొక్క సొంత రచన

Get real time updates directly on you device, subscribe now.